IND VS SA SECOND TEST LIVE UPDATES TEAM INDIA IN DEEP TROUBLE AFTER LOSING EARLY THREE WICKETS SRD
Ind Vs Sa : లంచ్ సమయానికి మూడు వికెట్లు డౌన్.. కష్టాల్లో భారత్.. తెలుగు ప్లేయర్ కి భలే ఛాన్స్..
Team India (PC : BCCI)
Ind Vs Sa : మరోసారి టీమిండియా సీనియర్ ప్లేయర్లు నిరాశపర్చారు. పుజారా మూడు పరుగులు చేస్తే.. రహానే గోల్డెన్ డకౌట్ గా వెనుదిరిగాడు. దీంతో, టీమిండియా కష్టాల్లో పడింది.
సౌతాఫ్రికాతో మూడు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ లో టీమిండియా కష్టాల్లో పడింది. లంచ్ సమయానికి టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది. మరోసారి సీనియర్ ప్లేయర్లు పుజారా, రహానే నిరాశపర్చారు. ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్ (19 పరుగులు), హనుమ విహారి (4 పరుగులు) ఉన్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు మరోసారి ఓపెనర్లు మంచి ఆరంభాన్నే ఇచ్చారు. వరుస బౌండరీలతో చెలరేగిన మయాంక్ అగర్వాల్ సూపర్ టచ్ లో కన్పించాడు. అయితే, జట్టు స్కోరు 36 పరుగుల వద్ద మార్కో జన్ సెన్ బౌలింగ్ లో కీపర్ కి క్యాచ్ ఔటయ్యాడు మయాంక్. ఈ ఓపెనర్ (37 బంతుల్లో 26 పరుగులు) చేశాడు. ఆ తర్వాత వచ్చిన పుజారా తన జిడ్డు బ్యాటింగ్ తో కొంచెం సేపు సౌతాఫ్రికా బౌలర్ల సహానాన్ని పరీక్షించాడు. అయితే, ఓలివర్ బౌలింగ్ లో మూడు పరుగులు చేసిన పుజారా బవుమాకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
ఇక, ఆ తర్వాత వచ్చిన రహానే గోల్డెన్ డకౌట్ గా వెనుదిరిగాడు. ఓలివర్ బౌలింగ్ లో కీగన్ పీటర్సన్ కి క్యాచ్ పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత వచ్చిన తెలుగు ప్లేయర్ హనుమ విహారి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు. జట్టులో తన స్థానాన్ని సుస్ధిరం చేసుకోవాలంటే హనుమ విహారికి ఇదో బెస్ట్ ఛాన్స్. ఈ మ్యాచులో మంచి ఇన్నింగ్స్ ఆడితే.. తర్వాత గేమ్ లో హనుమ విహారీని కంటిన్యూ చేసే అవకాశం ఉంది. సౌతాఫ్రికా బౌలర్లలో ఓలివర్ రెండు వికెట్లు, జన్ సెన్ ఓ వికెట్ తీశారు.
ఇక, ఈ మ్యాచ్ కు టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. సరిగ్గా మ్యాచ్‌కు ముందు చివరి క్షణంలో అప్ప బ్యాక్ స్పామ్ ఇంజ్యూరితో తప్పుకున్నాడు. దాంతో కేఎల్ రాహుల్ తాత్కలిక సారథిగా జట్టును నడిపిస్తున్నాడు. రాహుల్ సారథ్య బాధ్యతలు స్వీకరించడంతో ఈ మ్యాచ్‌లో యార్కర్ల కింగ్ జస్ప్రీత్ బుమ్రా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అయితే ఫిట్‌నెస్‌కు ప్రతిరూపంగా నిలిచే విరాట్ కోహ్లీ ఇలా గాయంతో మ్యాచ్‌కు దూరమవ్వడం అందర్నీ షాక్‌కు గురిచేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.