హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs SA ODI Series : దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్ కు జట్టును ప్రకటించిన బీసీసీఐ.. ఆర్సీబీ ప్లేయర్ కు తొలిసారి అవకాశం

IND vs SA ODI Series : దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్ కు జట్టును ప్రకటించిన బీసీసీఐ.. ఆర్సీబీ ప్లేయర్ కు తొలిసారి అవకాశం

PC : BCCI

PC : BCCI

IND vs SA ODI Series : దక్షిణాఫ్రికా (South Africa)తో మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ ముగిసిన వెంటనే.. అదే జట్టుతో భారత్ (India) మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ఆడనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు 16 మంది సభ్యులతో బీసీసీఐ (BCCI) టీమిండియా జట్టును ప్రకటించింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

IND vs SA ODI Series : దక్షిణాఫ్రికా (South Africa)తో మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ ముగిసిన వెంటనే.. అదే జట్టుతో భారత్ (India) మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ఆడనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు 16 మంది సభ్యులతో బీసీసీఐ (BCCI) టీమిండియా జట్టును ప్రకటించింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) బ్యాటర్ రజత్ పటిధార్ తో పాటు బెంగాల్ స్వింగ్ బౌలర్ ముకేశ్ కుమార్ లకు తొలిసారి అవకాశం దక్కింది. టి20 ప్రపంచకప్ లో స్టాండ్ బై గా ఉన్న దీపక్ చహర్, శ్రేయస్ అయ్యర్, రవి బిష్ణోయ్ లు కూడా ఈ వన్డే సిరీస్ లో ఆడనున్నారు. కెప్టెన్ గా శిఖర్ ధావన్ (Shikhar Dhawan) వ్యవహరించనున్నాడు. వైస్ కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ ను నియమించింది.

సీనియర్లు లేకుండానే

టి20 ప్రపంచకప్ లో ఆడే భారత ప్లేయర్లు ఈ వన్డే సిరీస్ కు దూరంగా ఉండనున్నారు. స్టాండ్ బై ప్లేయర్లుగా ఉన్న దీపక్ చహర్, శ్రేయస్ అయ్యర్ లు మాత్రమే ఈ సరీస్ లో ఆడనున్నారు. ఇక దక్షిణాఫ్రికా మాత్రం టి20 ప్రపంచకప్ జట్టుతోనే ఈ వన్డే సిరీస్ ను ఆడనుంది. అనారోగ్యంతో ఆసియా కప్ నుంచి మధ్యలో తప్పుకున్న అవేశ్ ఖాన్ మళ్లీ జట్టులోకి వచ్చాడు.

షెడ్యూల్ ఇదే

మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ అక్టోబర్ 6న ఆరంభమై 11న ముగుస్తుంది. తొలి వన్డే అక్టోబర్ 6న, రెండో వన్డే 9న, మూడో వన్డే 11న జరుగుతుంది.

దక్షిణాఫ్రికాతో ఆడే భారత జట్టు

శిఖర్ ధావన్ (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుబ్ మన్ గిల్, రజత్ పటిదార్, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్, సంజూ సామ్సన్, షాబాజ్ అహ్మద్, శార్దుల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, ముకేశ్ కుమార్, అవేశ్ ఖాన్, మొహమ్మద్ సిరాజ్, దీపక్ చహర్

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: India vs South Africa, Shikhar Dhawan, Shreyas Iyer, Team India

ఉత్తమ కథలు