Home /News /sports /

IND VS SA 3RD ODI UPDATES BHUVNESHWAR KUMAR AND VENKATESH IYER OUT HERE TEAM INDIA PREDICTED PLAYING XI AGAINST SOUTH AFRICA SRD

Ind Vs Sa : పరువు కోసం భారత్ పోరాటం.. ఆ ఇద్దరిపై వేటు.. మూడో వన్డేలో మార్పులివే..!

Team India

Team India

Ind Vs Sa : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో ప్రతి విభాగంలోనూ భారత జట్టు పేలవంగా కనిపించింది. మూడో వన్డేలోనూ పరిస్థితి మారకపోతే వన్డే సిరీస్‌లో టీమిండియా క్లీన్‌స్వీప్‌ను కూడా ఎదుర్కోక తప్పదు.

    భారీ ఆశలతో దక్షిణాఫ్రికా (South Africa) గడ్డపై అడుగుపెట్టిన భారత్ (Team India) కు నిరాశే ఎదురైంది. 30 ఏళ్ల చరిత్ర సృష్టించాలనే ఆశలు కాస్త చెడిపోయాయి. టెస్టు సిరీస్‌తోపాటు వన్డే సిరీస్‌ను కూడా కోల్పోయింది. మరోసారి ఖాళీ చేతులతో ఇంటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. పార్ల్‌లో జరిగిన తొలి రెండు వన్డేల్లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. తొలి వన్డేలో టీమిండియా 31 పరుగుల తేడాతో ఓడి, రెండో వన్డేలో 7 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. దీంతో పరువు దక్కించుకోవడానికి మూడో వన్డే (Ind Vs Sa)లో పోరాటానికి సిద్ధమైంది రాహుల్ సేన. కనీసం వన్డే సిరీస్‌లో మిగిలిన చివరి మ్యాచ్‌నైనా గెలిచి విజయంతో సౌతాఫ్రికా పర్యటనను ముగించాలని భావిస్తోంది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో ప్రతి విభాగంలోనూ భారత జట్టు పేలవంగా కనిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆతిథ్య జట్టు 2-0తో తిరుగులేని ఆధిక్యాన్ని పొందాల్సి వచ్చింది. మూడో వన్డేలోనూ పరిస్థితి మారకపోతే వన్డే సిరీస్‌లో టీమిండియా క్లీన్‌స్వీప్‌ను కూడా ఎదుర్కోక తప్పదు. తొలి రెండు వన్డేల్లో దారుణంగా విఫలమైన టీమిండియాలో మార్పులు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

    తొలి రెండు వన్డేల్లో ఒక్క వికెట్ కూడా తీయకుండా 64, 67 పరుగులు ఇచ్చుకొని దారుణంగా విఫలమైన స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌పై వేటు పడటం ఖాయం. అతని స్థానంలో యువ పేసర్ దీపక్ చాహర్ తుది జట్టులోకి రానున్నాడు. జస్‌ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్‌తో కలిసి దీపక్ చాహర్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నాడు. జస్ప్రీత్ బుమ్రాకి రెస్ట్ ఇస్తే.. జట్టులోకి ప్రసిద్ధ్ కృష్ణ రానున్నాడు.

    ఇక స్పిన్నర్లలో రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్ ఆడటం ఖాయంగా కన్పిస్తోంది. పవర్‌ప్లేతో పాటు మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయడంలో భారత ఆటగాళ్లు తడబడుతున్నారు. ఆ సమస్యను అధిగమించకుంటే క్లీన్ స్వీప్ అయ్యే ప్రమాదం ఉంది.

    ఓపెనర్లు శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్ బరిలోకి దిగడంలో మార్పు ఉండకపోవచ్చు. అయితే సూపర్ ఫామ్‌లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్‌ను ఆడించాలనుకుంటే మాత్రం శిఖర్ ధావన్‌ బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంది. లేకుంటే రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన శ్రేయస్ అయ్యర్‌పై వేటు పడవచ్చు.

    ఇది కూడా చదవండి : ఏందీ లొల్లి..! విరాట్ కోహ్లీకి షోకాజ్ నోటీసులపై గంగూలీ క్లారిటీ..

    హార్దిక్ పాండ్యాకు ప్రత్యామ్నాయంగా జట్టులోకి తీసుకువచ్చిన యువ ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్.. రెండు మ్యాచ్‌ల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. బ్యాటర్ గా.. బౌలర్‌గా విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే మూడో వన్డేలో అతనికి చోటు ఇస్తారా? లేదా? అనేది చూడాలి. శార్దూల్ ఠాకూర్ మెరుగ్గా బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో వెంకటేశ్ బదులు స్పెషలిస్ట్ బ్యాటర్ ను తీసుకోవచ్చు.

    టీమిండియా తుది జట్టు అంచనా :

    కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్/రుతురాజ్ గైక్వాడ్, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్, దీపక్ చాహర్, జస్‌ప్రీత్ బుమ్రా/ప్రసిద్ధ్ కృష్ణ, యుజువేంద్ర చాహల్
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Cricket, India vs South Africa, KL Rahul, Team India, Virat kohli

    తదుపరి వార్తలు