హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs SA ODI Series : వన్డేల్లో ఇరగదీసేందుకు కుర్రాళ్లు సిద్ధం.. ఆ ప్లేయర్ అరంగేట్రం పక్కా.. తుది జట్టు ఇదే!

IND vs SA ODI Series : వన్డేల్లో ఇరగదీసేందుకు కుర్రాళ్లు సిద్ధం.. ఆ ప్లేయర్ అరంగేట్రం పక్కా.. తుది జట్టు ఇదే!

Team India

Team India

IND vs SA ODI Series : శిఖర్ ధావన్, శేయస్ అయ్యర్‌, శుభ్‌మన్ గిల్ రీఎంట్రీ ఇవ్వనుండగా.. ప్రపంచకప్ స్టాండ్ బై లిస్ట్‌లో ఉన్న సిరాజ్, దీపక్ చాహర్‌లు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమయ్యారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  టీ20 వరల్డ్ కప్2022 (T20 World Cup 2022) టోర్నీకి సమయం దగ్గర పడుతోంది. మరికొద్ది రోజుల్లో ఆస్ట్రేలియా వేదికగా మహాసమరానికి తెరలేవనుంది. ఇక, సొంత గడ్డ వేదికగా సౌతాఫ్రికా(India vs South Africa) తో జరిగిన మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ ను భారత్ 2-1తో సొంతం చేసుకుంది. అయితే, ఇండోర్ లో జరిగిన సిరీస్ లోని ఆఖరి టీ20 మ్యాచులో సఫారీ జట్టు చేతిలో టీమిండియా(Team India) భారీ ఓటమిని మూటగట్టుకుంది. ఇక, సౌతాఫ్రికా సిరీస్ కన్నా ముందు ఆస్ట్రేలియా జట్టును కూడా 2-1 తేడాతో ఓడించి సిరీస్ ను కైవసం చేసుకుంది రోహిత్ సేన. ఇక, ఓటమితో సిరీస్ ముగించిన రోహిత్ సేన ప్రపంచకప్ కోసం త్వరలో ఆస్ట్రేలియా బయలుదేరనుంది.

  ఇక, పొట్టి కప్ కన్నా ముందు వన్డే సిరీస్ లో తలపడేందుకు సిద్ధమైంది శిఖర్ ధావన్ సారథ్యంలోని భారత ద్వితీయ శ్రేణి జట్టు మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా లక్నో వేదికగా గురువారం జరగనున్న తొలి మ్యాచ్‌లో ఇరు జట్లు తలపడనున్నాయి. ప్రధాన ఆటగాళ్లందరూ మెగాటోర్నీ కోసం సిద్దమవుతుండగా దేశవాళీ, ఐపీఎల్ స్టార్స్ తమ సత్తా చాటేందుకు సిద్దమయ్యారు.

  శిఖర్ ధావన్, శేయస్ అయ్యర్‌, శుభ్‌మన్ గిల్ రీఎంట్రీ ఇవ్వనుండగా.. ప్రపంచకప్ స్టాండ్ బై లిస్ట్‌లో ఉన్న సిరాజ్, దీపక్ చాహర్‌లు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమయ్యారు. మరోవైపు రజత్ పటీదార్, షెహ్‌బాజ్ అహ్మద్, రాహుల్ త్రిపాఠి వంటి దేశీయ స్టార్లు అంతర్జాతీయ అరంగేట్రం కోసం ఎదురు చూస్తున్నారు.

  స్టార్ ప్లేయర్స్ లేని వేళ జట్టు కాంబినేషన్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. టీమిండియా తుది జట్టులో చోటు దక్కించుకునే కుర్రాళ్లు ఎవరో మరి కొద్ది గంటల్లో తేలనుంది. రజత్ పటీదార్.. సౌతాఫ్రికాతో జరిగే తొలి వన్డేతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

  ఈ ఏడాది ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అతను 9 మ్యాచ్‌లు ఆడి 4 సెంచరీలతో పాటు 5 హాఫ్ సెంచరీలు బాదాడు. అయితే రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్‌, రుతురాజ్ గైక్వాడ్‌లతో అతనికి తీవ్ర పోటీ ఎదురుకానుంది. సీనియర్‌‌కు ప్రాధానత్య ఇవ్వాలని భావిస్తే ఇషాన్ కిషన్ జట్టులోకి వస్తాడు. అప్పుడు రజత్ పటీదార్ వేచి చూడాల్సి ఉంటుంది.

  ఓపెనర్లుగా శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్ ఆడటం ఖాయం. ధావన్ కెప్టెన్ కావడంతో పాటు జట్టులో అత్యంత సీనియర్. ఇక శుభ్‌మన్ గిల్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. అతన్ని వన్డే ప్రపంచకప్ కోసం సిద్దం చేస్తున్నారు. అంతేకాకుంగా వెస్టిండీస్ పర్యటనలో అతను సత్తా చాటాడు.

  ఇది కూడా చదవండి : రోహిత్, ద్రావిడ్ వీటికి సమాధానం చెప్పండి బాబూ..! ఇలా అయితే వరల్డ్ కప్ ఫసక్కే..!

  ఫస్ట్ డౌన్‌లో వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆడనున్నాడు. టీ20 ప్రపంచకప్ స్టాండ్‌బై లిస్ట్‌లో ఉన్న అతనికి మ్యాచ్ ప్రాక్టీస్ అందించనున్నారు. నాలుగో స్థానంలో వికెట్ కీపర్ సంజూ శాంసన్ బరిలోకి దిగడం ఖాయం. ఇటీవలే న్యూజిలాండ్-ఏతో జరిగిన అనధికారిక వన్డే సిరీస్‌లో కెప్టెన్‌గా సంజూ అదరగొట్టాడు. బ్యాటింగ్‌లోనూ సత్తా చాటాడు.

  ఐదో స్థానం కోసం రజత్ పటీదార్, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్‌ల మధ్య పోటీ నడిచే ఛాన్స్ ఉంది. స్పిన్ ఆల్‌రౌండర్‌గా షెహ్‌బాజ్ అహ్మద్ ఆడటం ఖాయం. లెఫ్టాండర్ కావడం, బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉండటం అతనికి అదనపు బలం. పేస్ ఆల్‌రౌండర్‌గా శార్దూల్ ఠాకూర్ బరిలోకి దిగనున్నాడు. పేసర్లుగా దీపక్ చాహర్, మహమ్మద్ సిరాజ్‌లు ఆడనుండగా.. స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్ బరిలోకి దిగనున్నారు.

  తుది జట్టు(అంచనా)

  శిఖర్ ధావన్(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్(వైస్ కెప్టెన్), సంజూ శాంసన్(కీపర్), రజత్ పటీదార్/ఇషాన్ కిషన్/ రాహుల్ త్రిపాఠి, షెహ్‌బాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Cricket, India vs South Africa, Shikhar Dhawan, Shreyas Iyer, Team India

  ఉత్తమ కథలు