హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs SA 2nd T20 : అప్పుడేమో ఇస్త్రీ పెట్టె.. హెయిర్ డ్రైయర్లను వాడారు.. ఈసారి ఏం వాడతారో మరీ?

IND vs SA 2nd T20 : అప్పుడేమో ఇస్త్రీ పెట్టె.. హెయిర్ డ్రైయర్లను వాడారు.. ఈసారి ఏం వాడతారో మరీ?

PC : TWITTER

PC : TWITTER

IND vs SA 2nd T20 : అస్సాం (Assam) రాజధాని గువహటి (Guwahati)లో మ్యాచ్ అనగానే సగటు భారత క్రికెట్ అభిమానికి ఠక్కున గుర్తొచ్చేవి ఇస్ట్రీ పెట్టెలు, హెయిర్ డ్రయర్లు. అంతలా గువహటిలోని బర్సపార క్రికెట్ స్టేడియం పేరు గాంచింది. 2020 జనవరి నెలలో భారత్, శ్రీలంక జట్ల మధ్య టి20 సిరీస్ జరిగింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

IND vs SA 2nd T20 : అస్సాం (Assam) రాజధాని గువహటి (Guwahati)లో మ్యాచ్ అనగానే సగటు భారత క్రికెట్ అభిమానికి ఠక్కున గుర్తొచ్చేవి ఇస్ట్రీ పెట్టెలు, హెయిర్ డ్రయర్లు. అంతలా గువహటిలోని బర్సపార క్రికెట్ స్టేడియం పేరు గాంచింది. 2020 జనవరి నెలలో భారత్, శ్రీలంక జట్ల మధ్య టి20 సిరీస్ జరిగింది. అందులో భాగంగా తొలి టి20 గువహటిలోని బర్సపార స్టేడియం ఆతిథ్యమివ్వాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం జనవరి 5, 2022న ఆ మ్యాచ్ జరగాలి. అయితే మ్యాచ్ కు కొన్ని గంటల ముందు గువహటిలో భారీ వర్షం కురిసింది. ఇక మ్యాచ్ సమయానికైతే వర్షం మాత్రం ఆగిపోయింది. వర్షం కురిసే సమయంలో గ్రౌండ్ సిబ్బంది పిచ్ ను సరిగ్గా కప్పలేదేమో.. లేదా బొక్కలు పడ్డ కవర్లతో పిచ్ భాగాన్ని కప్పారేమో తెలీదు కానీ.. వర్షానికి పిచ్ తడిసిపోయింది.

వర్షం తగ్గినా.. అవుట్ ఫీల్డ్ బాగున్నా.. పిచ్ చిత్తడిగా ఉండటంతో మ్యాచ్ వాయిదా పడుతూ వచ్చింది. చివరికి ఎవరి ఐడియానో కానీ.. గ్రౌండ్ సిబ్బంది పిచ్ మీదకు ఐరన్ బాక్స్ లను, హెయిర్ డ్రయర్లతో వచ్చేశారు. వాటితో పిచ్ ను ఆరబెట్టే ప్రయత్నం చేశారు. వీటికి సంబంధించిన వీడియో ఫుటేజ్ ను లైవ్ లో అప్పట్లో అందరూ చూశారు. ఇక సోషల్ మీడియాలో వీటికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇక తాజాగా సౌతాఫ్రికా, భారత్ మధ్య రెండో టి20 కూడా బర్సపార స్టేడియంలో జరగాల్సి ఉంది. అక్టోబర్ 2న ఈ మ్యాచ్ జరగనుండగా.. వర్షం పడే అవకాశం ఉన్నట్లు అక్కడి వాతావరణ విభాగం పేర్కొంది. దాంతో మరోసారి ఐరన్ బాక్స్ లు, హెయిర్ డ్రయర్లతో సిద్ధం కావాలంటూ వ్యంగ్యంగా గ్రౌండ్ సిబ్బందికి అభిమానులు సూచనలు చేస్తున్నారు.

మూడు రోజుల విరామం తర్వాత టీమిండియా మ్యాచ్ కు సిద్ధమైంది.  తొలి టి20లో గెలిచిన భారత్ రెండో టి20లోనూ గెలిచి సిరీస్ ను పట్టేయాలని పట్టుదలగా ఉంది. అదే సమయంలో తొలి టి20లో ఊహించని విధంగా పరాజయం పాలైన సౌతాఫ్రికా రెండో టి20లో గెలిచి సిరీస్ ను సజీవంగా ఉంచాలనే ఉద్దేశంలో ఉంది. ఇక గువహటి పిచ్ బౌలింగ్ కు అనుకూలించేదిగా ఉంటుంది. దాంతో పేసర్లు మరోసారి చెలరేగిపోవడం ఖాయం. అయితే తొలి టి20 తర్వాత బుమ్రా గాయంతో సిరీస్ కు దూరం కావడం.. అతడి స్థానంలో సిరాజ్ రావడం వంటి అంశాలు జరగడంతో టీమిండియాలో ప్రస్తుతం గందరగోళ వాతావరణం నెలకొని ఉంది. అయితే వీటిని అన్నింటినీ పక్కన పెట్టి రెండో టి20లో అదరగొట్టాలనే లక్ష్యంతో టీమిండియా బరిలోకి దిగనుంది.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Assam, Axar Patel, Dinesh Karthik, India vs South Africa, KL Rahul, Rohit sharma, Team India, Virat kohli

ఉత్తమ కథలు