హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs SA 3rd T20 : టాస్ నెగ్గిన టీమిండియా.. కోహ్లీ, రాహుల్ అవుట్.. హైదరాబాదీ స్టార్ కు అవకాశం.. తుది జట్లు ఇవే

IND vs SA 3rd T20 : టాస్ నెగ్గిన టీమిండియా.. కోహ్లీ, రాహుల్ అవుట్.. హైదరాబాదీ స్టార్ కు అవకాశం.. తుది జట్లు ఇవే

PC : TWITTER

PC : TWITTER

IND vs SA 3rd T20 : దక్షిణాఫ్రికా (South Africa)తో ఇప్పటికే జరిగిన రెండు టి20ల్లోనూ గెలిచిన టీమిండియా (Team India) మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను సొంతం చేసుకుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

IND vs SA 3rd T20 : దక్షిణాఫ్రికా (South Africa)తో ఇప్పటికే జరిగిన రెండు టి20ల్లోనూ గెలిచిన టీమిండియా (Team India) మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను సొంతం చేసుకుంది. దాంతో ఇండోర్ వేదికగా జరిగే మూడో టి20 నామమాత్రంగా మారిపోయింది. ఇప్పటికే సిరీస్ కోల్పోయిన సౌతాఫ్రికా  చివరి మ్యాచ్ లోనైనా గెలిచి పరవు దక్కించుకోవాలని ఆరాటపడుతుంది. సిరీస్ గెలిచినా.. టి20 ప్రపంచకప్ ముందు జరుగుతున్న మ్యాచ్ కావడంతో దీనిని సన్నాహకంగా ఉపయోగించుకోవాలని రోహిత్ శర్మ (Rohit Sharma) చూస్తున్నాడు. ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం భారత్ మూడు మార్పులు చేసింది. కోహ్లీ, రాహుల్ కు విశ్రాంతి కల్పించింది. ఇక అర్ష దీప్ సింగ్ బ్యాక్ పెయిన్ కారణంగా ఈ మ్యాచ్ కు దూరమయ్యాడు. వీరి స్థానాల్లో ఉమేశ్ యాదవ్, సిరాజ్, శ్రేయస్ అయ్యర్ లను తుది జట్టులోకి తీసుకుంది. ఇక సౌతాఫ్రికా కూడా ఒక మార్పు చేసింది. అన్రిచ్ నోకియాను పక్కన బెట్టి అతడి స్థానంలో ప్రిటోరియస్ కు అవకాశం ఇచ్చింది.

ఓపెనర్ గా ఎవరు?

కేఎల్ రాహుల్, కోహ్లీలకు ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతి కల్పించడంతో రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ ఎవరు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్ లలో ఒకరు ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. ఇంగ్లండ్ తో జరిగిన టి20 సిరీస్ లో రిషభ్ పంత్ ఓపెనింగ్ చేసిన సంగతి తెలిసిందే.  ఈ సిరీస్ లో పంత్ కు ఇప్పటి వరకు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. దాంతో అతడిని ఓపెనర్ గా పంపే అవకాశం ఉంది.  భారత్ ఈ మ్యాచ్ లో ఏకంగా 4 సీమర్లు (సిరాజ్, ఉమేశ్, హర్షల్, దీపక్ చహర్)లతో ఆడనుంది. ఇక మరోవైపు సౌతాఫ్రికా పరిస్థితి ఏ మాత్రం సరిగ్గా లేదు. టి20 ప్రపంచకప్ కు ముందు కీలక ప్లేయర్లు ఫామ్ లో లేక ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా బవుమా, రైలీ రౌసో పూర్ ఫామ్ కంటిన్యూ అవుతుంది. అయితే ఈ మ్యాచ్ లో తాను తప్పకుండా పరుగులు సాధిస్తా అంటూ బవుమా టాస్ సమయంలో పేర్కొన్నాడు.

తుది జట్లు

టీమిండియా

రోహిత్ శర్మ (కెప్టెన్), పంత్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, కార్తీక్, అక్షర్ పటేల్, ఉమేశ్, హర్షల్ పటేల్, దీపక్ చహర్, అశ్విన్, సిరాజ్

సౌతాఫ్రికా

బవుమా (కెప్టెన్), క్వింటన్ డికాక్, మార్కరమ్, రైలీ రౌసౌ, డేవిడ్ మిల్లర్, ట్రిస్టాన్ స్టబ్స్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, ప్రిటోరియస్,  ఎంగిడి

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Axar Patel, Dinesh Karthik, India vs South Africa, KL Rahul, Rishabh Pant, Rohit sharma, Team India, Virat kohli