హోమ్ /వార్తలు /sports /

Ind Vs Sa : రాహుల్ కా కమాల్ సెంచరీ.. తొలి రోజు ముగిసే సమయానికి పటిష్ట స్థితిలో భారత్..

Ind Vs Sa : రాహుల్ కా కమాల్ సెంచరీ.. తొలి రోజు ముగిసే సమయానికి పటిష్ట స్థితిలో భారత్..

Ind Vs Sa : 29 ఏళ్ల చెత్త రికార్డును చెరిపేయడానికి సౌతాఫ్రికాలో అడుగుపెట్టిన భారత్ కు ఫస్ట్ టెస్ట్ తొలి రోజు అదిరే ఆరంభం లభించింది. స్టైలిష్ ఓపెనర్ సూపర్ సెంచరీతో టీమిండియాను పటిష్ట స్థితిలో నిలిపాడు.

Ind Vs Sa : 29 ఏళ్ల చెత్త రికార్డును చెరిపేయడానికి సౌతాఫ్రికాలో అడుగుపెట్టిన భారత్ కు ఫస్ట్ టెస్ట్ తొలి రోజు అదిరే ఆరంభం లభించింది. స్టైలిష్ ఓపెనర్ సూపర్ సెంచరీతో టీమిండియాను పటిష్ట స్థితిలో నిలిపాడు.

Ind Vs Sa : 29 ఏళ్ల చెత్త రికార్డును చెరిపేయడానికి సౌతాఫ్రికాలో అడుగుపెట్టిన భారత్ కు ఫస్ట్ టెస్ట్ తొలి రోజు అదిరే ఆరంభం లభించింది. స్టైలిష్ ఓపెనర్ సూపర్ సెంచరీతో టీమిండియాను పటిష్ట స్థితిలో నిలిపాడు.

    దక్షిణాఫ్రికాతో సెంచూరియన్ సూపర్‌ స్పోర్ట్ పార్క్‌లో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ (India Vs South Africa) అదరగొడుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు నష్టపోయి 272 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. టీమిండియా స్టైలిష్ ఓపెనర్ కేఎల్ రాహుల్ (KL Rahul) (248 బంతుల్లో 122 పరుగులు.. 16 ఫోర్లు, 1 సిక్సర్) సూపర్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం రాహుల్ తో పాటు అజింక్య రహానే (81 బంతుల్లో 40 పరుగులు.. 8 ఫోర్లు) ఉన్నాడు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 73 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మయాంక్ అగర్వాల్ (60 పరుగులు), విరాట్ కోహ్లీ (35 పరుగులు) ఫర్వాలేదన్పించారు. అయితే, గత రెండేళ్లు సెంచరీ చేయని విరాట్ కోహ్లీకి ఇదే నిరాశజనక ప్రదర్శనగానే చెప్పొచ్చు. ఇక, టీమిండియా వన్ డౌన్ బ్యాటర్ పుజారా గోల్డెన్ డకౌట్ తో పూర్తిగా నిరాశపర్చాడు. సౌతాఫ్రికా బౌలర్లలో లుంగిడి ఎంగిడికే మూడు వికెట్లు దక్కాయ్. రెండో రోజు కూడా టీమిండియా ఇదే స్టైల్ లో తమ బ్యాటింగ్ కొనసాగిస్తే టీమిండియా భారీ స్కోరు సాధించి.. ఫస్ట్ టెస్ట్ లో పట్టు సాధించవచ్చు.

    టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు రాహుల్ , మయాంక్ లు ఫస్ట్ వికెట్ కు 117 పరుగులు జోడించారు. అయితే, హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని జోరు మీదున్న మయాంక్ ని 60 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లుంగి ఎంగిడి పెవిలియన్ బాట పట్టించాడు. అతని బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు మయాంక్. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పుజారా ఎదుర్కొన్న ఫస్ట్ బంతికే డకౌటయ్యాడు. లుంగి ఎంగిడి బౌలింగ్ లో షార్ట్ లెగ్ లో ఉన్న బవుమాకి క్యాచ్ ఇచ్చి డకౌటయ్యాడు పుజారా.

    అయితే, ఆ తర్వాత కోహ్లీ(35)తో కలిసి మూడో వికెట్‌కు 82 పరుగుల భాగస్వామ్యం అందించాడు. వీరిద్దరూ మరో వికెట్ కు పడకుండా ఇన్నింగ్స్ ని ముందుకు తీసుకువెళ్లారు. అయితే, లుంగి ఎంగిడి బౌలింగ్ లో అనవసరపు షాట్ కు యత్నించి స్లీప్ లో దొరికిపోయాడు విరాట్ కోహ్లీ. అనంతరం క్రీజులోకి వచ్చిన రహానేతో కలిసి నిలకడగా ఆడుతూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డాడు.

    ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌కే మొగ్గు చూపాడు. విదేశాల్లో ముందుగా బ్యాటింగ్ చేసి భారీగా పరుగులు చేయడమే తమ బలమని, పిచ్ కూడా తొలి రెండు రోజులు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే అవకాశం ఉందన్నాడు. సౌతాఫ్రికా గడ్డపై ఆడటం సవాల్‌తో కూడుకున్నదని, ప్రత్యర్థి జట్టు ఎప్పటికి బలంగానే ఉంటుందని, వారికి ఇక్కడి పరిస్థితులు బాగా తెలుసున్నాడు.

    ఇది కూడా చదవండి : Team India ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్.. ఆ స్టార్ ప్లేయర్ మళ్లీ వస్తున్నాడు..

    ఈ మ్యాచ్‌లో ముగ్గురు పేసర్లు మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రాలతో పాటు స్పిన్నర్‌ రవిచంద్రన్ అశ్విన్ తో టీమిండియా బరిలోకి దిగింది. ఆల్‌రౌండర్‌గా శార్దూల్ ఠాకూర్‌ జట్టులోకి వచ్చాడు. ఈ మ్యాచ్ లో సీనియర్లు రహానే, పుజారాలకు చోటు కల్పించిన భారత్.. హనుమ విహారీ, శ్రేయస్ అయ్యర్ లను పక్కన పెట్టింది. అయితే, పుజారా ఇప్పుడు డకౌట్ గా వెనుదిరిగాడు. దీంతో, సెకండ్ టెస్ట్ లో అతనిపై వేటు పడే అవకాశం ఉంది.

    First published: