IND VS SA JASPRIT BUMRAH SMASHES SIX IN KAGISO RABADA BOWLING AND NETIZENS REACTS THIS WAY SRD
Ind Vs Sa : సౌతాఫ్రికా గడ్డపై కోహ్లీ, ద్రావిడ్ లకు చేతకాలేదు.. కానీ, బుమ్రా మాత్రం ఇరగదీశాడు..!
Jasprit Bumrah
Ind Vs Sa : పుజారా, రహానే కంటే బుమ్రా ఎంతో నయమని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. బుమ్రాను చూసి సిగ్గుతెచ్చుకోవాలని విఫలమైన బ్యాటర్లకు చురకలంటిస్తున్నారు.
జోహన్నెస్‌బర్గ్ వేదికగా సౌతాఫ్రికాతోజరుగుతున్న రెండో టెస్ట్ (Ind Vs Sa)లో టీమిండియా (Team India) నిరాశపర్చింది. మన బ్యాటర్లు చేతులేత్తయడంతో తొలి రోజు ఆటలో ఆతిథ్య జట్టే పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ముందుగా బౌలింగ్‌లో సత్తా చాటిన సఫారీ జట్టు (South Africa).. ఆ తర్వాత ఓపికగా ఆడటంతో తొలి రోజు ఆట ముగిసే సరికి 18 ఓవర్లలో వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది. క్రీజులో పీటర్సన్(39 బంతుల్లో 2 ఫోర్లతో 14 బ్యాటింగ్), డీన్ ఎల్గర్(57 బంతుల్లో ఫోర్‌తో 11 బ్యాటింగ్) ఉన్నారు. ఓపెనర్ ఎయిడెన్ మార్క్రమ్(12 బంతుల్లో 7)మరోసారి విఫలమయ్యాడు. షమీ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. సౌతాఫ్రికా ఇంకా 167 పరుగులు వెనుకబడి ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ పట్టు సాధించాలంటే.. రెండో రోజు బౌలర్లు చెలరేగి.. సౌతాఫ్రికాను తక్కువ స్కోరుకే కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 202 పరుగులకే కుప్పకూలింది.
అయితే, భారత ఇన్నంగ్స్ లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) బ్యాటింగ్‌లో అదరగొట్టాడు. చివర్లో ఓ సిక్స్, రెండు బౌండరీలతో అజేయంగా 14 పరుగులు చేసిన టీమిండియా స్కోర్‌ను 200 ధాటించాడు. బుమ్రా చేసినవి 14 పరుగులే అయినా అవి జట్టు పరువును కాపాడాయి. ఈ క్రమంలోనే బుమ్రా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.
సౌతాఫ్రికా గడ్డపై సిక్స్ బాదిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. హెమాహేమీ బ్యాటర్లే సుదీర్ఘ ఫార్మాట్లో సఫారీ గడ్డపై ఒక్క సిక్స్ కొట్టకపోగా.. బుమ్రా ఈ ఫీట్ సాధించాడు. సౌతాఫ్రికా గడ్డపై ఎన్నో రికార్డులు నమోదు చేసిన టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం ఇప్పటి వరకు సౌతాఫ్రికా గడ్డపై సిక్స్ బాదలేదు. టీమిండియా వాల్, టెస్ట్ క్రికెట్ స్టార్ రాహుల్ ద్రావిడ్ సైతం సఫారీ గడ్డపై సిక్స్ బాదలేదు.
చతేశ్వర్ పుజారా, టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ కూడా సఫారీ గడ్డపై సిక్స్ కొట్టలేకపోయారు. కానీ బుమ్రా సూపర్ బ్యాటింగ్ సిక్స్ బాది ప్రత్యేకంగా నిలిచాడు. కగిసో రబడా బౌలింగ్‌లో అతను వేసిన షార్ట్ పిచ్ బాల్‌ను ఫైన్ లెగ్ మీదుగా సిక్స్ బాది అందర్నీ ఆశ్చర్యపరిచాడు. భారత ఇన్నింగ్స్‌లో బుమ్రా ఒక్కడే సిక్స్ బాదాడం విశేషం. బుమ్రా సిక్స్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు.
I hope Kohli & Dravid also see the potential that is Bumrah the batsman. If they nurture him, he can easily be a good number 7. He can score; and has the foundation to build a capable defence that gives 20-25 valuable runs & build lower order partnerships. #SAvIND
పుజారా, రహానే కంటే బుమ్రా ఎంతో నయమని కామెంట్ చేస్తున్నారు. బుమ్రాను చూసి సిగ్గుతెచ్చుకోవాలని విఫలమైన బ్యాట్స్‌మన్‌కు చురకలంటిస్తున్నారు. రహానే కంటే బుమ్రా బ్యాటింగ్‌నే ఆస్వాదిస్తున్నామని సెటైర్లు పేల్చుతున్నారు. బుమ్రాకు బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉందని, అతన్ని నెంబర్ 7లో బ్యాటింగ్ పంపించాలని కోరుతున్నారు. భారత ఇన్నింగ్స్‌లో ఇద్దరు డకౌటవ్వగా.. మరో ముగ్గురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.