Home /News /sports /

IND VS SA ODI SERIES SHIKHAR DHAWAN IN SHARDUL THAKUR OUT RAVICHANDRAN ASHWIN DOUBT HERE TEAM INDIA PREDICTED PLAYING XI AGAINST SOUTH AFRICA SRD

Ind Vs Sa ODI Series : శిఖర్ ధావన్, అశ్విన్ లకు చోటు దక్కేనా..? తొలి వన్డేకి భారత తుది జట్టు ఇదే..!

Team India

Team India

Ind Vs Sa ODI Series : సౌతాఫ్రికా వన్డే సిరీస్ టీమిండియాలోని చాలా మంది ఆటగాళ్లకు అగ్ని పరీక్షగా నిలవనుంది. కెప్టెన్ గా రాహుల్, కోచ్ గా రాహుల్ ద్రావిడ్.. సీనియర్ ప్లేయర్లుగా కోహ్లీ, ధావన్ లకు ఈ సిరీస్ సవాల్ విసరనుంది.

  30 ఏళ్ల కల సాకారం చేసుకోవాలని సౌతాఫ్రికా గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా (Team India)కు భంగపాటే ఎదురైంది. టెస్టు సిరీస్ లో 2-1 తేడాతో ఓడిపోయింది. ఇప్పుడు మరో పరీక్షకు రెడీ అయింది. భారత్-దక్షిణాఫ్రికా మధ్య 3 వన్డేల సిరీస్ (IND vs SA ODI Series) జనవరి 19 నుంచి బోలాండ్ పార్క్ స్టేడియంలో ప్రారంభం కానుంది. విరాట్ కోహ్లీ (Virat Kohli)ని కెప్టెన్సీ నుంచి తప్పించిన తర్వాత టీమిండియాకు ఇదే తొలి సిరీస్. విరాట్ స్థానంలో రోహిత్ శర్మ (Rohit Sharma) వన్డే కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అయితే గాయం కారణంగా అతడు వన్డే సిరీస్‌ కూడా దూరమయ్యాడు. ఈ సిరీస్‌లో కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. కేఎల్ రాహుల్ (KL Rahul) కు ఇది అగ్ని పరీక్ష లాంటిది. ఈ సిరీస్ కోసం భారత్ సన్నాహాలు ప్రారంభించింది. 2016 అక్టోబర్ తర్వాత ఏ ఫార్మాట్‌లోనైనా విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా కాకుండా ఫస్ట్ టైమ్ ఓ ప్లేయర్‌గా బరిలోకి దిగబోతుండటంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

  రోహిత్ శర్మ లేని జట్టును కేఎల్ రాహుల్ ఎలా నడిపిస్తాడనేది ఆసక్తికరం. యువ ఆటగాళ్లతో కూడిన జట్టులో అవకాశం ఎవరిని వరిస్తుందో అనేది కూడా చర్చనీయాంశమైంది. మరోవైపు.. టెస్టు, వన్డే కెప్టెన్సీ నుంచి వైదొలిగిన తర్వాత విరాట్‌కి ఇదే తొలి సిరీస్. మరోవైపు అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ సెంచరీ చేసి 25 నెలలు గడిచాయి.

  ఇటువంటి పరిస్థితుల్లో, కెప్టెన్సీ ఒత్తిడి నుంచి విముక్తి పొందిన కోహ్లీ ఎలా ఆడతాడన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గత రెండేళ్లుగా 12 వన్డేల్లో 46.66 సగటుతో 560 రన్స్ చేశాడు. పైగా 2018 సౌతాఫ్రికా పర్యటనలో కోహ్లీ దుమ్మురేపాడు. మూడు మ్యాచ్‌ల్లో ఓ సెంచరీ, హాఫ్ సెంచరీతో 286 రన్స్ చేశాడు. మళ్లీ అదే పెర్ఫామెన్స్ రిపీట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక విరాట్ కోహ్లీ ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు రానున్నాడు.

  ఆఖరి క్షణంలో రోహిత్ శర్మ గాయంతో తప్పుకోవడంతో జట్టులోకి వచ్చిన శిఖర్‌ ధావన్‌కు ఈ సిరీస్ చావోరేవో లాంటిదే. ద్వితీయ శ్రేణి టీమ్ కెప్టెన్‌గా శ్రీలంక పర్యటనలో జట్టును నడిపించిన శిఖర్ ధావన్.. ఆ తర్వాత జట్టుకు దూరమయ్యాడు. టీ20 ప్రపంచకప్‌లో ఆడుతాడని భావించినా సెలెక్టర్లు అతన్ని తీసుకోలేదు. 36 ఏళ్ల ధావన్.. టీమ్ లాంగ్ ఫార్మాట్స్ ప్రణాళికల్లో లేడు. ఈ సిరీస్‌లో విఫలమైతే అతని కెరీర్‌కు ముగింపు పడ్డట్లే.

  రోహిత్ గైర్హాజరీలోనే జట్టులోకి వచ్చిన ధావన్‌కు ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్‌ల రూపంలో గట్టి పోటీ ఎదురవుతుంది. ఒక్క మ్యాచ్‌లో రాణించకపోయినా అతను బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశం ఉంది. అయితే అనుభవం దృష్ట్యా తొలి వన్డేలో కేఎల్ రాహుల్‌తో అతనే ఓపెనింగ్ చేసే అవకాశం ఉంటుంది.

  మిడిలార్డర్‌లో కోహ్లీతో పాటు సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే గత రెండేళ్లుగా వన్డేల్లో కేఎల్ రాహుల్ ఎక్కువగా మిడిలార్డర్‌లోనే బ్యాటింగ్ చేశాడు. 69.25 సగటుతో 554 రన్స్ చేశాడు. దీంతో, ఇషాన్ కిషన్, గైక్వాడ్‌ల్లో ఒకరిని ధావన్‌కు తోడుగా పంపించి కేఎల్ రాహుల్‌ను మిడిలార్డర్‌లో ఆడిస్తే మాత్రం శ్రేయస్ అయ్యర్‌ బెంచ్‌కే పరిమితమవుతాడు.

  ఇది కూడా చదవండి : వామ్మో.. శ్రేయస్ అయ్యర్ కోసం ఇంత పోటీనా..? ఎంత ధరైనా సరే సై అంటున్న ఫ్రాంచైజీలు..

  ఇక ఐపీఎల్ సెన్సేషన్ వెంకటేశ్ అయ్యర్‌ కు ఫస్ట్ వన్డేలో చోటు కల్పించాలని టీమిండియా మేనేజ్ మెంట్ భావిస్తోంది. ఈ క్రమంలోనే ఓపెనర్ అయిన అతను విజయ్ హజారే ట్రోఫీలో మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేసి సత్తా చాటాడు. వెంకటేశ్‌ను తీసుకుంటే శార్దూల్ ఠాకూర్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు.

  ఈ సిరీస్‌లో బౌలింగ్ కాంబినేషన్ ఎంచుకోవడం భారత్‌కు సవాల్‌గా మారింది. జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్ ప్రధాన పేసర్లుగా బరిలోకి దిగం ఖాయంగా కనిపిస్తోంది. ఓ స్పిన్నర్‌ను ఆడించే అవకాశం ఉంది. సిరాజ్ ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతుండటంతో దీపక్ చాహర్‌కు లక్కీ ఛాన్స్. పైగా అతనికి బ్యాటింగ్ చేసే సామర్థ్యం కూడా ఉండటం అదనపు బలం.

  ఇది కూాడా చదవండి : ఆ పాపమే విరాట్ కోహ్లీని వెంటాడిందా..? దానికి ప్రతిఫలమే ఇప్పుడు అనుభవిస్తున్నాడా..?

  ఇక 2017 జూన్ తర్వాత అశ్విన్ వన్డే టీమ్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. అయితే అతనికి యుజ్వేంద్ర చాహల్‌ నుంచి గట్టి పోటీ ఉంది. సౌతాఫ్రికా పిచ్‌లపై స్పిన్ ప్రభాతం తక్కువ కాబట్టి బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన అశ్విన్‌కే చోటు దక్కవచ్చు. అయితే స్పిన్నర్ వద్దని భావిస్తే మాత్రం ఐదుగురు పేసర్లతో బరిలోకి కూడా దిగవచ్చు.

  టీమిండియా తుది జట్టు అంచనా :

  కేఎల్ రాహుల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, శార్దూల్ ఠాకూర్/వెంకటేశ్ అయ్యర్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, జస్‌ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), చాహల్/ అశ్విన్
  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Cricket, India vs South Africa, KL Rahul, Ravichandran Ashwin, Shikhar Dhawan, Team India, Virat kohli

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు