Home /News /sports /

IND VS SA SECOND TEST LIVE UPDATES AFTER SHARDUL THAKUR BRILLIANT SHOW TEAM INDIA FIGHTING IN JOHANNESBURG SRD

Ind Vs Sa : శార్దూల్ జిగేల్.. రసవత్తరంగా రెండో టెస్ట్.. ఆ ఇద్దరిపైనే భారం..

Ind Vs Sa

Ind Vs Sa

Ind Vs Sa : ఫస్ట్ శార్దూల్ సూపర్ షో.. ఆ తర్వాత పుజారా మెరుపు బ్యాటింగ్ వెరసి రెండో టెస్ట్ రసవత్తరంగా మారింది. పుజారా ఇదే జోరును రేపు కొనసాగిస్తే టీమిండియా పటిష్టస్థితిలో నిలిచే అవకాశం ఉంది.

    జోహెన్నెస్ బర్గ్ వేదికగా సౌతాఫ్రికా- టీమిండియాల జరుగుతున్న రెండో టెస్ట్ రసవత్తరంగా మారింది. శార్దూల్ ఠాకూర్ సూపర్ షోకి తోడు.. ఆఖర్లో పుజారా మెరుపులతో టీమిండియా మంచి ఫైట్ ను ఇస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. ఓపెనర్లు ఇద్దరూ రాహుల్, మయాంక్ ఔటైనా.. సీనియర్ ప్లేయర్లు పుజారా, రహానే ఆఖర్లో దూకుడుగా ఆడటంతో టీమిండియా ప్రస్తుతం 58 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. పుజారా 42 బంతుల్లో 35 పరుగులు చేయడం విశేషం. పుజారా తో పాటు 11 పరుగులతో రహానే ప్రస్తుతం క్రీజులో ఉన్నాడు. రాహుల్ (8) పరుగులు చేసి జన్ సెన్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఇక, మయాంక్ అగర్వాల్ బంతిని సరిగ్గా అంచనా వేయడంలో విఫలమై వికెట్ల ముందు దొరికాడు. మయాంక్ అగర్వాల్ 23 పరుగులు చేశాడు. జన్ సెన్, ఓలివర్ చెరో వికెట్ తీశారు.

    ఇక, అంతకుముందు.. శార్దూల్ ఠాకూర్(7/61) ఏడు వికెట్లతో దుమ్మురేపాడు. దాంతో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 79.4 ఓవర్లలో 229 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ఆ జట్టుకు 27 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. సఫారీ జట్టులో కీగన్ పీటర్సన్(118 బంతుల్లో 9 ఫోర్లతో 62) టెంబా బవుమా(60 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 51) హాఫ్ సెంచరీలతో రాణించగా.. డీన్ ఎల్గర్(120 బంతుల్లో 4 ఫోర్లతో 28), కైల్ వెరీన్(72 బంతుల్లో 2 ఫోర్లతో 21), మార్కో జాన్సెన్(34 బంతుల్లో 3 ఫోర్లతో 21), కేశవ్ మహరాజ్(29 బంతుల్లో 3 ఫోర్లతో 21) విలువైన పరుగులతో కీలక భాగస్వామ్యాల్లో పాలుపంచుకున్నారు. భారత బౌలర్లలో శార్దూల్‌కు అండగా మహమ్మద్ షమీ(2/52) రెండు వికెట్లు తీయగా.. జస్‌ప్రీత్ బుమ్రా(1/49) ఓ వికెట్ పడగొట్టాడు.

    35/1 ఓవర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించిన సౌతాఫ్రికా అద్భుతమైన ఆరంభాన్ని అందుకుంది. పీటర్సన్(118 బంతుల్లో 9 ఫోర్లతో 62), డీన్ ఎల్గర్(120 బంతుల్లో 4 ఫోర్లతో 28) భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ వారి సహనానికి పరీక్షగా నిలిచారు. ఇక లంచ్ బ్రేక్‌కు ముందు శార్దూల్‌కు బంతినివ్వడంతో అతను సత్తా చాటాడు.

    వరుస విరామాల్లో మూడు వికెట్లు తీసి టీమిండియాను మంచిస్థితిలో నిలిపాడు. అయితే, టెంబా బవుమా ఆ అవకాశాన్ని భారత బౌలర్లకు ఇవ్వలేదు. కైల్ వెరీన్‌తో కలిసి భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. ఓవైపు కైల్ వెరీన్ డిఫెన్స్‌కు పరిమితమైనా మరోవైపు టెంబా బవుమా వేగంగా పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే 6 బౌండరీలతో పాటు ఓ సిక్సర్ కూడా బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.


    క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని శార్దూలే విడదీసాడు. కైల్ వెరీన్‌ను వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. దీంతో, ఐదో వికెట్‌కు నమోదైన 60 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఇక తన మరుసటి ఓవర్‌లోనే హాఫ్ సెంచరీ హీరో టెంబా బవుమాను కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చి శార్దూల్ కెరీర్‌లో తొలిసారి 5 వికెట్ల ఘనతను అందుకున్నాడు. రబడాను షమీ ఔట్ చేయడంతో సౌతాఫ్రికా 191/7 స్కోర్‌తో టీ బ్రేక్‌కు వెళ్లింది.

    ఇది కూడా చదవండి : పోర్న్ స్టార్ గా మారిన కార్ రేసర్ రెనీ గ్రేసీ వారం సంపాదన తెలిస్తే మైండ్ బ్లాకే..!

    ఇక టీ బ్రేక్ అనంతరం టెయిలండర్లను ఔట్ చేయడానికి కూడా భారత బౌలర్లు శ్రమించాల్సి వచ్చింది. కేశవ్ మహరాజ్, మార్కో జాన్సెన్ భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ పరుగులు చేశారు. బుమ్రా, షమీ బౌలింగ్‌‌లో ఎదురొడ్డి నిలిచారు. ఈ క్రమంలో బంతులను తమ శరీరానికి తాకించుకున్నారు. ఇక కేశవ్ మహారాజ్‌ను బుమ్రా బౌల్డ్ చేయగా.. జాన్సెన్ పోరాడాడు. ఈ క్రమంలో భారత స్కోర్‌ను అధిగమించి ఆధిక్యాన్ని అందించాడు. ఇక జాన్సెన్ జోరుకు బ్రేక్ వేసిన శార్దూల్.. లుంగి ఎంగిడిని కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చి సఫారీ ఇన్నింగ్స్‌ కు తెరదించాడు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Cheteswar Pujara, Cricket, IND Vs SA, India vs South Africa, KL Rahul

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు