హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs SA 4th T20I : జట్టులోకి ఆ యంగ్ పేస్ గుర్రం.. అతనిపై వేటు.. కీలకపోరుకు భారత తుది జట్టు ఇదే..!

IND vs SA 4th T20I : జట్టులోకి ఆ యంగ్ పేస్ గుర్రం.. అతనిపై వేటు.. కీలకపోరుకు భారత తుది జట్టు ఇదే..!

Team India (PC : BCCI)

Team India (PC : BCCI)

IND vs SA 4th T20I : సౌతాఫ్రికాతో రాజ్ కోట్ వేదికగా శుక్రవారం జరగనున్న నాలుగో టీ20కి టీమిండియాకు ఎంతో కీలకం. ఈ మ్యాచులో గెలిచి 2-2తో సిరీస్ సమం చేయాలని టీమిండియా భావిస్తోండగా.. రాజ్ కోట్ లోనే గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని సౌతాఫ్రికా గేమ్ ప్లాన్ సిద్దం చేసుకుంటోంది.

ఇంకా చదవండి ...

దక్షిణాఫ్రికా (South Africa)తో వరుసగా రెండు మ్యాచ్ ల్లో ఓడిన టీమిండియా (Team India).. వైజాగ్ గేమ్ లో గెలిచి మళ్లీ ట్రాక్ లోకి వచ్చింది. ఇదే ఊపుతో మరో మ్యాచ్ గెలిచి సిరీస్ సమం చేయాలని భావిస్తోంది పంత్ సేన. ఈ క్రమంలో మరో డూ ఆర్ డై ఫైట్ కు రెడీ అయింది. సౌతాఫ్రికాతో రాజ్ కోట్ వేదికగా శుక్రవారం జరగనున్న నాలుగో టీ20కి టీమిండియాకు ఎంతో కీలకం. ఈ మ్యాచులో గెలిచి 2-2తో సిరీస్ సమం చేయాలని టీమిండియా భావిస్తోండగా.. రాజ్ కోట్ లోనే గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని సౌతాఫ్రికా గేమ్ ప్లాన్ సిద్దం చేసుకుంటోంది. గత మ్యాచులో ఎటువంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగిన టీమిండియా.. కీలక మ్యాచులో స్వల్ప మార్పులు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తుది జట్టు కాంబినేషన్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మూడో టీ20లో ఓపెనర్లు రుతురాజ్, ఇషాన్ కిషన్ తమ బ్యాటింగ్ తో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఇషాన్ కిషన్ ఈ సిరీస్ ఆసాంతం తన బ్యాటింగ్ తో ఆకట్టున్నాడు. మూడు మ్యాచుల్లో 164 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయ్. దీంతో, నాలుగో మ్యాచులో రుతురాజ్, ఇషాన్ కిషన్ లే ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. శ్రేయస్ అయ్యర్.. బ్యాటింగ్ లో ఫర్వాలేదన్పిస్తున్నా.. దూకుడుగా ఆడాల్సి ఉంది. కెప్టెన్ రిషబ్ పంత్ ఫామ్ ఫ్యాన్స్ ను టెన్షన్ పెట్టిస్తోంది. మ్యాచుకు అవసరమైన ఇన్నింగ్స్ ను పంత్ ఆడలేకపోతున్నాడు.

కీలక సమయాల్లో చెత్త బ్యాటింగ్ తో వికెట్ చేజార్చుకోవడమే కాకుండా.. జట్టును ప్రమాదంలోకి నెట్టేస్తున్నాడు. డూ ఆర్ డై ఫైట్ లో పంత్ ఫామ్ లోకి రావాల్సి ఉంటుంది. హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ ఫినిషర్ రోల్స్ ప్లే చేయనున్నారు. అక్షర్ పటేల్ గత మ్యాచులో రాణించడంతో అతనికి మరో ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. భువనేశ్వర్ కుమార్ ఈ సిరీస్ లో తన బౌలింగ్ తో టీమిండియా బౌలింగ్ లైనప్ కు లీడర్ గా ఉన్నాడు. హర్షల్ పటేల్, చాహల్ గత మ్యాచులో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. దీంతో.. నాలుగో టీ20లో కూడా వీరి స్ధానాలకు ఎటువంటి ఢోకా లేదు.

ఇది కూడా చదవండి : కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. హెడ్ కోచ్ లక్ష్మణ్.. ఐర్లాండ్ పర్యటనకు టీమిండియా సైన్యం ఇదే..!

వైజాగ్ వేదికగా జరిగిన మూడో టీ20సో యువ పేసర్ ఆవేశ్ ఖాన్ గాయపడటంతో టీమ్ కాంబినేషన్ లో స్వల్ప మార్పులు చోటు చేసుకోనున్నాయి. వరుసగా మూడు మ్యాచుల్లో అవకాశం కల్పించినా యువ పేసర్ ఆవేశ్ ఖాన్ సత్తా చాటలేకపోయాడు. మూడో టీ20లో బౌలర్లందరూ రాణించిన వేళ కూడా ఆవేశ్ విఫలమయ్యాడు. మూడు మ్యాచుల్లో కనీసం ఒక్కటంటే ఒక్క వికెట్ తీయలేకపోయాడు. తొలి టీ20లో 0/34, రెండో టీ20లో 0/17, మూడో టీ20 0/35తో పేలవ ప్రదర్శన కనబర్చాడు. దీంతో, అతని స్థానంలో అర్ష దీప్ కు చోటు కల్పించనుంది టీమిండియా.

టీమిండియా తుది జట్టు అంచనా :

రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్(కీపర్, కెప్టెన్), హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, అవేశ్ ఖాన్/అర్షదీప్ సింగ్/ఉమ్రాన్ మాలిక్

First published:

Tags: Cricket, IND Vs SA, India vs South Africa, Team India

ఉత్తమ కథలు