IND VS SA FIRST TEST FIFTH DAY LIVE UPDATES TEAM INDIA REGISTERS GRAND VICTORY SRD
Ind Vs Sa : తగ్గేదే లే.. సౌతాఫ్రికాలోనూ టీమిండియా జోరు.. సూపర్ విక్టరీతో సిరీస్ లో బోణీ..
Team India
Ind Vs Sa : సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ (India Vs South Africa)లో భారత్ (Team India) దుమ్మురేపింది. 113 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టి సిరీస్ లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ (India Vs South Africa)లో భారత్ (Team India) దుమ్మురేపింది. 113 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టి సిరీస్ లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. టీమిండియా నిర్దేశించిన 305 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో.. దక్షిణాఫ్రికా (South Africa) 191 పరుగులకే ఆలౌట్ అయింది. టీమిండియా బౌలర్లలో బుమ్రా, షమీ మూడు వికెట్లతో సత్తా చాటారు. ఇక, అశ్విన్, సిరాజ్ కు చెరో రెండు వికెట్లు దక్కాయ్. ఎల్గర్ (77 పరుగులు), బవుమా (35 పరుగులు నాటౌట్) మాత్రమే సౌతాఫ్రికా లో రాణించారు. ఐదో రోజు లంచ్ బ్రేక్ సమయానికి సఫారీ జట్టు ఏడు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. లంచ్ తర్వాత షమీ మార్కో జాన్సేన్ ను పెవిలియన్ కు పంపగా.. రబాడా, ఎండిల్ని అశ్విన్ తన స్పిన్ తో బోల్తా కొట్టించాడు.94/4 మ్యాచ్ ఆరంభించిన సౌతాఫ్రికా ఐదో రోజు మంచిగానే తమ ఆటను ప్రారంభించింది. హాఫ్ సెంచరీతో ఊపుమీదున్న ఎల్గర్ మంచి షాట్లతో ఆకట్టుకున్నాడు. 77 పరుగులతో సెంచరీ దిశగా దూసుకెళ్తున్న ఎల్గర్ జోరుకు బుమ్రా బ్రేకులు వేశాడు. అద్భుతమైన డెలివరీతో ఎల్గర్ ను ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ కు పంపాడు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన డికాక్ దూకుడుగా ఆడాడు. 28 బంతుల్లో 21 పరుగులు చేసిన డికాక్ ను సిరాజ్ బౌల్ట్ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ముల్డర్ ని అద్భుతమైన డెలివరీతో షమీకి పెవలియన్ కు పంపాడు. బవుమా ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తున్నాడు. బుమ్రా మూడు వికెట్లు, షమీ, సిరాజ్ చెరో రెండు వికెట్లతో సత్తా చాటారు.
ఇక. అంతకుముందు 16/1తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్ 174 పరుగులకు ఆలౌటైంది. రిషభ్ పంత్ (34) టాప్ స్కోరర్. పేసర్లు రబాడ, జాన్సెన్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్ లీడ్ 130 పరుగులు కలిపి టీమిండియా మొత్తం 304 పరుగుల ఆధిక్యం నమోదు చేసింది. ఈపిచ్‌పై ఇంతటి స్కోరును గతంలో ఏ జట్లూ ఛేదించలేదు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 327 పరుగులు చేయగా.. దక్షిణాఫ్రికా 197 పరుగులకు కుప్పకూలింది.
సెంచూరియన్ గ్రౌండ్లో అత్యధికంగా 334 బంతులు ఎదుర్కొన్న తొలి విదేశీ ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ రికార్డు సృష్టించాడు. ఈ వేదికపై ఎక్కువ బంతులు ఆడిన పర్యాటక జట్టు ఆటగాడిగా రెండో స్థానంలో నిలిచాడు. ఆసీస్‌కు చెందిన షాన్ మార్ష్ (372) అత్యధిక బంతులు ఎదుర్కొన్నాడు. ఇక, బుమ్రా మహారాజ్ వికెట్ తో విదేశాల్లో వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డు క్రియేట్ చేశాడు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.