Home /News /sports /

IND VS SA SECOND TEST LIVE UPDATES THREE BIG WICKETS FROM SHARDUL THAKUR MAKES TEAM INDIA COME BACK IN THIS GAME SRD

Ind Vs Sa : లార్డ్ శార్దూల్ ఠాకూర్ తీన్ మార్.. మళ్లీ రేసులోకి టీమిండియా..

Ind Vs Sa (PC : BCCI)

Ind Vs Sa (PC : BCCI)

Ind Vs Sa : లంచ్ కు ముందువరకు సాఫీగా సాగిన సౌతాఫ్రికా ఇన్నింగ్స్.. శార్దూల్ దెబ్బకి కుదేలైంది. సౌతాఫ్రికా బ్యాటర్ల జోరుకు కళ్లెం వేసిన లార్డ్ శార్దూల్ ఠాకూర్.. మళ్లీ టీమిండియాను రేసులో నిలిపాడు.

    దక్షిణాఫ్రికాతో వాండరర్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు (Ind Vs Sa) లో టీమిండియా (Team India) కమ్ బ్యాక్ ఇస్తోంది. ప్రస్తుతం నాలుగు వికెట్లు తీసి సౌతాఫ్రికా జోరుకు బ్రేకులు వేసింది రాహుల్ సేన. అయితే, టీమిండియా మళ్లీ రేసులోకి రావడానికి ముఖ్య కారణం లార్డ్ శార్దూల్ ఠాకూర్ (Lord Shardul Thakur). బంతితో మాయ చేశాడు శార్దూల్ ఠాకూర్. లంచ్ కు ముందు సౌతాఫ్రికాను కోలుకోని దెబ్బ తీశాడు. టీమిండియాను విసిగిస్తున్న సౌతాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ (Dean Elgar), పీటర్సన్ లతో పాటు ప్రమాదకర బ్యాటర్ డసెన్ ను కూడా పెవిలియన్ బాట పట్టించాడు. వరుసగా మూడు వికెట్లు తీసి లంచ్ కు ముందు సఫారీలకు షాకిచ్చిన ఠాకూర్.. టీమిండియాలో జోష్ నింపాడు.

    లంచ్ కు ముందువరకు సాఫీగా సాగిన సౌతాఫ్రికా ఇన్నింగ్స్.. అతడి రాకతో కుదేలైంది. కేవలం 5 ఓవర్లే వేసిన అతడు 8 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ఆ ఐదు ఓవర్లలో రెండు మెయిడిన్ లు ఉండటం గమనార్హం. రెండో టెస్టులో తొలి రోజు భారత్ ను తక్కువ స్కోరుకే కట్టడిచేసిన సఫారీలు.. నిన్న 18 ఓవర్లు ఆడి ఒక వికెట్ మాత్రమే కోల్పోయారు. ఆట రెండో రోజు కూడా సారథి డీన్ ఎల్గర్, యువ ఆటగాడు కీగన్ పీటర్సన్ లు మంచిగానే ఆరంభించారు.


    వీరిద్దరూ రెండో వికెట్ కు 74 పరుగులు జోడించారు. ఇన్నింగ్స్ 38వ ఓవర్ వేసిన ఠాకూర్.. ఆ ఓవర్ లో ఐదో బంతికి డీన్ ఎల్గర్ ను ఔట్ చేశాడు. తక్కువ ఎత్తులో వచ్చిన బంతిని కట్ చేయబోయిన ఎల్గర్.. కీపర్ రిషభ్ పంత్ కు క్యాచ్ ఇచ్చాడు. సారథి నిష్క్రమించినా డసెన్ తో కలిసి స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు పీటర్సన్. ఈ క్రమంలో పీటర్సన్ (118 బంతుల్లో 62) టెస్టులలో తొలి అర్థ సెంచరీ చేసుకున్నాడు. సాఫీగా సాగుతున్న పీటర్సన్ ను కూడా 42.6 ఓవర్లో ఠాకూర్ బోల్తా కొట్టించాడు. ఠాకూర్ వేసిన బంతిని స్లిప్స్ లో ఉన్న మయాంక్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు పీటర్సన్.

    ఇది కూడా చదవండి : దండం రా నాయనా మీ ఇద్దరికీ.. మీరు టీమిండియాకు చేసిన సేవలు ఇక చాలు..

    ఇక ఠాకూర్ తన తర్వాత ఓవర్లో డసెన్ (17 బంతుల్లో 1) ను కూడా పెవిలియన్ కు పంపాడు. దీంతో మొత్తం ఈ ఇన్నింగ్సులో మూడు వికెట్లు పడగొట్టాడు. లంచ్ తర్వాత కూడా భారత బౌలర్లు విజృంభిస్తే సౌతాఫ్రికా లోయరార్డర్ ను పడగొట్టడం పెద్ద పనేంకాదు. ప్రస్తుతం క్రీజులో టెంబ బవుమా , వికెట్ కీపర్ వెరెన్నే (0 నాటౌట్) ఆడుతున్నారు. వీరి తర్వాత జాన్సేన్ ఒక్కడే కాస్త బ్యాటింగ్ చేయగలడు. ఆ తర్వాత చెప్పుకోదగ్గ బ్యాటర్ లేడు. దీంతో టెయిలాండర్లపై టీమిండియా ఒత్తిడి పెంచి ఫస్ట్ ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించే ఛాన్సుంది.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Cricket, IND Vs SA, India vs South Africa, KL Rahul

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు