Home /News /sports /

IND VS SA BE ALERT FOR SOUTH AFRICA TEAM INDIAS STAR OPENER ROHIT SHARMA PRACTICE VIDEO GOES VIRAL IN SOCIAL MEDIA SRD

Rohit Sharma : బీ అలర్ట్ సౌతాఫ్రికా.. హిట్ మ్యాన్ వచ్చేస్తున్నాడు.. వైరలవుతున్న వీడియో..

Rohit Sharma

Rohit Sharma

Rohit Sharma : ఇక, త్వరలో ప్రారంభంకానున్న దక్షిణాఫ్రికా సిరీస్ లో టీమిండియాలో కీలకం కానున్నాడు రోహిత్ శర్మ. ఓపెనర్‌గా మంచి ఫామ్‌ను కొనసాగించాలని ప్రయత్నిస్తున్నాడు. రోహిత్ 2019లో ఓపెనింగ్ ప్రారంభించినప్పటి నుంచి సుదీర్ఘ ఫార్మాట్‌లో చక్కటి పరుగులు చేస్తుండటం విశేషం.

ఇంకా చదవండి ...
    దూకుడులో వీరేంద్ర సెహ్వాగ్‌ (Virender Sehwag) వారసత్వం.. భారీ ఇన్నింగ్స్‌లు ఆడటంలో యువ ఆటగాళ్లకు స్పూర్తి కలిగిస్తాడు.. సిక్సర్ల సునామీ సృష్టించడంలో అతడికి అతడే సాటి.. బ్యాటర్ గా ముందుండి నడిపిస్తాడు.. అవకాశం వచ్చిన ప్రతీసారి సారథిగా వెనకుండి ప్రోత్సహిస్తాడు అతడే టీమిండియా(Team India) హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma). ఇప్పుడు రోహిత్ శర్మకు బీసీసీఐ పెద్ద బాధ్యతల్ని అప్పగించింది. పరిమిత ఓవర్లకు పూర్తి కెప్టెన్‌గా రోహిత్‌ను బీసీసీఐ సారథిగా ఎంచుకుంది. టీ20 తర్వాత భారత వన్డే జట్టు కెప్టెన్సీ కూడా రోహిత్ శర్మకే అప్పగించారు. టీమిండియాను మరోసారి విశ్వవిజేతగా నిలబెట్టే బాధ్యత రోహిత్ శర్మపై ఉంది. రోహిత్ శర్మకు 2022 టీ20 ప్రపంచ కప్‌ను గెలుచుకునే టాస్క్ అందించారు. అదే సమయంలో 2023 ప్రపంచ కప్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడానికి అతనికి ఛాన్స్ ఇచ్చారు. వీటితో పాటు టెస్ట్ లకు కూడా వైస్ కెప్టెన్ గా నియమించిన సంగతి తెలిసిందే.

    ఇటీవల న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ కు రోహిత్ కు విశ్రాంతి కల్పించిన సంగతి తెలిసిందే. ఇక, రోహిత్ శర్మను అభిమానులు హిట్ మ్యాన్ గా పిలుచుకుంటారు. ఇక, త్వరలో ప్రారంభంకానున్న దక్షిణాఫ్రికా సిరీస్ లో టీమిండియాలో కీలకం కానున్నాడు రోహిత్ శర్మ. ఓపెనర్‌గా మంచి ఫామ్‌ను కొనసాగించాలని ప్రయత్నిస్తున్నాడు. రోహిత్ 2019లో ఓపెనింగ్ ప్రారంభించినప్పటి నుంచి సుదీర్ఘ ఫార్మాట్‌లో చక్కటి పరుగులు చేస్తుండటం విశేషం. మరోవైపు, ఆ సిరీస్ కోసం తన సన్నాహకాలను ప్రారంభించాడు హిట్ మ్యాన్.



    కొత్తగా టెస్ట్ జట్టు వైస్ కెప్టెన్‌ రోహిత్ శర్మ శుక్రవారం ముంబైలో శిక్షణా సెషన్‌లో పాల్గొన్నాడు. భారత దక్షిణాఫ్రికా పర్యటన కోసం నెట్‌లో చెమటోడ్చాడు. ప్రస్తుతం ప్రాక్టీస్‌కి సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తుంది. వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లతో రోహిత్‌ని అభినందిస్తున్నారు. ఈ స్టార్ బ్యాటర్ పేస్, బౌన్స్ అందించే పిచ్‌పై త్రోడౌన్ స్పెషలిస్ట్‌లతో కలిసి పని చేయడం వీడియోలో మనం చూడవచ్చు.

    ఇది కూడా చదవండి :  రోహిత్ శర్మనే గోతులు తవ్వాడా..? కోహ్లీని నమ్మించి మోసం చేశాడా..?

    స్టార్ ఓపెనర్ కి ఇద్దరు త్రోడౌన్ స్పెషలిస్టులు బౌలింగ్ చేస్తుండగా రోహిత్ బ్యాటింగ్ చేస్తూ కనిపించాడు. అతను నెట్స్‌లో మంచి డెలివరీలను వదిలివేయడంపై దృష్టి సారించడం మనకు కనిపిస్తుంది. దక్షిణాఫ్రికా సిరీస్‌ డిసెంబర్ 26 నుంచి ప్రారంభమవుతుంది. టీమిండియా 3-టెస్టుల సిరీస్‌ ఆడనుంది.

    దక్షిణాఫ్రికా VS భారత్ టెస్ట్ సిరీస్ పూర్తి షెడ్యూల్

    1వ టెస్ట్ – డిసెంబర్ 26 నుంచి 30 - సెంచూరియన్

    2వ టెస్టు- జనవరి 3 నుంచి 7 - జోహెన్నెస్ బర్గ్

    3వ టెస్ట్ – జనవరి 11 నుంచి 15 - కేప్ టౌన్
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: India vs South Africa, Rohit sharma, Viral Video

    తదుపరి వార్తలు