Home /News /sports /

IND VS SA DEEPAK CHAHAR GETS EMOTIONAL AND BURSTS INTO TEARS AFTER SOUTH AFRICA SNATCH CLOSE WIN FROM TEAM INDIA SRD

Viral Video : అయ్యో.. మ్యాచ్ గెలిపించలేకపోయానే.. కంటతడి పెట్టిన నయా ఆల్‌రౌండర్..!

Deepak Chahar (PC : Twitter)

Deepak Chahar (PC : Twitter)

Viral Video : మొత్తంగా సౌతాఫ్రికా టూర్‌లో భారత్ అట్టర్ ఫ్లాపయింది. మొదటి టెస్ట్ మ్యాచ్ తప్ప.. ఆ తర్వాత ప్రతి మ్యాచ్‌లోనూ పరాజయం పాలయింది. రెండు టెస్ట్‌లు, మూడు వన్డేల్లోనూ ఓడిపోయింది. టెస్ట్‌తో పాటు వన్డే సిరీస్‌ను కూడా కోల్పోయి..ఒట్టి చేతులతో స్వదేశానికి రాబోతోంది.

ఇంకా చదవండి ...
    సౌతాఫ్రికా టూర్‌ (India Tour Of South Africa) లో టీమిండియా (Team India) అట్టర్ ఫ్లాపైంది. టెస్ట్ సిరీస్‌తో పాటు వన్డే సిరీస్‌ను కోల్పోయిన భారత జట్టు.. ఈ టూర్ ఆఖరి మ్యాచ్‌లోనైనా గెలవాని అభిమానులు అనుకున్నారు. కానీ అది కూడా జరగలేదు. కేప్‌టౌన్ వేదికగా జరిగిన మూడవ వన్డేలో రాహుల్ సేన పోరాడి ఓడిపోయింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌..చివరకు దక్షిణాఫ్రికా(South Africa) వశమైంది. సఫారీలు విధించిన 288 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టుచేధించలేకపోయింది. 49.2 ఓవర్లలో 283 పరుగులు చేసి ఆలౌటయింది. ఆఖర్లో దీపక్ చాహర్ హాఫ్ (Deepak Chahar) సెంచరీతో అదరగొట్టి.. మ్యాచ్‌పై ఆశలు రేపాడు. కానీ అసలైన టైమ్‌లో వికెట్ పడడంతో.. టీమిండియాకు ఓటమి తప్పలేదు. సౌతాఫ్రికా ఆటగాళ్లు ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లోనూ అద్భుతంగా రాణించి భారత జట్టుపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. కేప్‌టౌన్‌ వేదికగా ఉత్కంఠభరితంగా సాగిన మూడో వన్డేలో భారత్‌పై దక్షిణాఫ్రికా నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది.

    32వ ఓవర్లో జట్టు స్కోరు 156 పరుగుల వద్ద కోహ్లీ అవుట్‌ కావడంతోనే క్లీన్‌స్వీప్‌ ఖాయమైనప్పటికీ... దీపక్‌ చహర్‌ (34 బంతుల్లో 5 బౌండరీలతో 2 సిక్స్‌లతో 54) మెరుపు బ్యాటింగ్‌తో విజయంపై ఆశలు రేగాయ్. 18 బంతుల్లో భారత్‌ విజయానికి 10 పరుగులు అవసరమైన దశలో 48వ ఓవర్‌ తొలి బంతికి చహర్‌ను ఎంగిడి బోల్తా కొట్టించడంతో టీమిండియా ఓడిపోయేందుకు ఎక్కువసేపు పట్టలేదు. దీంతో.. దీపక్ చాహర్ కన్నీటి పర్యంతమయ్యాడు.

    అనవసర షాట్‌తో ఔటై జట్టును గెలిపించలేకపోయాననే బాధలో ఉబికి వస్తున్న కన్నీళ్లను దీపక్ చాహర్ ఆపుకోలేకపోయాడు. చేతులను అడ్డుపెట్టుకొని కవర్ చేసే ప్రయత్నం చేసినా.. అతనికి కన్నీళ్లు ఆగలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. లుంగి ఎంగిడి బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన దీపక్.. క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. ఆ వెంటనే జస్‌ప్రీత్ బుమ్రా కూడా ఔటవ్వడంతో భారత్ ఓటమి కారణమైంది. చివరి 5 బంతులకు 5 పరుగులు చేయాల్సి ఉండగా.. యుజ్వేంద్ర చాహల్ క్యాచ్ ఔట్ అవ్వడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది.




    భువనేశ్వర్ కుమార్ స్థానంలో జట్టులోకి వచ్చిన దీపక్ చాహర్.. అటు బంతితో పాటు బ్యాట్‌తో మెరిశాడు. దీంతో దీపక్ చాహర్ నయా ఆల్‌రౌండర్ అంటూ అభిమానులు కొనియాడుతున్నారు. దీపక్ చాహర్ కేప్ టౌన్‌లో టీమిండియాను గెలిపించకపోయినా అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడని కామెంట్ చేస్తున్నారు. చాహర్ బంతితో పాటు బ్యాట్‌తో కూడా రాణించగలడని నిరూపించాడని, అతనికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలని కోరుతున్నారు.

    ఇది కూడా చదవండి : టైం భయ్యా టైం.. విరాట్ కోహ్లీకి వార్నింగ్ ఇచ్చిన భారత దిగ్గజ స్పిన్నర్..

    మొత్తంగా సౌతాఫ్రికా టూర్‌లో భారత్ అట్టర్ ఫ్లాపయింది. మొదటి టెస్ట్ మ్యాచ్ తప్ప.. ఆ తర్వాత ప్రతి మ్యాచ్‌లోనూ పరాజయం పాలయింది. రెండు టెస్ట్‌లు, మూడు వన్డేల్లోనూ ఓడిపోయింది. టెస్ట్‌తో పాటు వన్డే సిరీస్‌ను కూడా కోల్పోయి..ఒట్టి చేతులతో స్వదేశానికి రాబోతోంది. మూడు వన్డేల సిరీస్‌ను 3-0 తేడాతో ప్రొటీస్‌ జట్టు కైవసం చేసుకుంది. టెస్టు సిరీస్‌నూ 2-1 తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Cricket, IND Vs SA, India vs South Africa, Viral Video

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు