ఇప్పటివరకు సౌతాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్ గెలవని టీమిండియా (Team India) ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. ఈ ప్రయత్నంలోనే తొలి అడుగును విజయవంతంగా పూర్తి చేసింది. ఇదే ఊపుతో సెకండ్ టెస్ట్ కూడా గెలవాలన్న కసితో ఉంది కోహ్లీసేన. సఫారీ గడ్డపై తొలిసారి టెస్ట్ సిరీస్ గెలిచే అద్భుతమైన అవకాశం రావడంతో జొహన్నెస్‌బర్గ్‌లోనే తమ లక్ష్యాన్ని అందుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఇక, ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది టీమిండియా. అయితే, ఈ మ్యాచ్ లో కోహ్లీ అప్పర్ బ్యాక్ గాయం తో దూరమయ్యాడు. దీంతో, కేఎల్ రాహుల్ టీమిండియాకు కెప్టెన్ గా వ్యవహరించాడు. విరాట్ కోహ్లీ స్ధానంలో హనుమ విహారీ జట్టులోకి వచ్చాడు. ఇప్పటి వరకు ఓటమి ఎరుగని వాండరర్స్ స్టేడియంలో భారత్ అద్భుతం చేసేందుకు సై అంటోంది.
ఇక, రెండు మార్పులతో సౌతాఫ్రికా బరిలోకి దిగింది. డికాక్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అతని ప్లేస్ లో కైల్ వీర్నే జట్టులోకి వచ్చాడు. ఇక, డుయన్ ఓలీవర్ జట్టులోకి వచ్చాడు.30 ఏళ్ల నుంచి సఫారీ గడ్డపై మ్యాచ్‌లు ఆడుతున్న టీమిండియా.. వాండరర్స్‌లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టెస్ట్ మ్యాచ్ ఓడిపోలేదు.
Toss Update - KL Rahul has won the toss and elects to bat first in the 2nd Test. Captain Virat Kohli misses out with an upper back spasm.#SAvIND pic.twitter.com/2YarVIea4H
— BCCI (@BCCI) January 3, 2022
ఆ రికార్డును ఇప్పుడు కూడా కొనసాగించాలని కోహ్లీసేన టార్గెట్‌గా పెట్టుకుంది. 1997లో రాహుల్ ద్రవిడ్ ఫస్ట్ సెంచరీ చేయడం, 2006లో సౌతాఫ్రికా ఫస్ట్ టెస్ట్ విక్టరీ ఈ మైదానంలోనే వచ్చాయి. 2018లో విరాట్ ఓవర్‌సీస్ టెస్ట్ విక్టరీ కూడా ఈ మైదానం నుంచే మొదలైంది. దీంతో, అచ్చొచ్చిన మైదానంలో విజయం సాధించి సిరీస్ విజయంతో చరిత్ర సృష్టించాలని కోహ్లీసేన భావిస్తోంది.
తుది జట్లు :
టీమిండియా :
కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, , అజింక్యా రహానే, రిషభ్ పంత్, హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్
సౌతాఫ్రికా : డీన్ ఎల్గర్, కైల్ వెర్నీన్(వికెట్ కీపర్), ఐడెన్ మార్క్రామ్, కీగన్ పీటర్సన్, రాస్సీ వాన్ డెర్ డ్యూసెన్, టెంబా బావుమా, మార్కో జాన్సెన్, కగిసో రబడ, కేశవ్ మహరాజ్, ఎంగిడి, డుయన్ ఓలీవర్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.