Home /News /sports /

IND VS SA 3RD ODI UPDATES TEAM INDIA FANS SLAMS VIRAT KOHLIS CASUAL BEHAVIOR DURING INDIAS NATIONAL ANTHEM WATCH SRD

Viral Video : " దేశం పట్ల నీకు ఉన్న గౌరవం ఇదేనా..? " కోహ్లీ అనుచిత ప్రవర్తనపై ఫ్యాన్స్ ఫైర్..

Virat Kohli (Twitter)

Virat Kohli (Twitter)

Viral Video : టీమిండియా క్రికెట్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా, భారత యూత్‌కి రోల్‌ మోడల్‌గా నిలుస్తున్న విరాట్ కోహ్లీ నుంచి ఇలాంటి అనుచిత ప్రవర్తన వస్తుందని ఏ మాత్రం ఊహించలేదని అంటున్నారు అభిమానులు.

    భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) కి సోషల్ మీడియాలో బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. 150 మిలియన్లకు పైగా ఫాలోవర్లను కలిగి ఉన్న విరాట్‌ కోహ్లీకి హేటర్స్ కూడా ఎక్కువే. దీనికి ప్రధాన కారణం అతని యాటిట్యూడ్. ఆఫ్ ఫీల్డ్ ఎంతో వినయంగా నడుచుకుంటూ, ఫన్నీగా అందరితో కలిసిపోయి నవ్వుతూ నవ్వించే విరాట్ కోహ్లీ... ఆన్ ది ఫీల్డ్ మాత్రం చాలా అగ్రెసివ్... ఏదైనా తప్పు చేస్తే, తప్పు చేశారని అనుకుంటే సొంత జట్టు ప్లేయర్లపై కూడా నోరుపారేసుకుంటూ ఉంటాడు కోహ్లీ. అయితే కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన తర్వాత.. విరాట్ కోహ్లీ ప్రవర్తనలో ఈ మధ్య చాలా మార్పు వచ్చింది. ఇంతకుముందుతో పోలిస్తే చాలా కూల్ అండ్ కామ్‌గా కనిపిస్తున్నాడు విరాట్. అలాగే, మైదానంలో కూడా పట్టి పట్టనట్టు వ్యవహరిస్తున్నాడు. టీమిండియా (Team India) ఫీల్డింగ్ సమయంలో ఇది వరకు దూకుడును అస్సలు చూపించడం లేదు. అయితే, మూడో వన్డేకు ముందు విరాట్ కోహ్లీ చేసిన పని ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారింది.

    మ్యాచ్ ఆరంభానికి ముందు వినిపించే జాతీయ గీతాన్ని (National Anthem) ఆలపిస్తూ, విరాట్ కోహ్లీ కళ్లలోనే దేశం మీద తనకున్న గౌరవం కనిపించేది. అయితే ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని విరాట్ కోహ్లీ నిర్ణయం తీసుకోవడం... ఆ తర్వాత అతన్ని బలవంతంగా వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ భారత క్రికెట్ బోర్డు సెలక్టర్లు నిర్ణయం తీసుకోవడం జరిగిపోయాయి.

    టెస్టుల్లో అయినా కెప్టెన్‌గా కొనసాగుతాడులే... అనుకుంటున్న సమయంలో కేప్‌ టౌన్ టెస్టు ఓటమి తర్వాత టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటూ సంచలన నిర్ణయం తీసుకుని, అందర్నీ అవాక్కయ్యేలా చేశాడు విరాట్ కోహ్లీ. సౌతాఫ్రికాలో టెస్టు సిరీస్ ఓటమి తర్వాత టెస్టు సారథ్య బాధ్యతలు నుంచి తప్పుకోవాలని బీసీసీఐ, విరాట్ కోహ్లీని హెచ్చరించిందని... తప్పుకోకపోతే వన్డేల్లో చేసినట్టే బలవంతంగా తప్పిస్తామని బెదిరించిందని వార్తలు వినిపించాయి.

    ఇది కూడా చదవండి : నీ యవ్వ తగ్గేదే లే.. శ్రీవల్లి పాటకు స్టెప్పులు ఇరగదీసిన సురేష్ రైనా..

    అయితే, ఈ ఘటనల తర్వాత కోహ్లీ పూర్తిగా మారిపోయినట్లు కన్పిస్తోంది. తాజాగా సౌతాఫ్రికాతో మూడో వన్డే ఆరంభానికి ముందు భారత జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో విరాట్ కోహ్లీ బబుల్ గమ్ నములుతూ నిలబడడం చూసి సగటు క్రికెట్ అభిమాని ఆశ్చర్యానికి గురి అయ్యాడు. ఇంతకుముందు ఇలాంటి ప్రవర్తన కారణంగానే కశ్మీర్ ప్లేయర్ పర్వేజ్ రసూల్ తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.










    టీమిండియా క్రికెట్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా, భారత యూత్‌కి రోల్‌ మోడల్‌గా నిలుస్తున్న విరాట్ కోహ్లీ నుంచి ఇలాంటి అనుచిత ప్రవర్తన వస్తుందని ఏ మాత్రం ఊహించలేదని అంటున్నారు అభిమానులు. 52 సెకన్లపాటు ఆలపించే జాతీయ గీతం వస్తున్నంత సేపు అయినా బబుల్ గమ్ నమలకుండా ఉండలేకపోయావా? అంటూ ట్రోల్ చేస్తున్నారు అభిమానులు.జాతీయ గీతం ఆలపించకపోయినా, అది ప్లే అవుతున్నప్పుడు నిశ్శబ్దంగా నిల్చుంటే సరిపోతుంది. అయితే విరాట్ కోహ్లీ మాత్రం ఈ జట్టుతో, ఈ దేశంతోనే తనకేమీ సంబంధం లేనట్టుగా బబుల్ గమ్‌ ఎంజాయ్ చేయడమే ముఖ్యమన్నట్టుగా వ్యవహరించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: IND Vs SA, India vs South Africa, Sports, Virat kohli

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు