IND VS SA SECOND TEST LIVE UPDATES TEAM INDIA SETS FIGHTING TOTAL ON BOARD AGAINST SOUTH AFRICA SRD
Ind Vs Sa : సౌతాఫ్రికా ముందు ఫైటింగ్ టోటల్.. తెలుగు ప్లేయర్ కీలక ఇన్నింగ్స్..
Ind Vs Sa (PC : Twitter)
Ind Vs Sa : రెండో టెస్ట్ రసవత్తరంగా మారింది. పుజారా, రహానే హాఫ్ సెంచరీలకు తోడు తెలుగు ప్లేయర్ హనుమ విహారీ కీలక ఇన్నింగ్స్ తో టీమిండియా సౌతాఫ్రికా ముందు ఫైటింగ్ టోటల్ ఉంచింది.
రెండో టెస్ట్ లో టీమిండియా, సౌతాఫ్రికా (Ind Vs Sa) నువ్వా-నేనా అన్న విధంగా పోరాడుతున్నాయ్. కాసేపు టీమిండియా (Team India) తమ బ్యాటింగ్ జోరు చూపిస్తే.. ఆ తర్వాత సౌతాఫ్రికా బౌలర్లు సత్తా చాటారు. దీంతో, ఈ టెస్ట్ లో మంచి రసపట్టులో ఉంది. ఇక, టీమిండియా తమ రెండో ఇన్నింగ్స్ లో 266 పరుగులకు ఆలౌటైంది. హనుమ విహారీ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. 40 పరుగులతో తెలుగు క్రికెటర్ అజేయంగా నిలిచారు. ఇక, టీమిండియా 239 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. సౌతాఫ్రికా టార్గెట్ 240 పరుగులు. ఇక, టీమిండియా సీనియర్ బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా (53), అజింక్యా రహానే(58) ఎట్టకేలకు తమ వరుస వైఫల్యాలకు ఫుల్స్టాప్ పెట్టారు. సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో ఈ ఇద్దరు ఫ్లాఫ్ స్టార్స్ హాఫ్ సెంచరీలతో రాణించారు.
వరుస వైఫల్యాల నేపథ్యంలో తమ కెరీర్‌కు చావో రేవోగా మారిన ఈ ఇన్నింగ్స్‌లో ఈ ఇద్దరూ సూపర్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. వీరితో పాటు శార్దూల్ ఠాకూర్ (28), రవిచంద్రన్ అశ్విన్ (16) కూడా బ్యాటింగ్ లో మెరుపులు మెరిపించడంతో టీమిండియా ఫైటింగ్ టోటల్ సెట్ చేసింది.
ఈ ఇన్నింగ్స్ లో 62 బంతుల్లోనే పుజారా హాఫ్ సెంచరీ సాధించడం విశేషం. పుజారాకు ఇది కెరీర్లోనే రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ. తాను బ్యాటింగ్ చేస్తున్నంతసేపు విమర్శకులకు సమాధానం చెప్పాలనే కసితోనే ఆడాడు. మరోవైపు రహానే సైతం ధాటిగా ఆడుతూ పరుగులు రాబట్టాడు. బౌలర్‌తో సంబంధం లేకుండా దూకుడు కనబర్చాడు.
Innings Break!#TeamIndia all out for 266 (Pujara 53, Ajinkya 58) in the second innings. Set a target of 240 for South Africa.
ఓలివర్ వేసిన 33వ ఓవర్లో వరుస బంతుల్లో రెండో బౌండరీలు బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే డ్రింక్స్ బ్రేక్ అనంతరం.. రబడా బౌలింగ్‌లో ఫోర్ బాదిన రహానే(78 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 58).. అదే ఓవర్ చివరి బంతికి కీపర్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. దీంతో, మూడో వికెట్‌కు నమోదైన 111 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఈ ఇద్దరూ 122 బంతుల్లో 100 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకోవడం విశేషం.
ఇక రబడా వేసిన తన మరుసటి ఓవర్లోనే చతేశ్వర్ పుజారా(86 బంతుల్లో 10 ఫోర్లతో 53)ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. రివ్యూ తీసుకున్నా ఫలితం లేకపోయింది. ఆ తర్వాత పంత్ డకౌటయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన అశ్విన్ చూడచక్కని బౌండరీలతో ఆకట్టుకున్నాడు. అయితే, లెగ్ సైడ్ అనవసరపు షాట్ ఆడబోయి వికెట్ కీపర్ కు చిక్కాడు.
అయితే, ఆ తర్వాత వచ్చిన శార్దూల్ ఠాకూర్ ఉన్నంతసేపు ధనాధన్ క్రికెట్ ఆడాడు. కేవలం 24 బంతుల్లో 28 పరుగులు సాధించాడు. అతని ఇన్నింగ్స్ లో ఐదు ఫోర్లు, 1 సిక్సర్ ఉన్నాయ్. ఇక, భారీ షాట్ ఆడబోయి బౌండరీ మీద క్యాచ్ ఇచ్చి పెవివిలయన్ బాట పట్టాడు శార్దూల్. ఆఖర్లో బుమ్రా, శార్దూల్ సాయంతో హనుమ విహారీ కీలక పరుగులు చేశాడు. సౌతాఫ్రికా బౌలర్లలో రబాడా, ఎంగిడి, జన్ సెన్ తలా మూడు వికెట్లు తీశారు.
ఇక సౌతాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో 229 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ఆ జట్టుకు 27 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. పీటర్సన్ (118 బంతుల్లో 62; 9 ఫోర్లు), తెంబా బవుమా (60 బంతుల్లో 51; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలు చేశారు. శార్దుల్ ఠాకూర్ (7/61) చిరస్మరణీయ బౌలింగ్ ప్రదర్శనతో చెలరేగాడు. భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 202 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.