Home /News /sports /

IND VS SA 3ND T20 MATCH LIVE SCORES INDIA VS SOUTH AFRICA 3RD T20 PREVIEW HEAD TO HEAD PREDICTED PLAYING XI PITCH REPORT SJN

IND vs SA : కెప్టెన్ గా రిషభ్ పంత్ కు ఇది చావో రేవో.. భారీ మార్పులతో బరిలోకి టీమిండియా.. మూడో టి20 తుది జట్టు ఇదే

Team India (PC : BCCI)

Team India (PC : BCCI)

IND vs SA : దక్షిణాఫ్రికా (South Africa)తో వరుసగా రెండు మ్యాచ్ ల్లో ఓడిన టీమిండియా (Team India) డీలా పడింది. రోజు విరామం తర్వాత సాగర తీరం విశాఖపట్టణం వేదికగా మూడో టి20కి సిద్ధమైంది. సిరీస్ లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితి టీమిండియాది.

ఇంకా చదవండి ...
IND vs SA : దక్షిణాఫ్రికా (South Africa)తో వరుసగా రెండు మ్యాచ్ ల్లో ఓడిన టీమిండియా (Team India) డీలా పడింది. రోజు విరామం తర్వాత సాగర తీరం విశాఖపట్టణం వేదికగా మూడో టి20కి సిద్ధమైంది. సిరీస్ లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితి టీమిండియాది. ఫేవరెట్ గా బరిలోకి దిగిన భారత్ ను దక్షిణాఫ్రికా వరుస పోరుల్లో చిత్తు చిత్తుగా ఓడించింది. రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli) లాంటి ప్లేయర్ల గైర్హాజరీలో రిషభ్ పంత్ (Rishabh Pant) కెప్టెన్సీలో ఈ సిరీస్ లో టీమిండియా పాల్గొంటుంది. అయితే అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ పూర్తిగా విఫలమైన టీమిండియా వరుసగా రెండు మ్యాచ్ ల్లోనూ ఓడి అభిమానుల చేతుల్లో చివాట్లు తింటోంది. ఈ నేపథ్యంలో మూడో టి20లో తప్పక నెగ్గాల్సిన పరిస్థితి. ఈ మ్యాచ్ లోనూ టీమిండియా ఓడితే సిరీస్ ను మరో రెండు మ్యాచ్ లు ఉండగానే కోల్పోయే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి  : తొలి 16 బంతులకు 9 పరుగులు.. ఆ తర్వాతి 5 బంతులకు 21 పరుగులు.. టి20 ప్రపంచకప్ లో ఇతడు ఉండాల్సిందే..

భారీ మార్పులకు అవకాశం
గత రెండు మ్యాచ్ ల్లోనూ టీమిండియా బ్యాటింగ్ ఫర్వాలేదనపించింది. తొలి టి20లో భారత బ్యాటర్లు విరుచుకుపడ్డా.. బౌలర్ల వైఫల్యం కారణంగా 212 పరుగుల భారీ టార్గెట్ ను కూడా కాపాడుకోలేక పోవాల్సి వచ్చింది. ఇక రెండో టి20 బ్యాటింగ్ కు కష్టమైన బారాబతి స్టేడియంలో జరిగినా.. భారత బ్యాటర్లు ఫర్వాలేదనిపించారు. అయితే బౌలింగ్ పై పిచ్ పై భారత బౌలర్లు విఫలం అయ్యారు. ముఖ్యంగా స్పిన్ ద్వయం అక్షర్ పటేల్, యుజువేంద్ర చహల్ పేలవ ప్రదర్శన చేశారు. ఇక హార్దిక్ పాండ్యా కూడా దారుణంగా పరుగులు సమర్పించుకున్నారు. భువనేశ్వర్ కుమార్ ఆరంభంలోనే మూడు వికెట్లు తీసి భారత్ కు శుభారంభం చేసినా.. ఇతర బౌలర్లు దానిని వినియోగించుకోలేకపోయారు. దాంతో మూడో టి20లో టీమిండియా భారీ మార్పులు చేసే అవకాశం ఉంది.



ముఖ్యంగా అక్షర్ పటేల్ స్థానంలో అర్ష్ దీప్ లేదా ఉమ్రాన్ మాలిక్ కు అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. యుజువేంద్ర చహల్ పై మాత్రం ఇప్పుడే వేటు వేసే అవకాశం లేదు. అయితే అతడు తొందర్లోనే ఫామ్ అందుకోవాల్సిన పరిస్థితి. లేదంటే అతడి టీమిండియా కెరీర్ మరోసారి ప్రమాదాంలో పడే అవకాశం ఉంది. అదే విధంగా రెండో టి20లో విఫలం అయిన రుతురాజ్ గైక్వాడ్ కు మరో అవకాశం ఇస్తారో లేక వెంకటేశ్ అయ్యర్ ను తుది జట్టులోకి తీసుకుంటారో చూడాల్సి ఉంది.

టీమిండియా తుది జట్టు (అంచనా)
రిషభ్ పంత్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్/వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, యుజువేంద్ర చహల్, అర్ష్ దీప్/ఉమ్రాన్ మాలిక్, అవేశ్ ఖాన్.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Dinesh Karthik, Hardik Pandya, India, India vs South Africa, Rishabh Pant, South Africa, Team India

తదుపరి వార్తలు