IND VS SA SECOND TEST LIVE UPDATES TEAM INDIA IN DEEP TROUBLE LOSING 6 WICKETS AND HANUMA VIHARI SHOULD BE KEY FACTOR SRD
Ind Vs Sa : టీమిండియా జోరుకు రబడా బ్రేకులు.. తెలుగు ప్లేయర్ పైనే భారం..
Ind Vs Sa ( PC : BCCI)
Ind Vs Sa : రెండో టెస్ట్ లో టీమిండియా, సౌతాఫ్రికా నువ్వా-నేనా అన్న విధంగా పోరాడుతున్నాయ్. కాసేపు టీమిండియా తమ బ్యాటింగ్ జోరు చూపిస్తే.. ఆ తర్వాత సౌతాఫ్రికా బౌలర్లు సత్తా చాటారు. దీంతో, ఈ టెస్ట్ లో మంచి రసపట్టులో ఉంది.
జోహెన్నెస్ బర్గ్ వేదికగా సౌతాఫ్రికా- టీమిండియా (India Vs South Africa)ల జరుగుతున్న రెండో టెస్ట్ రసవత్తరంగా మారింది. మూడో రోజు ఆటలో ఫస్ట్ టీమిండియా బ్యాటర్లు జోరు చూపించి తమ జట్టును ఆధిక్యంలో నిలిపితే.. ఆ తర్వాత సౌతాఫ్రికా బౌలర్ రబాడా మూడు కీలక వికెట్లు తీసి.. తన జట్టును రేస్ లో నిలిపాడు. లంచ్ సమయానికి టీమిండియా ఆరు వికెట్లు కోల్పోయి పరుగులు 188 పరుగులు చేసింది. ప్రస్తుతం 161 పరుగుల ఆధిక్యంలో టీమిండియా ఉంది. ఈ టెస్ట్ లో పట్టు సాధించాలంటే టీమిండియా మరో 100 పరుగులైనా చేయాల్సి ఉంది. ప్రస్తుతం క్రీజులో హనుమ విహారీ (6), శార్దూల్ ఠాకూర్ (4) ఉన్నారు. రబాడా కీలక మూడు వికెట్లు తీసి టీమిండియాను దెబ్బ తీశాడు. లంచ్ విరామానికి కొద్ది ముందు అశ్విన్ (16) వికెట్ తీసి.. టీమిండియాను కష్టాల్లోకి నెట్టాడు లుంగి ఎంగిడి.
రెండు వికెట్ల నష్టానికి 85 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఆరంభించిన టీమిండియాకు వెటరన్ ప్లేయర్లు సూపర్ స్టార్ట్ అందించారు. రెండో టెస్టులో పుజారా, రహానే తమ హాఫ్ సెంచరీలతో టీమిండియాను ఆదుకున్నారు. ఈ ఇన్నింగ్స్ లో రిషబ్ పంత్ డకౌటవ్వడం విశేషం.
విరాట్ కోహ్లీ గైర్హాజరీ నేపథ్యంలో కచ్చితంగా ఆడాల్సిన బాధ్యత వారి భుజాల మీద పడింది. దీంతో ఈ ఇద్దరూ నిలకడగా ఆడి అభిమానులకు టెస్టు క్రికెట్ మజాను పంచడమే గాక తలో హాఫ్ సెంచరీ సాధించి భారత్ కు ఆధిక్యాన్ని పెంచారు. తొలి టెస్టుతో పాటు రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో విఫలమైన ఛతేశ్వర్ పుజారా.. 85 బంతులాడి 53 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు కూడా ఉండటం విశేషం.
ఇక ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో డకౌట్ అయి తీవ్ర విమర్శల పాలైన రహానే కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేసి ఫర్వాలేదనిపించాడు. 78 బంతులాడిన రహానే.. 58 పరుగులు చేశాడు. ఇందులో 8 ఫోర్లు, ఒక సిక్సర్ కూడా ఉంది. ఈ ఇద్దరూ కలిసి మూడో వికెట్ కు 111 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని జోడించారు. అయితే హాఫ్ సెంచరీలు పూర్తి చేసి భారీ స్కోరు దిశగా కన్నేసిన ఈ జోడీని రబాడా విడదీశాడు.
రబాడా బౌలింగ్ లో రహానే.. వికెట్ కీపర్ వెరెన్నేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అదే రబాడా.. పుజారాను ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు. ఏదేమైనా గత కొద్దికాలంగా ఫామ్ లేమితో తంటాలు పడుతూ.. జట్టులో స్థానం కోల్పోయే ప్రమాదంలో పడ్డ ఈ ఇద్దరు తమలో ఆటను సరియైన టైమ్ లో వెలికి తీశారు.
అంతకుముందు రెండో రోజు ఆటలో ఓవర్నైట్ స్కోరు 35/1తో ఆట మొదలు పెట్టిన దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్లో 229 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ఆ జట్టుకు 27 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. శార్దూల్ ఠాకూర్ ఆరు వికెట్లతో సత్తా చాటిన సంగతి తెలిసిందే.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.