Home /News /sports /

IND VS SA ROHIT SHARMA REPLACED BY PRIYANK PANCHAL WHO IS PANCHAL AND WHY BCCI SELECTED HIM FOR BIG TOUR JNK

IND vs SA: రోహిత్ శర్మ స్థానంలో జట్టులోకి వచ్చిన ప్రియాంక్ పాంచల్ ఎవరు? అతడిని ఎంపిక చేయడం వెనుక కారణాలు ఏంటి?

రోహిత్ శర్మ స్థానంలో ఎంపికైన ప్రియాంక్ పాంచల్ ఎవరు?

రోహిత్ శర్మ స్థానంలో ఎంపికైన ప్రియాంక్ పాంచల్ ఎవరు?

IND vs SA: గాయం కారణంగా రోహిత్ శర్మ దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమయ్యాడు. అతని స్థానంలో 31 ఏళ్ల ప్రియాంక్ పాంచల్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న భారత్-ఎ జట్టుకు ప్రియాంక్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అతను ఒక మ్యాచ్‌లో ఓపెనింగ్ చేస్తూ 96 పరుగులు చేశాడు. ఇది కాకుండా.. అతను జట్టులో ఎంపిక కావడానికి చాలా పెద్ద కారణాలు ఉన్నాయి.

ఇంకా చదవండి ...
    టీమ్ ఇండియా (Team India) మరో రెండు రోజుల్లో దక్షిణాఫ్రికా పర్యటనకు (South Africa Tour) బయలుదేరాల్సి ఉన్నది. అయితే టెస్టు జట్టు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) నెట్స్‌లో గాయపడ్డాడు. దీంతో అతడు పర్యటనకు దూరం కావల్సి వచ్చింది. రోహిత్ శర్మ స్థానంలో గుజరాత్ రంజీ కెప్టెన్, ఓపెనర్ ప్రియాంక్ పాంచల్‌ను (Priyank Panchal) సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఇటీవల దక్షిణాఫ్రికాలో పర్యటించిన ఇండియా-ఎ జట్టుకు (India A Team) కూడా ప్రియాంక్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అతను మూడు ఇన్నింగ్స్‌ల్లో 40 సగటుతో 120 పరుగులు చేశాడు. ఒక మ్యాచ్‌లో అతను 96 పరుగుల ఇన్నింగ్స్ కూడా ఆడాడు. ఇప్పుడు రోహిత్ శర్మ స్థానంలో 31 ఏళ్ల ప్రియాంక్‌కు ఎందుకు చోటు కల్పించారనే ప్రశ్న తలెత్తుతోంది. టీమ్ ఇండియా తరపున ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడని ప్రియాంక్ పాంచల్‌ను రోహిత్‌కు ప్రత్యామ్నాయంగా ఎందుకు ఎంపిక చేశారనే ప్రశ్న అందరి మదిని తొలిచేస్తున్నది.

    రోహిత్ శర్మ స్థానంలో ప్రియాంక్ పాంచల్‌ని ఎంచుకోవడానికి 5 బలమైన కారణాలు ఉన్నాయి. మొదటిది.. ఇటీవల భారత్-ఎ జట్టుతో కలిసి దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లాడు. అక్కడ అతను ఒక మ్యాచ్‌లో ఓపెనింగ్ చేస్తూ 96 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. దక్షిణాఫ్రికాలోని బౌన్సీ పిచ్‌, ఫాస్ట్‌పేస్‌ బౌలర్లను ఎదుర్కుంటూ ఓపెనింగ్‌లో 96 పరుగులు చేయడం అంత సులభం కాదు. ఇది సాంకేతికంగా బలంగా ఉన్న.. ఇప్పటికే అంతర్జాతీయ బౌలర్లను ఆడిన అనుభవం ఉన్న బ్యాట్స్‌మన్ మాత్రమే చేయగలడు. ప్రియాంక్ ఈ రెండు పారామీటర్స్‌కు సరిగ్గా సరిపోయాడు.


    భారత టెస్టు జట్టులో ప్రియాంక్ ఎంపిక కావడానికి రెండో ప్రధాన కారణం భారత్-ఎ జట్టుతో అతడికి సుదీర్ఘ అనుబంధం ఉండటమే. దక్షిణాఫ్రికా వెళ్లడానికి కంటే ముందే భారత్-ఎ జట్టుతో కలిసి ప్రియాంక్ చాలా దేశాల్లో పర్యటించారు. అతను ఇంతకుముందు 2019లో ఇండియా-ఎ జట్టుతో కలిసి వెస్టిండీస్‌కు వెళ్లాడు. అతను అదే సంవత్సరం శ్రీలంకతో స్వదేశంలో ఇండియా ఏ తరపున కూడా ఆడాడు. రెండు సందర్భాల్లోనూ ప్రియాంక్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఆ తర్వాత శ్రీలంక-ఎతో జరిగిన మ్యాచ్‌లో ప్రియాంక్ అనధికారిక టెస్టులో ఒకే రోజు 160 పరుగులు చేశాడు.

    Pakistan vs West Indies: టీ20 ఇంటర్నేషనల్‌లో వెస్టిండీస్‌పై పాకిస్తాన్ రికార్డు విజయం.. సిరీస్‌లో 1-0తో ఆధిక్యం


    ఆ సమయంలో శ్రీలంక-ఎ జట్టులో అకిల ధనంజయ, లక్షన్ సండకన్ వంటి స్పిన్నర్లు కూడా ఉన్నారు. వెటరన్ బ్యాటర్లు కూడా వారిద్దరినీ ఆడేందుకు ఇబ్బంది పడ్డారు. కానీ.. అలాంటి బౌలర్లను ఎదుర్కొంటూ ప్రియాంక్ ఒక భారీ ఇన్నింగ్స్ ఆడాడు. ఆ సిరీస్‌లో భారత్ 2-0తో శ్రీలంక-ఎపై విజయం సాధించింది. వెస్టిండీస్ పర్యటనలో 2 అనధికారిక టెస్టుల్లో భారత్-ఎ విజయంలో ప్రియాంక్ కూడా ముఖ్యమైన పాత్ర పోషించాడు. ఆ తర్వాత పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జరిగిన రెండో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ యాభై పరుగులు చేశాడు.

    Double Hatrick : క్రికెట్ లో అద్భుతం.. ఆరు బంతుల్లో ఆరు వికెట్లు.. మనోడే దుమ్మురేపాడు..!




    ప్రియాంక్‌కు అనుకూలంగా ఉన్న మూడవ విషయం ఏమిటంటే.. గత కొన్ని సంవత్సరాలుగా అతను దులీప్ ట్రోఫీలో ఇండియా ఏ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో ఒకడిగా ఉన్నాడు. ప్రియాంక్ తొలిసారిగా 2016-17 రంజీ ట్రోఫీ సీజన్‌లో వెలుగులోకి వచ్చాడు. ఆ సీజన్‌లో అతను గుజరాత్ తరపున 1310 పరుగులు చేశాడు. అదే ఏడాది గుజరాత్ చాంపియన్‌గా నిలిచింది. ప్రియాంక్ పాంచల్ మలేరియాతో పోరాడుతున్నప్పటికీ ఇండియాలో జరిగిన ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో ఏ బ్యాట్స్‌మెన్ చేయనన్ని ఎక్కువ పరుగులు చేశాడు. 2017-18లో రంజీ ట్రోఫీలో గుజరాత్‌ తరఫున టాప్ స్కోరర్‌గా కూడా నిలిచాడు. అతను 7 మ్యాచ్‌ల్లో 542 పరుగులు చేశాడు. 2018-19లో కూడా 9 మ్యాచ్‌ల్లో 898 పరుగులు చేశాడు.

    Actresses who dated cricketers : స్టార్ క్రికెటర్లను గాఢంగా ప్రేమించి.. పెళ్లి విషయంలో డకౌట్ అయిన హీరోయిన్లు వీళ్లే..


    రాహుల్ ద్రవిడ్ భారత్-ఎ జట్టుతో కోచ్‌గా చాలా కాలం ప్రయాణించాడు. ద్రవిడ్ 2015 నుండి 2019 వరకు ఈ జట్టుతో ఉన్నాడు. ఈ సమయంలో ప్రియాంక్ పాంచల్ బ్యాటర్‌గా జట్టులోకి వచ్చాడు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా పాంచల్ బ్యాటింగ్ చేయగలడని ద్రావిడ్‌కి బాగా తెలుసు. ద్రావిడ్ నుంచి తాను చాలా నేర్చుకోవాల్సి ఉందని ప్రియాంక్ స్వయంగా ఈ విషయాన్ని చెప్పాడు. ప్రియాంక్‌కి 100 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది. ఇందులో 24 సెంచరీలు, 25 హాఫ్ సెంచరీలతో మొత్తం 7011 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని సగటు 45.52గా ఉంది. అతను మీడియం పేస్ బౌలింగ్ కూడా చేస్తాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఇప్పటి వరకు 14 వికెట్లు తీశాడు.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:John Kora
    First published:

    Tags: India vs South Africa, Rahul dravid, Rohit sharma, Team india, Virat kohli

    తదుపరి వార్తలు