Home /News /sports /

IND VS SA PLAY HAS HEEN OFFICIALLY CALLED OFF FIFTH T20I ABANDONED DUE TO RAIN SRD

IND vs SA : ఫలితాన్ని డిసైడ్ చేసిన వరుణుడు.. మరోసారి టీమిండియాకు తప్పని నిరాశ..

PC : BCCI

PC : BCCI

IND vs SA : సిరీస్ డిసైడర్ మ్యాచులో ఫలితాన్ని వరుణుడు డిసైడ్ చేశాడు. దీంతో, టీమిండియా కలకు మరోసారి ఆశాభంగం తప్పలేదు.

    అనుకున్నదే జరిగింది. స్వదేశంలో సఫారీ జట్టుపై నెగ్గాలన్న టీమిండియా కలలకు వరుణుడు అడ్డు పడ్డాడు. దక్షిణాఫ్రికా (South Africa), భారత్ (India) మధ్య సిరీస్ విజేతను తేల్చే చివరిదైన ఐదో టి20 మ్యాచ్ కి అడ్డు పడ్డ వరుణడు ఫలితాన్ని మార్చేశాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఐదో టీ20 మ్యాచ్‌కి రద్దయింది. దీంతో తొలి రెండు మ్యాచుల్లో సౌతాఫ్రికా, ఆ తర్వాత రెండు మ్యాచుల్లో టీమిండియా గెలవడంతో సిరీస్ 2-2 తేడాతో డ్రాగా ముగిసింది. టాస్ తర్వాత మ్యాచ్ ఆరంభానికి కొన్ని సెకన్ల ముందు వర్షం ప్రారంభం అయింది. దీంతో.. ఒక్క బంతి కూడా వేయకుండా ఆటను వాయిదా వేశారు అంపైర్లు. అయితే, వెంటనే వర్షం ఆగిపోవడంతో.. మ్యాచ్ ను 19 ఓవర్లకు కుదించారు. మ్యాచ్ 7.50 గంటలకు ప్రారంభం అయింది.

    ఆ తర్వాత టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 3.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 28 పరుగులు చేసింది. ఓపెనర్లు ఇద్దరూ పెవిలియన్ బాట పట్టాడు. ఇషాన్ కిషన్ 7 బంతుల్లో 15 పరుగులు, రుతురాజ్ 12 బంతుల్లో 10 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టారు. పడిన రెండు వికెట్లు లుంగి ఎంగిడికే దక్కాయ్. మరోసారి వరుణుడు రీఎంట్రీ ఇవ్వడంతో మ్యాచ్ ను నిలిపివేశారు అంపైర్లు.



    వర్షం తగ్గుతుందేమోనని గంటన్నరకు పైగా ఎదురుచూసిన అంపైర్లు, ఎంతకీ వరుణుడు శాంతించకపోవడంతో మ్యాచ్‌ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో సిరీస్ డిసైడర్ రద్దయ్యింది. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ డ్రా చేసుకున్న రెండో భారత కెప్టెన్‌గా నిలిచాడు రిషబ్ పంత్.




    సిరీస్‌లో 6 వికెట్లు తీసిన సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది. ఇక, కప్పును రెండు జట్ల కెప్టెన్లు షేర్ చేసుకున్నారు. ఇంతకుముందు 2019లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భారత జట్టు, సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌ని 1-1 తేడాతో డ్రా చేసుకుంది. ఆ సిరీస్‌లోనూ వర్షం కారణంగా ధర్మశాలలో జరగాల్సిన టీ20 మ్యాచ్ రద్దు అయింది. మరోసారి ఆ సీన్ ఇప్పుడు బెంగళూరులో రిపీట్ అవ్వడంతో ఫ్యాన్స్ నిరాశకు లోనయ్యారు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Cricket, IND Vs SA, India vs South Africa, Rishabh Pant, Team India, Virat kohli

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు