హోమ్ /వార్తలు /క్రీడలు /

Ind Vs Sa : మయాంక్, రాహుల్ జిగేల్.. డకౌట్ తో మరోసారి నిరాశపర్చిన సీనియర్ బ్యాటర్..

Ind Vs Sa : మయాంక్, రాహుల్ జిగేల్.. డకౌట్ తో మరోసారి నిరాశపర్చిన సీనియర్ బ్యాటర్..

Ind Vs Sa : దక్షిణాఫ్రికాతో సెంచూరియన్ సూపర్‌ స్పోర్ట్ పార్క్‌లో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ (India Vs South Africa) రాణిస్తోంది. కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ ల్ హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు.

Ind Vs Sa : దక్షిణాఫ్రికాతో సెంచూరియన్ సూపర్‌ స్పోర్ట్ పార్క్‌లో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ (India Vs South Africa) రాణిస్తోంది. కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ ల్ హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు.

Ind Vs Sa : దక్షిణాఫ్రికాతో సెంచూరియన్ సూపర్‌ స్పోర్ట్ పార్క్‌లో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ (India Vs South Africa) రాణిస్తోంది. కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ ల్ హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు.

  దక్షిణాఫ్రికాతో సెంచూరియన్ సూపర్‌ స్పోర్ట్ పార్క్‌లో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ (India Vs South Africa) రాణిస్తోంది. తొలి టెస్ట్‌లో టీమిండియా (Team India)కు శుభారంభం దక్కింది. టీమిండియా ఓపెనర్లు రాహుల్ , మయాంక్ లు ఫస్ట్ వికెట్ కు 117 పరుగులు జోడించారు. అయితే, హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని జోరు మీదున్న మయాంక్ ని 60 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లుంగి ఎంగిడి పెవిలియన్ బాట పట్టించాడు. అతని బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు మయాంక్. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పుజారా ఎదుర్కొన్న ఫస్ట్ బంతికే డకౌటయ్యాడు. లుంగి ఎంగిడి బౌలింగ్ లో షార్ట్ లెగ్ లో ఉన్న బవుమాకి క్యాచ్ ఇచ్చి డకౌటయ్యాడు పుజారా. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ.. రాహుల్‌తో కలిసి సంయమనంతో ఆడుతూ స్కోరు బోర్డుపై పరుగులు పెంచుకుంటూ పోతున్నాడు. దీంతో, భారత జట్టు టీ బ్రేక్ సమయానికి రెండు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. టీ బ్రేక్ తర్వాత కూడా ఈ జోడి స్కోరు బోర్డును ముందుకు తీసుకువెళుతున్నారు. రాహుల్ సెంచరీ దిశగా సాగుతుంటే.. విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీకి దగ్గరయ్యాడు.

  టాస్ గెలిచి ఇన్నింగ్స్‌ను నిదానంగా ప్రారంభించిన భారత ఓపెనింగ్ ద్వయం.. సౌతాఫ్రికా బౌలర్లను గౌరవిస్తూనే వీలుచిక్కిన బంతిని బౌండరీకి బాదింది. పిచ్ పేస్‌కు అనుకూలంగా ఉండటంతో పాటు ఎక్స్‌ట్రా బౌన్స్‌కు సహకరిస్తుండటంతో ఆచితూచి ఆడారు. 18 బంతుల తర్వాతగానీ కేఎల్ రాహుల్ పరుగుల ఖాతా తెరవలేదంటే అర్థం చేసుకోవచ్చు. ఈ ఇద్దరు ఎంత ఓపిక వహించారో. ఓవైపు కేఎల్ రాహుల్ డిఫెన్స్‌కు పరిమితమైనా మయాంక్ అగర్వాల్ మత్రం బౌండరీలతో జోరు కనబర్చాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్ లో రాహుల్ కూడా అడపా దడపా బౌండరీలతో ఆకట్టుకున్నాడు.

  ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌కే మొగ్గు చూపాడు. విదేశాల్లో ముందుగా బ్యాటింగ్ చేసి భారీగా పరుగులు చేయడమే తమ బలమని, పిచ్ కూడా తొలి రెండు రోజులు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే అవకాశం ఉందన్నాడు. సౌతాఫ్రికా గడ్డపై ఆడటం సవాల్‌తో కూడుకున్నదని, ప్రత్యర్థి జట్టు ఎప్పటికి బలంగానే ఉంటుందని, వారికి ఇక్కడి పరిస్థితులు బాగా తెలుసున్నాడు.

  ఇది కూడా చదవండి : Gangulyతో సహా.. నలుగురు పెళ్లైన వారితో Nagma ఎఫైర్.. ఇంకా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదేనా…!

  ఈ మ్యాచ్‌లో ముగ్గురు పేసర్లు మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రాలతో పాటు స్పిన్నర్‌ రవిచంద్రన్ అశ్విన్ తో టీమిండియా బరిలోకి దిగింది. ఆల్‌రౌండర్‌గా శార్దూల్ ఠాకూర్‌ జట్టులోకి వచ్చాడు. ఈ మ్యాచ్ లో సీనియర్లు రహానే, పుజారాలకు చోటు కల్పించిన భారత్.. హనుమ విహారీ, శ్రేయస్ అయ్యర్ లను పక్కన పెట్టింది. అయితే, పుజారా ఇప్పుడు డకౌట్ గా వెనుదిరిగాడు. దీంతో, సెకండ్ టెస్ట్ లో అతనిపై వేటు పడే అవకాశం ఉంది.

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Cheteswar Pujara, India vs South Africa, KL Rahul, Team india, Virat kohli

  ఉత్తమ కథలు