IND VS SA FIRST T20I LIVE SCORE UPDATES SOUTH AFRICA WON THE TOSS AND OPTED TO FIELD FIRST SRD
IND vs SA First T20I : టాస్ నెగ్గిన సౌతాఫ్రికా.. ఉమ్రాన్, అర్షదీప్ లకు తప్పని నిరాశ..
IND vs SA First T20I
IND vs SA First T20I : రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అందుబాటులో లేరు. సిరీస్ ఆరంభానికి ముందే కేప్టెన్ కేఎల్ రాహుల్, స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా జట్టుకు దూరం అయ్యారు. దీంతో.. టీమిండియాకు అసలు సిసలు సవాల్ ఎదురు కానుంది.
రెండు నెలలుగా ఐపీఎల్ 2022(IPL 2022)తో బిజీబిజీగా గడిపిన టీమిండియా అసలు సిసలు పోరుకు రెడీ అయింది. భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య అయిదు టీ20 మ్యాచ్‌ల ద్వైపాక్షిక సిరీస్ ఆరంభం కానుంది. భారత్‌లో దక్షిణాఫ్రికా జట్టు పర్యటిస్తోంది. సిరీస్‌లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్ లో సౌతాఫ్రికా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. సౌతాఫ్రికా జట్టులో ట్రిస్టన్ స్టబ్స్ అరంగేట్రం చేయనున్నాడు. ఇక, టీమిండియా జట్టులో ఉమ్రాన్, అర్షదీప్ లకు నిరాశే ఎదురైంది. అవేశ్ ఖాన్ కు తుది జట్టులో చోటు దక్కింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అందుబాటులో లేరు. సిరీస్ ఆరంభానికి ముందే కేప్టెన్ కేఎల్ రాహుల్, స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా జట్టుకు దూరం అయ్యారు. కేఎల్ రాహుల్‌కు బదులుగా రిషబ్ పంత్ జట్టు కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా వైస్ కేప్టెన్‌గా అపాయింట్ అయ్యాడు.
కేఎల్ రాహుల్ తప్పుకోవడంతో ఓపెనర్లుగా రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ బరిలోకి దిగనున్నాడు. రాహుల్‌తో పాటు గాయం కారణంగా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా ఈ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. ఫస్ట్ డౌన్లో శ్రేయస్ అయ్యర్ ఆడునున్నాడు. ఐపీఎల్లో అయ్యర్ ఆశించిన రీతిలో రాణించకపోయినా.. అతనికి పోటీ లేదు. రిషభ్ పంత్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. ఐపీఎల్లో ఘోరంగా విఫలమైన పంత్‌కు ఈ సిరీస్ ఎంతో కీలకం. ఈ సిరీస్‌లో రాణిస్తే ఎలాంటి ఆటంకాలు లేకుండా T20 ప్రపంచకప్ జట్టుకు ఎంపికవుతాడు.ఇక, ఐపీఎల్ 2022 సీజన్ లో అదరగొట్టిన హార్దిక్ పాండ్యా ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు.
T20 ప్రపంచకప్ తర్వాత జట్టుకు దూరంగా ఉన్న హార్దిక్.. మళ్లీ ఈ సిరీస్‌తోనే అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇక ఆర్సీబీ తరఫున ఫినిషర్‌గా దుమ్మురేపిన దినేశ్ కార్తీక్ సైతం మూడేళ్ల తర్వాత మళ్లీ టీమిండియా పిలుపును అందుకున్నాడు. T20 ప్రపంచకప్ ఆడాలంటే అతను ఈ సిరీస్‌లో రాణించడం చాలా ముఖ్యం. రాహుల్ గాయంతో దినేష్ కార్తీక్ కూడా తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. బౌలింగ్ లో భువీ, హర్షల్ పటేల్, చాహల్, అవేశ్ ఖాన్ కీలకం కానున్నారు.
మరోవైపు.. సౌతాఫ్రికా టీమ్ రెట్టింపు ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. ఆ జట్టులోని చాలా మంది క్రికెటర్లు ఐపీఎల్ లో దుమ్మురేపిన వారే. క్వింటన్ డికాక్, బవుమా, డేవిడ్ మిల్లర్ , రీజా హెండ్రిక్స్ బ్యాటింగ్ లో కీలకం కానున్నారు. బౌలింగ్ లో రబాడ, అన్రిచ్ నోర్ట్జే, షంసీ భారత్ బ్యాటింగ్ కు సవాల్ విసరనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.