Home /News /sports /

IND VS SA LIVE UPDATES TEAM INDIA LOSE FIVE WICKETS AND DEEP TROUBLE AT TEA BREAK SRD

Ind Vs Sa : కేఎల్ రాహుల్ కూడా ఔట్.. ఐదు వికెట్లు డౌన్.. ఇక, పంత్ పైనే ఆశలు..

Ind Vs Sa (PC : BCCI)

Ind Vs Sa (PC : BCCI)

Ind Vs Sa : మరోసారి నిర్లక్ష్యపు బ్యాటింగ్ తో పుజారా, రహానే కొంపముంచారు. మరోవైపు.. హాఫ్ సెంచరీ చేసి ఊపుమీదున్న కేఎల్ రాహుల్ కూడా ఔటవ్వడంతో టీమిండియా కష్టాల్లో పడింది.

    సౌతాఫ్రికాతో మూడు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌ (Ind Vs Sa) లో టీమిండియా (Team India) కష్టాల్లో పడింది. టీ విరామానికి భారత జట్టు ఐదు కీలక వికెట్లు పోయి కష్టాల్లో పడింది. ఫామ్ లేమితో తంటాలు పడుతున్న ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు అజింక్యా రహానే, ఛతేశ్వర్ పుజారా లు రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో కూడా అట్టర్ ఫ్లాఫ్ అయ్యారు. పుజారా 3 పరుగులకే వెనుదిరగగా.. రహానే డకౌట్ అయ్యాడు. విరాట్ కోహ్లి గైర్హాజరీలో అతడి స్థానాన్ని భర్తీ చేస్తున్న హనుమా విహారి కూడా ఆకట్టుకోలేదు. తెలుగు కుర్రాడు 20 పరుగులు చేసి రబాడా బౌలింగ్ లో ఔటయ్యాడు. ఇక, హాఫ్ సెంచరీ చేసిన కేఎల్ రాహుల్ (50) కూడా ఔటవ్వడంతో టీమిండియా కష్టాలు మరింత పెరిగాయ్. ప్రస్తుతం క్రీజులో పంత్ (13), రవిచంద్రన్ అశ్విన్ (24) పరుగులతో ఉన్నారు. వీరిద్దరిపైనే టీమిండియా ఆశలు. మంచి స్కోరు సాధించగలిగితే.. బౌలర్లకు సహకరిస్తున్న ఈ వికెట్ పై బుమ్రా, షమీ, సిరాజ్ చెలరేగే అవకాశం ఉంది.

    టీమిండియా టెస్టు సారథి విరాట్ కోహ్లికి వెన్ను నొప్పి గాయం కారణంగా ఈ టెస్టు నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. దీంతో కెఎల్ రాహుల్ తాత్కాలిక సారథిగా వ్యవహరిస్తున్నాడు. టాస్ గెలిచిన అతడు తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (26) తో కలిసి కేఎల్ భారత్ కు మంచి ఆరంభాన్నే ఇచ్చాడు. ఇద్దరూ కలిసి తొలి వికెట్ కు 36 పరుగులు జోడించారు.

    5 ఫోర్లు కొట్టి జోరు మీద కనిపించిన మయాంక్ అగర్వాల్.. ఇన్నింగ్స్ 14.1 ఓవర్లో జాన్సేస్ వేసిన బంతికి వెరెన్నేకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇక ఆ తర్వాత వచ్చిన నయావాల్ పుజారా.. 33 బంతులాడి 3 పరుగులే చేశాడు. క్రీజులో నిలదొక్కుకోవడానికి ఇబ్బందిపడ్డ పుజారా.. ఒలివర్ బౌలింగ్ లో బవుమా కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.


    పుజారా నిష్క్రమణ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన రహానే కూడా అతడినే అనుసరించాడు. తాను ఎదుర్కున్న తొలి బంతికే.. పీటర్సన్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు. దీంతో 23 ఓవర్లకే టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 49 పరుగులు చేసింది.

    ఆ తర్వాత హనుమ విహారీ, రాహుల్ కాసేపు పోరాడారు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 42 పరుగుల పార్టనర్ షిప్ ని నెలకొల్పారు. అయితే, బౌన్సర్ కి ఇబ్బంది పడ్డ విహారీ.. షార్ట్ లెగ్ లో ఉన్న వాండర్ డస్సెన్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత హాఫ్ సెంచరీ చేసిన కేఎల్ రాహుల్ కూడా బౌన్సర్ కే ఔటయ్యాడు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జన్ సెన్ రెండు, ఓలీవర్ రెండు, రబాడా ఓ వికెట్ తీశాడు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Cricket, Hanuma vihari, IND Vs SA, India vs South Africa, KL Rahul

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు