IND vs SA: రెండో టెస్టులో నిరాశ పర్చిన రోహిత్ శర్మ..

IND vs SA 2nd Test: కోహ్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ ఆరంభంలోనే ఔటయ్యాడు. విశాఖలో జరిగిన టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలతో వీరవిహారం చేసి, ఈ టెస్టులో కేవలం 14 పరుగులకే పెవిలియన్ చేరడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: October 10, 2019, 12:16 PM IST
IND vs SA: రెండో టెస్టులో నిరాశ పర్చిన రోహిత్ శర్మ..
రోహిత్ శర్మ (ఫైల్)
  • Share this:
పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో పరుగుల కోసం భారత్ తీవ్రంగా శ్రమిస్తోంది. కోహ్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ ఆరంభంలోనే ఔటయ్యాడు. విశాఖలో జరిగిన టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలతో వీరవిహారం చేసి, ఈ టెస్టులో కేవలం 14 పరుగులకే పెవిలియన్ చేరడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. రబాడా బౌలింగ్‌లో కీపర్ డికాక్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. గత టెస్టులో డబుల్ సెంచరీలో కదం తొక్కిన మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ పుజారాతో కలిసి ఇన్నింగ్స్ నిర్మించే పనిలో నిమగ్నమయ్యాడు. లంచ్ సమయానికి మయాంక్ 34*, పుజారా 19* పరుగులతో క్రీజులో ఉన్నారు. వీరిద్దరి మధ్య భాగస్వామ్యం 52 పరుగులు కాగా, ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా స్కోరు 77/1.

అయితే, పిచ్ పేసర్లకు సహకరిస్తుండటంతో పరుగులు చేసేందుకు టీమిండియా బ్యాట్స్‌మెన్ కష్టాలు పడుతున్నారు. ట్రాక్‌పై కొంచెం గడ్డి ఉండటం వల్ల దాన్ని ఉపయోగించుకొని ఫిలాండర్, రబాడా తొలి స్పెల్‌లో నిప్పులు చెరిగే బంతులతో భయపెట్టారు. ఇదిలా ఉండగా, లంచ్ సమయానికి ముందు 30 ఓవర్లు జరగాల్సి ఉండగా, కేవలం 25 ఓవర్లపాటే సాగింది.



Published by: Shravan Kumar Bommakanti
First published: October 10, 2019, 12:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading