హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs SA 3rd T20 : లైట్ తీసుకున్నారు.. బొక్క బోర్లా పడ్డారు.. టి20 ప్రపంచకప్ లో మాత్రం ఇలా అస్సలు చేయకండి

IND vs SA 3rd T20 : లైట్ తీసుకున్నారు.. బొక్క బోర్లా పడ్డారు.. టి20 ప్రపంచకప్ లో మాత్రం ఇలా అస్సలు చేయకండి

PC : TWITTER

PC : TWITTER

IND vs SA 3rd T20 : నామమాత్రంగా జరిగిన మూడో టి20లో దక్షిణాఫ్రికా (South Africa) విజయం సాధించి పరువు దక్కించుకుంది. ఇండోర్ వేదికగా జరిగిన ఈ పోరులో టీమిండియా (Team India)పై దక్షిణాఫ్రికా 49 పరుగుల తేడాతో నెగ్గింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

IND vs SA 3rd T20 : నామమాత్రంగా జరిగిన మూడో టి20లో దక్షిణాఫ్రికా (South Africa) విజయం సాధించి పరువు దక్కించుకుంది. ఇండోర్ వేదికగా జరిగిన ఈ పోరులో టీమిండియా (Team India)పై దక్షిణాఫ్రికా 49 పరుగుల తేడాతో నెగ్గింది. 228 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 18.2 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ ను భారత్ 2-1తో సొంతం చేసుకుంది. భారీ ఛేదనలో దినేశ్ కార్తీక్ (21 బంతుల్లో 46; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) ధాటిగా ఆడినా అవసరం లేని షాట్ కు వెళ్లి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. చివర్లో దీపక్ చహర్ (18 బంతుల్లో 31; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా భారీ షాట్లు ఆడాడు.

చెత్త షాట్లు

కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీలకు ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతి కల్పించడంతో భారత్ ఒక స్పెషలిస్టు బ్యాటర్ లేకుండానే ఈ మ్యాచ్ బరిలోకి దిగింది. రాహుల్ లేకపోవడంతో రిషభ్ పంత్ రోహిత్ తో కలిసి ఓపెనింగ్ కు వచ్చాడు. ఇక రోహిత్ శర్మ (0) మరోసారి డకౌట్ అయ్యాడు. రోహిత్ కు ఈ సిరీస్ లో ఇది రెండో డకౌట్ కావడం విశేషం. రాక రాక వచ్చిన అవకాశాన్ని శ్రేయస్ అయ్యర్ నేలపాలు చేసుకున్నాడు. కేవలం 1 పరుగు మాత్రమే చేసి ఎల్బీగా వెనుదిరిగాడు. అయితే రిషభ్ పంత్ ఉన్నంత సేపు దూకుడుగా ఆడాడు. ఎంగిడి వేసిన ఓవర్లో 2 సిక్సర్లు, 2 ఫోర్లు కొట్టి దూకుడు మీద కనిపించాడు. అయితే అదే ఓవర్లో బంతిని అంచనా వేయడంలో విఫలమై స్టబ్స్ పట్టిన అద్భుత క్యాచ్ కు పెవిలియన్ కు చేరాడు. బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుగా వచ్చిన దినేశ్ కార్తీక్ అదిరపోయే షాట్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. మైదానం నలువైపులా భారీ షాట్లు ఆడాడు. క్రికెట్ బుక్ లోని షాట్లు ఆడుతూనే ఇన్నోవేటివ్ షాట్లతో కూడా పరుగులు రాబట్టాడు. భారీ ఇన్నింగ్స్ ఆడేలా కనిపించిన కార్తీక్.. కేశవ్ మహరాజ్ బౌలింగ్ లో రెండు భారీ సిక్సర్లు బాదాడు. అయితే స్విచ్ హిట్ కు ప్రయత్నించి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కాసేపటికే ఫామ్ లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ కూడా స్టబ్స్ పట్టిన కళ్లు చెదిరే క్యాచ్ కు పెవిలియన్ కు చేరుకున్నాడు. ఇక అక్షర్ పటేల్ (9), అశ్విన్ (2) అలా వచ్చి ఇలా వెళ్లారు. హర్షల్ పటేల్ (17) ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. చివర్లో దీపక్ చహర్ సిక్సర్లు బాదినా అది ప్రాక్టీస్ లా ఉపయోగపడిందే తప్ప భారత్ ను గెలిపించలేకపోయింది.

అంతకుముందు దక్షిణాఫ్రికా బ్యాటర్ రైలీ రోసో (48 బంతుల్లో 100 నాటౌట్; 7 ఫోర్లు, 8 సిక్సర్లు) శతకంతో చెలరేగాడు. దాంతో సౌతాఫ్రికా 20 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 227 పరుగులు చేసింది. ఆరుగురు బౌలర్లతో బరిలోకి దిగినా భారత్ కు లాభం లేకుండా పోయింది. క్వింటన్ డికాక్ (43 బంతుల్లో 68; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) తన ఫామ్ ను కంటిన్యూ చేశాడు. భారత బౌలర్లలో దీపక్ చహర్, ఉమేశ్ యాదవ్ లు చెరో వికెట్ సాధించారు.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Axar Patel, Dinesh Karthik, India vs South Africa, Mohammed Siraj, Ravichandran Ashwin, Rishabh Pant, Rohit sharma, Team India

ఉత్తమ కథలు