Home /News /sports /

IND VS SA FIRST T20I LIVE UPDATES DUE TO HEAT WAVE IN DELHI BCCI TAKES THIS KEY DECISION SRD

IND vs SA : ఢిల్లీ వెదర్ ఎఫెక్ట్.. బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇలా జరగడం టీ20 చరిత్రలో ఇదే తొలిసారి..

Team India

Team India

IND vs SA : భారత్ - దక్షిణాఫ్రికా జట్లల మధ్య ఫస్ట్ టీ20 ఢిల్లీ వేదికగా జరగనుంది. అయితే, ఢిల్లీ వాతావరణం ఇప్పుడు ఆటగాళ్లకు సవాల్ విసరనుంది. దీంతో, బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.

    రెండు నెలలుగా ఐపీఎల్ 2022(IPL 2022)తో బిజీబిజీగా గడిపిన భారత ఆటగాళ్లు (Team India Players) స్వల్ప విరామం అనంతరం అంతర్జాతీయ టీ20 ఆడేందుకు సిద్దమయ్యారు. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచుల టీ20 సిరీస్ (IND vs SA) టీమిండియా ఆడనుంది. జూన్ 9 నుంచి 19 వరకు టీ20 సిరీస్‌ జరగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ రోజు సాయంత్రం ఏడు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక, ఈ సిరీస్ లో రోహిత్ (Rohit Sharma), కోహ్లీ(Virat Kohli), బుమ్రా (Jasprit Bumrah) లాంటి సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి కల్పించారు బీసీసీఐ సెలెక్టర్లు. ఇక, కేఎల్ రాహుల్ (KL Rahul), కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) లు గాయాలంతో జట్టుకు దూరమయ్యారు. రిషబ్ పంత్ (Risabh Pant) తాత్కాలిక సారథ్య బాధ్యతల్ని స్వీకరించాడు. హార్దిక్ వైస్ కెప్టెన్ గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.

    గాయాలతో టీమిండియా సతమతమవుతుంటే.. మ్యాచ్ జరిగే ఢిల్లీ వాతావరణం బీసీసీఐకి సవాల్ విసురుతోంది. దేశ రాజధానిలో తీవ్ర వేడిగాల్పులు వీస్తున్నాయ్. ఉదయం వేళల్లోనే అక్కడి ఉష్ణోగ్రత 36 నుంచి 38 డిగ్రీల వరకు ఉంటోంది. మధ్యాహ్నం మరింత తీవ్రరూపం దాల్చుతోంది. మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య గరిష్ఠంగా 43 నుంచి 44 డిగ్రీలను టచ్ చేస్తోంది ఎండవేడి. కొద్దిరోజులుగా ఇదే తరహా వాతావరణం కనిపిస్తోందక్కడ. పశ్చిమ దిశ నుంచి వేడిగాలులతో ఢిల్లీవాసులు మరింత ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.



    ఈ వాతావరణం ఎఫెక్ట్ తో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఆటగాళ్ల భద్రతను దృష్టిలో పెట్టుకుని రూల్స్ మార్చి పడేసింది. తొలి టీ20 మ్యాచ్‌లో ప్రతి 10 ఓవర్లలకు ఒకసారి డ్రింక్స్ బ్రేక్ ఇవ్వనుంది. టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల నుంచి అందిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. తాము చేసిన ప్రతిపాదనలకు బీసీసీఐ సానుకూలంగా నిర్ణయం తీసుకుందని, ప్రతి 10 ఓవర్లకోసారి డ్రింక్స్ బ్రేక్ ఇవ్వడానికి అంగీకరించిందని ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది.

    ఇది కూడా చదవండి : ఇదెక్కడి ఫ్యాన్ ఫాలోయింగ్ రా మామ.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్ గా కోహ్లీ అరుదైన రికార్డు..

    సాధారణంగా అంతర్జాతీయ టీ20 డ్రింక్స్ బ్రేక్స్ ఉండవు. రెండు జట్లు కూడా ఏకధాటిగా 20 ఓవర్లను ఆడేస్తాయి. ఐపీఎల్ లో మాత్రం స్ట్రాటజిక్ టైమ్ ఔట్ తో రెండు బ్రేకులు తీసుకుంటారు. అయితే, మార్చిన ఈ రూల్స్ ఈ ఒక్క మ్యాచ్‌కే పరిమితం అవుతుందా? లేక.. ఈ సిరీస్ మొత్తానికి అంటే మిగిలిన నాలుగు మ్యాచ్‌లకూ కొనసాగిస్తుందా? అనేది ఇంకా తేలాల్సి ఉంది. స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా బీసీసీఐ అధికారులు అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Cricket, Delhi, Hardik Pandya, IND Vs SA, India vs South Africa, KL Rahul, Rishabh Pant

    తదుపరి వార్తలు