హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs SA : సిరీస్ స్టార్ట్ అవ్వకుండానే రెండు వికెట్లు డౌన్.. రాహుల్ తో పాటు అతడు కూడా దూరం.. అదే కారణమా..!

IND vs SA : సిరీస్ స్టార్ట్ అవ్వకుండానే రెండు వికెట్లు డౌన్.. రాహుల్ తో పాటు అతడు కూడా దూరం.. అదే కారణమా..!

KL Rahul

KL Rahul

IND vs SA : స్వదేశంలో దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచుల టీ20 సిరీస్ (IND vs SA) టీమిండియా ఆడనుంది. అయితే, ఫస్ట్ మ్యాచ్ ప్రారంభానికి ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది.

రెండు నెలలుగా ఐపీఎల్ 2022 (IPL 2022)తో బిజీబిజీగా గడిపినభారత ఆటగాళ్లుస్వల్ప విరామం అనంతరం అంతర్జాతీయ టీ20 ఆడేందుకు సిద్దమయ్యారు. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచుల టీ20 సిరీస్ (IND vs SA) టీమిండియా ఆడనుంది. జూన్ 9 నుంచి 19 వరకు టీ20 సిరీస్‌ జరగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జూన్ 9న తొలి మ్యాచ్ జరగనుంది. అయితే, ఈ సిరీస్ లో ఫస్ట్ బంతి పడకుండానే టీమిండియాకు భారీ షాక్ తగిలింది. ఐపీఎల్ 2022 సీజన్ లో సత్తా చాటిన ఇద్దరూ కీలక ఆటగాళ్లు సిరీస్ కు దూరమయ్యాడు. ఇందులో టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) ఉండటం విశేషం. రాహుల్ తో పాటు కుల్దీప్ యాదవ్ కూడా సిరీస్ మొత్తానికి గాయంతో దూరమయ్యాడు.

ప్రాక్టీస్ సెషన్స్‌లో కేఎల్ రాహుల్ తీవ్రంగా గాయపడడంతో అతనికి విశ్రాంతి అవసరమని సూచించారు వైద్యులు. దీంతో అతను సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ మొత్తానికి దూరం కానున్నాడు. కుల్దీప్ యాదవ్ ది కూడా అదే పరిస్థితి. ఇక, వచ్చే నెల ఆరంభంలో ఇంగ్లాండ్‌తో జరిగే టెస్టు మ్యాచ్‌కి కెఎల్ రాహుల్ అందుబాటులో ఉంటాడా? లేదా? అనేది కూడా అనుమానంగా మారింది.

ఇక, కేఎల్ రాహుల్ గాయపడటంతో అతని స్థానంలో వైస్ కెప్టెన్ గా ఉన్న పంత్ కి సారథ్య బాధ్యతలు అప్పగించింది. హార్దిక్ కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చింది.ఇప్పటికే.. ఈ సిరీస్ కు సీనియర్ ఆటగాళ్లు అయిన రోహిత్(Rohit Sharma), కోహ్లీ (Virat Kohli), బుమ్రా (Jasprit Bumragh)లకు విశ్రాంతినిచ్చిన భారత సెలెక్షన్ కమిటీ 18 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఇప్పుడు రాహుల్ కూడా దూరమవ్వడం టీమిండియాకు లోటే అని చెప్పాలి. అయితే.. కీలక ఆటగాళ్లు సిరీస్ కు దూరమవ్వడంతో ఫ్యాన్స్ బీసీసీఐపై ఫైరవుతున్నారు.

ఐపీఎల్ మోజులో పడి జాతీయ జట్టును అస్సలు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు.. రెండు నెలల పాటు సుదీర్ఘంగా ఆడటం వల్లే టీమిండియా క్రికెటర్లు గాయాలు పాలవుతున్నారని ఫ్యాన్స్ ఫైరవుతున్నారు.విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మల తర్వాత ప్రస్తుత భారత క్రికెట్‌ జట్టులో ఆ స్థాయి బ్యాటర్​గా, మూడు ఫార్మాట్లలో సుదీర్ఘ కాలం టీమిండియాకుప్రాతినిధ్యం వహించి, గొప్ప ఆటగాళ్ల జాబితాలో చేరగల సామర్థ్యం ఉన్నవాడిగా పేరుంది కేఎల్‌ రాహుల్‌కు.

అయితే ప్రతిభ విషయంలో ఏ లోటూ లేకపోయినా.. ఇంకా రాహుల్‌ పూర్తి స్థాయి మ్యాచ్‌ విన్నర్‌గా మారలేదన్నది విశ్లేషకుల మాట. ఇటు ఐపీఎల్‌లో, అటు అంతర్జాతీయ క్రికెట్లో అతను కెప్టెన్‌గా లభించిన అవకాశాలను కూడా ఉపయోగించుకోలేకపోయాడు.

అయితే దక్షిణాఫ్రికాతో అయిదు టీ20ల సిరీస్‌లో కుర్రాళ్లతో నిండిన భారత జట్టును నడిపించే బాధ్యతను సెలక్టర్లు అతడికే అప్పగించారు. బ్యాటర్​గా, కెప్టెన్‌గా బలమైన ముద్ర వేయడానికి రాహుల్‌కిది చక్కటి అవకాశమే. కానీ.. గాయంతో ఇప్పుడు రాహుల్ ఆ అవకాశాన్ని కోల్పోయాడు.

First published:

Tags: Bcci, Cricket, Hardik Pandya, IND Vs SA, India vs South Africa, IPL 2022, KL Rahul, Rishabh Pant

ఉత్తమ కథలు