హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs SA 3rd T20 : సెంచరీతో చెలరేగిన రోసో.. భారత్ ముందు భారీ టార్గెట్! ఛేజ్ చేస్తే చరిత్రే

IND vs SA 3rd T20 : సెంచరీతో చెలరేగిన రోసో.. భారత్ ముందు భారీ టార్గెట్! ఛేజ్ చేస్తే చరిత్రే

PC : TWITTER

PC : TWITTER

IND vs SA 3rd T20 : ఇండోర్ వేదికగా సౌతాఫ్రికా (South Africa)తో జరుగుతున్న మూడో టి20లో భారత (India) బౌలర్లు తేలిపోయారు. దక్షిణాఫ్రికా బ్యాటర్ రైలీ రోసో (48 బంతుల్లో 100 నాటౌట్; 7 ఫోర్లు, 8 సిక్సర్లు) శతకంతో చెలరేగాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

IND vs SA 3rd T20 : ఇండోర్ వేదికగా సౌతాఫ్రికా (South Africa)తో జరుగుతున్న మూడో టి20లో భారత (India) బౌలర్లు తేలిపోయారు. దక్షిణాఫ్రికా బ్యాటర్ రైలీ రోసో (48 బంతుల్లో 100 నాటౌట్; 7 ఫోర్లు, 8 సిక్సర్లు) శతకంతో చెలరేగాడు. దాంతో సౌతాఫ్రికా 20 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 227 పరుగులు చేసింది. ఆరుగురు బౌలర్లతో బరిలోకి దిగినా భారత్ కు లాభం లేకుండా పోయింది. క్వింటన్ డికాక్ (43 బంతుల్లో 68; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) తన ఫామ్ ను కంటిన్యూ చేశాడు. భారత బౌలర్లలో దీపక్ చహర్, ఉమేశ్ యాదవ్ లు చెరో వికెట్ సాధించారు. ఈ మ్యాచ్ లో భారత్ ఛేజ్ చేస్తే గనకు కొత్త చరిత్రను నెలకొల్పే అవకాశం ఉంది. భారత్ అంతర్జాతీయ టి20ల్లో ఇప్పటి వరకు అత్యధిక పరుగుల ఛేజ్ ను శ్రీలంకపై 2009లో నమోదు చేసింది. మొహాలి వేదికగా జరిగిన ఆ మ్యాచ్ లో భారత్ 211 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.

రోసో సూపర్ సెంచరీ

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికాకు మరోసారి శుభారంభం దక్కలేదు. పూర్ ఫామ్ లో ఉన్న బవుమా (3) మరోసారి విఫలం అయ్యాడు. ఇక వన్ డౌన్ లో వచ్చిన రోసో మాత్రం చెలరేగిపోయాడు. తొలి రెండు టి20ల్లో పరుగుల ఖాతా కూడా తెరవకుండానే పెవిలియన్ కు చేరిన రోసో ఈ మ్యాచ్ లో విశ్వరూపం ప్రదర్శించాడు. రెండో టి20లో మిల్లర్ శతకం బాదితే.. ఇప్పుడు తన వంతంటూ దొరికిన బంతిని దొరికినట్లు స్టాండ్స్ లోకి పంపాడు. రెండో టి20లో అర్ధ సెంచరీ చేసినా ఇబ్బంది పడుతూ ఆడిన క్వింటన్ డికాక్ ఈ మ్యాచ్ లో మాత్రం చక్కగా ఆడాడు. ముఖ్యంగా రివర్స్ స్వీప్ షాట్లతో హోరెత్తించాడు. వీరిద్దరూ ధాటిగా ఆడటంతో దక్షిణాఫ్రికా 10 ఓవర్లలో 96 పరుగులు సాధించింది. ఇక లేని పరుగు కోసం ప్రయత్నించిన క్వింటన్ డికాక్ శ్రేయస్ అయ్యర్ బుల్లెట్ త్రోకు రనౌట్ అయ్యాడు. అయితే మరో ఎండ్ లో ఉన్న రోసో మాత్రం తన దైన శైలిలో ఆడాడు. ఈ క్రమంలో 48 బంతుల్లో సెంచరీని అందుకున్నాడు.

మిల్లర్ కిల్లర్

19వ ఓవర్ వేసిన సిరాజ్ కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక 20వ ఓవర్ వేసిన దీపక్ చహర్ తొలి బంతికి వైడ్ ద్వారా మొత్తం మూడు పరుగులు సమర్పించుకున్నాడు. అయితే ఆ తర్వాత రెండు బంతులకు ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా డేంజరస్ బ్యాటర్ స్టబ్స్ (23) వికెట్ ను తీశాడు. అయితే మిల్లర్ క్రీజులోకి వచ్చి హ్యాట్రిక్ సిక్సర్లు బాదాడు. దాంతో చివరి ఓవర్లో సౌతాఫ్రికా 24 పరుగులు రాబట్టింది. ఫలితంగా స్కోరు బోర్డు 227 మార్కును అందుకుంది.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Axar Patel, Dinesh Karthik, India vs South Africa, Mohammed Siraj, Rishabh Pant, Rohit sharma, Shreyas Iyer, Team India

ఉత్తమ కథలు