హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs SA 3rd T20 : ప్రయోగాలకు రెడీ.. రోహిత్ డౌట్.! సిరాజ్ తో పాటు ఆ బ్యాటర్ కు ఛాన్స్! టీమిండియా తుది జట్టు ఇదే

IND vs SA 3rd T20 : ప్రయోగాలకు రెడీ.. రోహిత్ డౌట్.! సిరాజ్ తో పాటు ఆ బ్యాటర్ కు ఛాన్స్! టీమిండియా తుది జట్టు ఇదే

PC : TWITTER/BCCI

PC : TWITTER/BCCI

IND vs SA 3rd T20 : దక్షిణాఫ్రికా (South Africa)తో మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ లో భాగంగా ఇప్పటికే జరిగిన రెండు టి20ల్లోనూ భారత్ (India) విజయం సాధించింది. దాంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను సొంతం చేసుకుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

IND vs SA 3rd T20 : దక్షిణాఫ్రికా (South Africa)తో మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ లో భాగంగా ఇప్పటికే జరిగిన రెండు టి20ల్లోనూ భారత్ (India) విజయం సాధించింది. దాంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను సొంతం చేసుకుంది. ఇక నామమాత్రంగా ఇండోర్ వేదికగా జరిగే చివరిదైన మూడో టి20లో రిజర్వ్ బెంచ్ ను పరీక్షించేందుకు టీమిండియా సిద్ధమైంది. ఈ క్రమంలో మూడో టి20ల ో టీమిండియా తుది జట్టు ఎలా ఉంటుందో అని అందరిలోనూ ఉత్కంఠ నెలకొని ఉంది. మరోవైపు మూడో టి20లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని సౌతాఫ్రికా యోచిస్తోంది. ఆ జట్టులో ప్రస్తుతానికైతే మిల్లర్ మార్కరమ్ మాత్రమే టచ్ లో ఉన్నట్లు కనిపిస్తున్నారు. బవూమా, రౌసౌ లు పూర్ ఫామ్ లో ఉన్నారు.

రోహిత్ డౌట్!

ఇక మూడో టి20లో రోహిత్ శర్మ ఆడేది అనుమానంగానే కనిపిస్తుంది. రెండో టి20 సందర్భంగా రోహిత్ శర్మ తీవ్ర ఇబ్బంది పడ్డాడు. మొదట బ్యాటింగ్ చేసే సమయంలో రోహిత్ శర్మ మణికట్టుకు బంతి బలంగా తాకింది. దాంతో అతడు ఫిజియోతో చికిత్స కూడా చేయించుకున్నాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కొనసాగించాడు. ఇక ఫీల్డింగ్ చేస్తున్న సమయలో ముక్కు నుంచి రక్తం కూడా కారింది. దాంతో అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే ఉక్కపోత  వాతావరణంలో డీహైడ్రేషన్ అవ్వడం వల్లే ముక్కు నుంచి రక్తం కారిందని సమాచారం. దాంతో రోహిత్ శర్మకు మూడో టి20లో విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. అతడి స్థానంలో శ్రేయస్ అయ్యర్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక అదే సమయంలో హర్షల్ లేదా దీపక్ చహర్ లలో ఒకర్ని తప్పించి వారి స్థానంలో సిరాజ్ ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.

వారిద్దరికి కూడా

గాయం నుంచి పునరాగమనం చేసిన నాటి నుంచి హర్షల్ పటేల్ వరుసగా మ్యాచ్ లు ఆడుతున్నాడు. దాంతో హర్షల్ పటేల్ కు మూడో టి20లో రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. అతడి స్థానంలో సిరాజ్ ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. అదే సమయంలో రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో చహల్ కు అవకాశం ఇవ్వొచ్చు. సౌతాఫ్రికాతో జరిగిన తొలి రెండు మ్యాచ్ లకు కూడా చహల్ బెంచ్ కే పరిమితం అయ్యాడు. అశ్విన్ గత రెండు మ్యాచ్ ల్లో మెరుగ్గానే బౌలింగ్ చేసినా.. కీలక సమయాల్లో వికెట్లను అందించడంలో విఫలం అయ్యాడు. దాంతో చహల్ లాంటి వికెట్ టేకింగ్ బౌలర్ కే మూడో టి20లో ఛాన్స్ దక్కవచ్చు.

టీమిండియా తుది జట్టు (అంచనా) 

కేఎల్ రాహుల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, అశ్విన్/చహల్, దీపక్ చహర్, అర్ష్ దీప్ సింగ్, హర్షల్ పటేల్/సిరాజ్

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Axar Patel, Dinesh Karthik, India vs South Africa, KL Rahul, Ravichandran Ashwin, Rishabh Pant, Rohit sharma, Shreyas Iyer, Team India, Virat kohli

ఉత్తమ కథలు