Home /News /sports /

IND VS SA 3RD T20 LIVE SCORES WATCH FIGHT BETWEEN ISHAN KISHAN AND TABRAIZ SHAMSI IN 3RD INDIA VS SOUTH AFRICA T20 MATCH SJN

IND vs SA : ఇషాన్ కిషన్ ను ఎగతాళి చేసిన దక్షిణాఫ్రికా స్టార్ బౌలర్.. ఆ తర్వాత ఇషాన్ ఏం చేశాడంటే?

(PC : BCCI)

(PC : BCCI)

IND vs SA : దక్షిణాఫ్రికా (South Africa) స్పిన్నర్ తబ్రేజ్ షంసీ, భారత స్టార్ ఓపెనర్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) మధ్య చిన్నపాటి మాటల యుద్ధం నడిచింది. వైజాగ్ వేదికగా జరగుతోన్న మూడో టి20లో ఈ సంఘటన చోటు చేసుకుంది.

IND vs SA : దక్షిణాఫ్రికా (South Africa) స్పిన్నర్ తబ్రేజ్ షంసీ, భారత స్టార్ ఓపెనర్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) మధ్య చిన్నపాటి మాటల యుద్ధం నడిచింది. వైజాగ్ వేదికగా జరగుతోన్న మూడో టి20లో ఈ సంఘటన చోటు చేసుకుంది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా టీమిండియా (Team India)ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ఓపెనర్లుగా వచ్చిన రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ ఆరంభం నుంచే ధాటిగా బ్యాటింగ్ చేశారు. అయితే 9వ ఓవర్ వేయడానికి షంసీ బౌలింగ్ కు వచ్చాడు. 9వ ఓవర్ నాలుగో బంతిని కిషన్ సిక్సర్ బాదాడు. ఆ తర్వాత వేసిన ఐదో బంతిని రివర్స్ స్వీప్ ఆడబోయి విఫలం అయ్యాడు. బంతి నేరుగా ఫీల్డర్ దగ్గరకు వెళ్లగా.. మోకాళ్లపై కూర్చున్న కిషన్ షాట్ మిస్ చేశానే అంటూ బాధపడ్డాడు. ఇదే సమయంలో షంసీ తన నోటికి పని చెప్పాడు.

’రివర్స్ స్వీప్ ఆడటం‘ నీవల్ల కాదంటూ అర్థం వచ్చేలా మాట్లాడినట్లు ఉన్నాడు. దాంతో చిరెత్తుకొచ్చిన కిషన్.. మాటకు మాట బదులిచ్చాడు. ఇక ఆఖరి షంసీ ఆఖరి బంతిని వేయగా.. ఫైన్ లెగ్ దిశగా బౌండరీ బాది పగ తీర్చుకున్నాడు. వీరిద్దరి గొడవకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరూ చూసేయండి మరీ..



రుతురాజ్ గైక్వాడ్ (35 బంతుల్లో 57; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (35 బంతుల్లో 54; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో సత్తా చాటారు. టాస్ ముందు వరకు కూడా తుది జట్టులో ఉంటాడో లేదో తెలియని స్థితిలో హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) నమ్మకముంచడంతో రుతురాజ్ ఈ మ్యాచ్ లో బరిలోకి దిగాడు. దిగడమే కాదు తనపై ద్రవిడ్ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. వీరితో పాటు చివర్లో హార్దిక్ పాండ్యా (21 బంతుల్లో 31; 4 ఫోర్లు) కూడా ఓ మోస్తరుగా ఆడటంతో.. భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 179 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో ప్రిటోరియస్ రెండు వికెట్లు తీశాడు.

ఓపెనర్లు మినహా

కెప్టెన్ గా రిషభ్ పంత్ వరుసగా మూడోసారి టాస్ ఓడిపోయాడు. టాస్ నెగ్గిన బవుమా మరోసారి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. క్రీజులోకి వచ్చిన రుతురాజ్, ఇషాన్ కిషన్ ఆరభం నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా రుతురాజ్ గైక్వాడ్ అద్బుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. మరో ఎండ్ లో ఉన్న ఇషాన్ కిషన్ కూడా సత్తా చాటడంతో స్కోరు బోర్డు వేగంగా కదిలింది. పవర్ ప్లేలో 57 పరుగులు సాధించిన టీ మిండియా.. 10 ఓవర్లు మగిసే సరికి వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది. 10వ ఓవర్ ఆఖరి బంతికి రుతురాజ్ అవుటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ (14) రెండు సిక్సర్లు బాదిన తర్వాత పెవిలియన్ కు చేరగా.. వెంట వెంటనే ఇషాన్ కిషన్, పంత్ (6) పెవిలియన్ కు చేరాడు. దాంతో పరుగులు రావడం చాలా కష్టంగా మారింది. దినేశ్ కార్తీక్ (6) విఫలమయ్యాడు. చివర్లో హార్దిక్ పాండ్యా బౌండరీలు సాధించడంతో మెరుగైన స్కోరును సాధించగలిగింది. ఓపెనర్లు శుభారంభం చేయడంతో భారత్ 200 మార్కును చేరుకుంటుందని అంతా అనుకున్నా దానికి 21 పరుగుల దూరంలోనే భారత్ ఆగిపోయింది.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Dinesh Karthik, Hardik Pandya, India, India vs South Africa, Rishabh Pant, Shreyas Iyer, South Africa, Team India

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు