Home /News /sports /

IND VS SA 3RD ODI TEAM INDIA SHOULD CONCENTRATE AND SOLVE THESE FOUR MISTAKES TO SAVE SERIES SRD

IND vs SA 3rd ODI : టీమిండియాకు టైం లేదు .. సిరీస్ లో నిలవాలంటే ఈ 4 తప్పులు సరిదిద్దుకోవాల్సిందే.. !

Team India (PC : BCCI)

Team India (PC : BCCI)

IND vs SA 3rd ODI : అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ పూర్తిగా విఫలమైన టీమిండియా వరుసగా రెండు మ్యాచ్ ల్లోనూ ఓడి అభిమానుల చేతుల్లో చివాట్లు తింటోంది. ఈ నేపథ్యంలో మూడో టి20లో తప్పక నెగ్గాల్సిన పరిస్థితి.

    దక్షిణాఫ్రికా (South Africa)తో వరుసగా రెండు మ్యాచ్ ల్లో ఓడిన టీమిండియా (Team India) డీలా పడింది. రోజు విరామం తర్వాత సాగర తీరం విశాఖపట్టణం వేదికగా మూడో టి20కి సిద్ధమైంది. సిరీస్ లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితి టీమిండియాది. ఫేవరెట్ గా బరిలోకి దిగిన భారత్ ను దక్షిణాఫ్రికా వరుస పోరుల్లో చిత్తు చిత్తుగా ఓడించింది. రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli) లాంటి ప్లేయర్ల గైర్హాజరీలో రిషభ్ పంత్ (Rishabh Pant) కెప్టెన్సీలో ఈ సిరీస్ లో టీమిండియా పాల్గొంటుంది. అయితే అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ పూర్తిగా విఫలమైన టీమిండియా వరుసగా రెండు మ్యాచ్ ల్లోనూ ఓడి అభిమానుల చేతుల్లో చివాట్లు తింటోంది. ఈ నేపథ్యంలో మూడో టి20లో తప్పక నెగ్గాల్సిన పరిస్థితి. ఈ మ్యాచ్ లోనూ టీమిండియా ఓడితే సిరీస్ ను మరో రెండు మ్యాచ్ లు ఉండగానే కోల్పోయే అవకాశం ఉంది. ఇప్పుడు సిరీస్‌ను కాపాడుకోవాలంటే టీమిండియా ఈ నాలుగు తప్పులను సరిదిద్దుకోవాల్సి ఉంటుంది.

    పవర్‌ప్లేలో దూకుడు పెంచాలి

    తొలి రెండు మ్యాచ్‌ల్లో టీమిండియా ఓపెనర్లు పవర్ ప్లేలో సత్తా చాటలేకపోయారు. రోహిత్ శర్మ మరియు KL రాహుల్ లేకపోవడంతో, ఇషాన్ కిషన్ మరియు రుతురాజ్ గైక్వాడ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. అయితే పవర్‌ప్లేలో దూకుడుగా బ్యాటింగ్ చేయడంలో విఫలమయ్యారు. రెండు మ్యాచ్‌ల్లోనూ ఇషాన్ బ్యాటింగ్ బాగానే చేశాడు. తొలి మ్యాచ్‌లో 158 స్ట్రైక్ రేట్‌తో 48 బంతుల్లో 76 పరుగులు చేశాడు. రెండో టీ20లో 21 బంతుల్లో 34 పరుగులు చేసి ఔటయ్యాడు.



    అయితే రుతురాజ్ గైక్వాడ్ రెండు మ్యాచ్‌ల్లోనూ భారీ స్కోరు చేయలేకపోయాడు. అతను మొదటి మ్యాచ్‌లో 23, రెండో మ్యాచ్‌లో ఒక పరుగు మాత్రమే చేశాడు. తొలి టీ20లో భారీ స్కోరు సాధించిన టీమిండియా.. పవర్ ప్లే 6 ఓవర్లలో 51 పరుగులు మాత్రమే చేసింది. ఇక, రెండో టీ20లో తొలి ఓవర్ లోనే రుతురాజ్ ఔటయ్యాడు. మూడో మ్యాచ్‌లో టీమిండియా ఈ తప్పును సరిదిద్దుకోవాల్సి ఉంటుంది.

    మిడిలార్డర్ సెట్ అవ్వాలి

    భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన తొలి 2 టీ20ల్లో వారి విజయానికి, మన ఓటమికి ప్రధాన కారణం ఇరు జట్ల బ్యాటింగ్. మిడిలార్డర్ లో సౌతాఫ్రికా బ్యాటర్లు రెచ్చిపోతుంటే.. టీమిండియా బ్యాటర్లు తుస్సుమన్పిస్తున్నారు. రెండో టీ20లో సౌతాఫ్రికాకు పవర్ ప్లే లో మంచి ఆరంభం లభించకపోయినా.. వారి మిడిలార్డర్ సత్తా చాటి తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే, ఈ విషయంలో టీమిండియా మాత్రం వెనుకబడింది. మిడిలార్డర్ లో అనవసర ప్రయోగాలు చేస్తున్నారు. దినేష్ కార్తీక్ ను బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుకు పంపితే మంచి ఫలితాన్ని అందుకునే ఛాన్సు ఉంది.

    ఇది కూడా చదవండి : డమ్మీ కెప్టెన్ గా పంత్.. ధోని దరిదాపుల్లో కూడా లేడు.. ఇలా, అయితే కష్టమే బాసూ..!

    భారత్‌ బౌలింగ్ ఫాంలోకి రావాలి..

    తొలి రెండు టీ20 మ్యాచ్‌ల్లో టీమిండియా బౌలింగ్‌ నిరాశపరిచింది. రెండో మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్ 4 వికెట్లు పడగొట్టిన ఫలితం లేదు. స్పిన్నర్లు చాహల్, అక్షర్ పటేల్ జోడీ 5 ఓవర్లలో 68 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశారు. అవేష్ ఖాన్, హర్షల్ పటేల్ పరుగులు పొదుపుగా ఇచ్చినప్పటికీ వికెట్లు తీయడంలో విఫలమయ్యారు. అందుకే మూడో టీ20లో టీమిండియా ఈ తప్పును సరిదిద్దుకోవాల్సి ఉంటుంది. జట్టులోకి ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్, రవి బిష్ణోయ్ వంటి టాలెంట్ బౌలర్లకు చోటు కల్పించాలని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.

    పంత్ కెప్టెన్సీలో దూకుడు పెంచాలి..

    KL రాహుల్ గాయం కారణంగా రిషబ్ పంత్.. ఈ సిరీస్‌కు కెప్టెన్‌గా అవకాశం దక్కించుకున్నాడు. అయితే పంత్ రెండు T20 మ్యాచ్‌లలో నిరాశపరిచాడు. పంత్ నిర్ణయాలపై కూడా ప్రశ్నలు తలెత్తాయి. రెండో టీ20లో దినేశ్ కార్తీక్ కంటే ముందు అక్షర్ పటేల్‌ను బ్యాటింగ్‌కు పంపారు. తొలి మ్యాచ్‌లో చాహల్‌కు 4 ఓవర్లు పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. ఇలా తన చెత్త నిర్ణయాలతో టీమిండియాను ఓటమి పాలు చేస్తున్నాడు. ఇక, కీలకమైన వైజాగ్ టీ20ల్లో పంత్ తన కెప్టెన్సీలో దూకుడు చూపించకపోతే సిరీస్ కోల్పోవడం ఖాయం.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Cricket, Hardik Pandya, IND Vs SA, India vs South Africa, Rishabh Pant, Team India

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు