Home /News /sports /

IND VS SA FIFTH T20I LIVE SCORE UPDATES RAIN STOPS PLAY IN BENGALURU AND TEAM INDIA LOSES TWO WICKETS SRD

IND vs SA : మళ్లీ ఎంట్రీ ఇచ్చిన వర్షం.. కష్టాల్లో టీమిండియా... వాన ఆగితే తేడా కొట్టేది మన జట్టుకే..

Photo Credit : Twitter

Photo Credit : Twitter

IND vs SA : సిరీస్ డిసైడర్ మ్యాచులో ఫలితాన్ని వరుణుడు డిసైడ్ చేసేలా ఉన్నాడు. టాస్ తర్వాత వర్షంతో కాసేపు ఆగి ప్రారంభమైన మ్యాచులో మరోసారి సారి భారీ వాన కురిసింది. దీంతో.. మరో సారి మ్యాచ్ ఆగిపోయింది.

    దక్షిణాఫ్రికా (South Africa), భారత్ (India) మధ్య సిరీస్ విజేతను తేల్చే చివరిదైన ఐదో టి20 మ్యాచ్ లోకి మళ్లీ వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఐదో టీ20 మ్యాచ్‌కి వర్షం అంతరాయం కలిగించింది. వర్షం ఆట ఆపే సమయానికి టీమిండియా 3.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 28 పరుగులు చేసింది. ఓపెనర్లు ఇద్దరూ పెవిలియన్ బాట పట్టాడు. ఇషాన్ కిషన్ 7 బంతుల్లో 15 పరుగులు, రుతురాజ్ 12 బంతుల్లో 10 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టారు. పడిన రెండు వికెట్లు లుంగి ఎంగిడికే దక్కాయ్. అంతకు ముందు.. మ్యాచ్ ఆరంభానికి కొన్ని సెకన్ల ముందు వర్షం ప్రారంభం అయింది. దీంతో.. ఒక్క బంతి కూడా వేయకుండా ఆటను వాయిదా వేశారు అంపైర్లు. అయితే, వెంటనే వర్షం ఆగిపోవడంతో.. మ్యాచ్ ను 19 ఓవర్లకు కుదించారు. మ్యాచ్ 7.50 గంటలకు ప్రారంభం అయింది. కానీ, మరోసారి వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. మళ్లీ వర్షం ఆగితే.. ఓవర్లు మరింత కుదించే అవకాశం ఉంది. దీంతో, టీమిండియాకు కష్టంగా మారనుంది. తక్కువ ఓవర్లలో భారీ టార్గెట్ సెట్ చేయాల్సి ఉంటుంది. అది కాకుండా సౌతాఫ్రికా జట్టుకు వాళ్ల టార్గెట్ పై ఓ క్లారిటీ ఉండనుంది.

    ఇక, చిన్నస్వామి స్టేడియంలో అత్యుత్తమ డ్రైనేజీ వ్యవస్థ అందుబాటులో ఉంది. దీంతో వర్షం ఆగితే 8 నిమిషాల్లో పిచ్‌ని ఆటకు అనుకూలంగా మార్చగలరు సిబ్బంది. ఒకవేళ వర్షం ఆగకపోతే మ్యాచ్ రద్దయి, సిరీస్ 2-2 తేడాతో డ్రాగా ముగుస్తుంది.దీంతో, కప్పును ఇరుజట్లు సమానంగా పంచుకుంటాయ్.ఈ మ్యాచ్ కు సౌతాఫ్రికా రెగ్యులర్ కెప్టెన్ తెంబా బవుమా గాయంతో దూరమయ్యాడు. దాంతో తాత్కాలిక కెప్టెన్ గా కేశవ్ మహరాజ్ బాధ్యతలు చేపట్టాడు.



    కీలక పోరులో టాస్ నెగ్గిన కేశవ్ మహరాజ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ లో మార్పులు లేకుండానే టీమిండియా బరిలోకి దిగనుండగా.. ప్రొటీస్ జట్టు మాత్రం ఏకంగా మూడు మార్పులు చేసింది. గాయంతో బవుమా తప్పుకోగా.. స్పిన్నర్ షమ్సీ, మార్కో యాన్సెన్ లను పక్కన పెట్టిన టీం.. వీరి స్థానాల్లో రిజా హెండ్రిక్స్, కగిసో రబడ, ట్రిస్టాన్ లకు తుది జట్టులో చోటు కల్పించింది.


    ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ లో సౌతాఫ్రికా జట్టు అంచనాలకు మించి రాణించిందనే చెప్పాలి. ఎటువంటి అంచనాలు లేేకుండా బరిలోకి దిగిన ఆ జట్టు తొలి రెండు మ్యాచ్ ల్లోనూ నెగ్గి సిరీస్ ను గెలిచేలా కనిపించారు. సౌతాఫ్రికా విజయాల్లో కెప్టెన్ తెంబా బవుమా పాత్ర ఎంతో ఉంది. అయితే నాలుగో టి20లో బ్యాటింగ్ చేస్తూ అతడు గాయపడ్డాడు. దాంతో మళ్లీ బ్యాటింగ్ కు దిగలేదు. ఇక సిరీస్ విజేత ఎవరో తేల్చే ఐదో మ్యాచ్ కు దూరమయ్యాడు.

    ఫలితంగా అతడి స్థానంలో కేశవ్ మహరాజ్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. గత రెండు మ్యాచ్ ల్లోనూ నెగ్గిన భారత్ ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. అయితే పంత్ ఫామ్ భారత్ ను కలవరపెడుతోంది. ఈ మ్యాచ్ లో అతడు రాణిస్తే భారత్ భారీ స్కోరు సాధించే అవకాశం ఉంది. చిన్నస్వామి స్టేడియం బ్యాటింగ్ పిచ్ అని అందరికీ తెలుసు. దాంతో భారత్ తొలుత బ్యాటింగ్ చేస్తుంది కాబట్టి కనీసం 200లకు పైగా స్కోర్ సాధించాల్సి ఉంది. బౌలింగ్ లో మరోసారి యుజువేంద్ర చహల్, హర్షల్ పటేల్ కీలకం కానున్నారు.

    తుది జట్లు

    భారత్‌: రిషభ్‌ పంత్‌ (కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్, రుతురాజ్, శ్రేయస్, హార్దిక్‌ పాండ్యా, దినేశ్‌ కార్తీక్, అక్షర్, హర్షల్, అవేశ్‌ ఖాన్, భువనేశ్వర్, చహల్‌.

    దక్షిణాఫ్రికా: రిజా హెండ్రిక్స్, డికాక్, వాన్‌ డెర్‌ డసెన్, మిల్లర్, క్లాసెన్, ట్రిస్టాన్, ప్రిటోరియస్, కగిసో రబడ, లుంగీ ఎంగిడీ, కేశవ్ మహరాజ్ (కెప్టెన్‌), నోర్జే
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Cricket, IND Vs SA, India vs South Africa, Rishabh Pant, Team India

    తదుపరి వార్తలు