హోమ్ /వార్తలు /క్రీడలు /

Rohit Sharma : రోహిత్ ముక్కు నుంచి రక్తం.. ఆందోళనలో ఫ్యాన్స్.. అసలు ఏమైంది..?

Rohit Sharma : రోహిత్ ముక్కు నుంచి రక్తం.. ఆందోళనలో ఫ్యాన్స్.. అసలు ఏమైంది..?

Photo Credit : Twitter

Photo Credit : Twitter

India vs South Africa: మెగాటోర్నీకి ముందు టీమిండియాను గాయాల బెడద వేధిస్తోంది. టీ20 ప్రపంచకప్ ముంగిట రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా, దీపక్ హుడా గాయాల కారణంగా జట్టుకు దూరం కావడం జట్టు విజయావకాశాలను దెబ్బతీస్తోంది. తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ చేస్తుండగా ముక్కు నుంచి రక్తం కారడం..

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  రోహిత్ శర్మ (Rohit Sharma) కెప్టెన్సీలోని టీమిండియా (Team India) సొంతగడ్డపై దుమ్మురేపుతుంది. సౌతాఫ్రికా (India vs South Africa)తో జరిగిన రెండో టీ20లో భారత్ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో.. మూడు మ్యాచుల సిరీస్ లో మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. సఫారీల ముందు 238 పరుగుల కొండంత లక్ష్యాన్ని ముందుంచింది భారత్. అయితే, అసాధ్యమనుకున్న లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా చివరి వరకు పోరాడింది. చివరకు 16 పరుగుల తేడాతో గెలిచిన భారత్‌ స్వదేశంలో దక్షిణాఫ్రికాపై 2–0తో తొలిసారి ద్వైపాక్షిక సిరీస్‌ సొంతం చేసుకుంది. సిరీస్‌లో చివరిదైన మూడో టి20 మంగళవారం ఇండోర్‌లో జరుగుతుంది. టీ20 ప్రపంచకప్ కు ముందు ఈ సిరీస్ టీమిండియా క్యాంప్ లో ఉత్సాహన్ని కచ్చితంగా నింపుతుంది.

  అయితే, ఈ మెగాటోర్నీకి ముందు టీమిండియాను గాయాల బెడద వేధిస్తోంది. టీ20 ప్రపంచకప్ ముంగిట రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా, దీపక్ హుడా గాయాల కారణంగా జట్టుకు దూరం కావడం జట్టు విజయావకాశాలను దెబ్బతీస్తోంది. తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ చేస్తుండగా ముక్కు నుంచి రక్తం కారడం టీమ్ మేనేజ్‌మెంట్‌తో పాటు అభిమానుల్లో ఆందోళన కలిగించింది.

  రోహిత్ దగ్గరకు వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ వచ్చి కర్చీఫ్ అందించి ఏమైందో అడిగి తెలుసుకున్నాడు. రోహిత్ టీషర్టుపై కొన్ని రక్తం చుక్కలు పడ్డాయి. అయినప్పటికీ హర్షల్ పటేల్‌కు రోహిత్ సూచనలు చేయడం టీవీ కెమెరాల్లో కనిపించింది. రక్తం ఆగకపోవడంతో రోహిత్ శర్మ మైదానాన్ని వీడి, చికిత్స చేయించుకుని వచ్చాడు. అయితే డీహైడ్రేషన్ వల్లే ఇలా జరిగినట్లు తెలుస్తోంది.

  మరోవైపు బ్యాటింగ్ సమయంలోనూ రోహిత్ శర్మ గాయపడిన సంగతి తెలిసిందే. టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభంలో దక్షిణాఫ్రికా బౌలర్ పార్నెల్ వేసిన రెండో ఓవర్‌లో రోహిత్ మణికట్టుకు గాయమైంది. పార్నెల్ వేసిన మూడో బంతిని రోహిత్ స్కూప్ షాట్‌తో బౌండరీకి తరలించాడు. అయితే ఈ షాట్ ఆడే క్రమంలో బంతి అతని గ్లౌవ్స్ తాకి కీపర్‌ పక్క నుంచి బౌండరీకి వెళ్లింది.

  ఇది కూడా చదవండి : సూర్య క్లాస్.. రికార్డులు ఖల్లాస్.. ప్రపంచ రికార్డు బద్దలు..

  అయితే రోహిత్ నొప్పితో విలవిలలాడాడు. అతని ఎడమ మణికట్టుకు బంతి బలంగా తాకినట్లు అనిపించింది. మైదానంలోకి వచ్చిన ఫిజియో.. ప్రథమ చికిత్స చేయడంతో రోహిత్ తన ఆటను కొనసాగించాడు. పెయిన్ కిల్లర్స్ తీసుకొని ఆటను కొనసాగించిన రోహిత్.. కాస్త అసౌకర్యంగానే కనిపించాడు. దాంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే బుమ్రా, జడేజా లాంటి కీలక ఆటగాళ్లు దూరమయ్యారు. ఇక, ఇప్పటికే సిరీస్ గెలవడంతో.. మూడో మ్యాచులో రోహిత్ శర్మకి రెస్ట్ ఇవ్వడం మంచిదని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు.

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Dinesh Karthik, India vs South Africa, Rohit sharma, T20 World Cup 2022, Team India

  ఉత్తమ కథలు