IND vs SA 4th T20 Live Scores : కీలక పోరులో భారత (India) కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) మళ్లీ టాస్ ఓడిపోయాడు. కెప్టెన్ గా రిషభ్ పంత్ టాస్ ఓడిపోవడం ఇది వరుసగా నాలుగోసారి కావడం విశేషం. ఇక టాస్ నెగ్గిన సౌతాఫ్రికా (South Africa) కెప్టెన్ తెంబా బవుమా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అయితే ఈ మ్యాచ్ కోసం దక్షిణాఫ్రికా ఏకంగా మూడు మార్పులు చేసింది. కీలక బౌలర్లు కగిసో రబడ, వేన్ పార్నెల్ గాయాలతో తప్పుకోగా వారిస్థానాల్లో లుంగీ ఎంగిడి, మార్కో యాన్సెన్ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇక గాయం నుంచి కోలుకున్న క్వింటన్ డికాక్.. రిజా హెండ్రిక్స్ స్థానంలో తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు భారత్ మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు. గత మూడు మ్యాచ్ ల్లో ఆడిన టీంతోనే బరిలోకి దిగేందుకు సిద్ధమైంది.
రాజ్ కోట్ మైదానంలో ఛేజింగ్ చేసిన జట్లు ఎక్కువ సార్లు గెలిచాయి. దాంతో ఈ మ్యాచ్ లో టాస్ చాలా కీలకంగా మారింది. అయితే టీమిండియా కెప్టెన్ రిషభ్ పంత్ మరోసారి టాస్ ఓడిపోవడం గమనార్హం. ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ లో భారత్ 1-2తో వెనుకబడి ఉన్న సంగతి తెలిసిందే. ఇకపై జరిగే రెండు మ్యాచ్ ల్లోనూ భారత్ నెగ్గితేనే సిరీస్ టీమిండియా వశం అవుతుంది. ఒక్కదాంట్లో ఓడినా అంతే సంగతులు. ఇక కూర్పు విషయానికి వస్తే.. హెడ్ కోచ్ ద్రవిడ్ టీంను మార్చేందుకు ఇష్టపడలేదు. మ్యాచ్ మ్యాచ్ కు ప్లేయింగ్ ఎలెవన్ ను మార్చడం ద్రవిడ్ కు ఇష్టం ఉండదని అందరికీ తెలిసిన సంగతే. అయితే భారత్ కు హార్దిక్ పాండ్యా రూపంలో మూడో సీమర్ అందుబాటులో ఉండటంతో.. అవేశ్ ఖాన్ స్థానంలో దీపక్ హుడా లేదా వెంకటేశ్ అయ్యర్ లలో ఒకరిని తీసుకుంటారని అంతా భావించారు. అయితే గత టీంనే కొనసాగించేందుకు భారత్ మొగ్గు చూపింది.
ఇక ఈ మ్యాచ్ కోసం సౌతాఫ్రికా మూడు మార్పులు చేసింది. గాయాలతో పార్నెల్, రబడ జట్టుకు దూరం కాగా.. గాయం నుంచి కోలుకున్న క్వింటన్ డికాక్ రిజా హెండ్రిక్స్ స్థానంలో తుది జట్టులోకి వచ్చాడు. వైజాగ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఓడి డీలా పడ్డ ప్రొటీస్ జట్టు ఈ మ్యాచ్ లో గెలిచి ఇక్కడే సిరీస్ ను సొంతం చేసుకోవాలని ఉంది.
తుది జట్లు
భారత్: రిషభ్ పంత్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్, శ్రేయస్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, అక్షర్, హర్షల్, అవేశ్ ఖాన్, భువనేశ్వర్, చహల్.
దక్షిణాఫ్రికా: బవుమా (కెప్టెన్), డికాక్, వాన్ డెర్ డసెన్, మిల్లర్, క్లాసెన్, ప్రిటోరియస్, మార్కో యాన్సెన్, లుంగీ ఎంగిడీ, కేశవ్, నోర్జే, షమ్సీ.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dinesh Karthik, Hardik Pandya, India, India vs South Africa, Rishabh Pant, Shreyas Iyer, South Africa, Team India