హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs SA 2nd T20 : పేసర్లకు మరోసారి పండగే.. సిరాజ్ కోసం ఆ ప్లేయర్ ను బలి పశువును చేస్తారా.. రెండో టి20లో ఆడే భారత జట్టు ఇదే

IND vs SA 2nd T20 : పేసర్లకు మరోసారి పండగే.. సిరాజ్ కోసం ఆ ప్లేయర్ ను బలి పశువును చేస్తారా.. రెండో టి20లో ఆడే భారత జట్టు ఇదే

PC : TWITTER/BCCI

PC : TWITTER/BCCI

IND vs SA 2nd T20 : మూడు రోజుల విరామం తర్వాత టీమిండియా (Team India) మరో గేమ్ కు రెడీ అయ్యింది. గువహటి వేదికగా అక్టోబర్ 2న జరిగే రెండో టి20లో సౌతాఫ్రికా (South Africa)తో తలపడేందుకు టీమిండియా సిద్ధమైంది. తొలి టి20లో గెలిచిన భారత్ రెండో టి20లోనూ గెలిచి సిరీస్ ను పట్టేయాలని పట్టుదలగా ఉంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

IND vs SA 2nd T20 : మూడు రోజుల విరామం తర్వాత టీమిండియా (Team India) మరో గేమ్ కు రెడీ అయ్యింది. గువహటి వేదికగా అక్టోబర్ 2న జరిగే రెండో టి20లో సౌతాఫ్రికా (South Africa)తో తలపడేందుకు టీమిండియా సిద్ధమైంది. తొలి టి20లో గెలిచిన భారత్ రెండో టి20లోనూ గెలిచి సిరీస్ ను పట్టేయాలని పట్టుదలగా ఉంది. అదే సమయంలో తొలి టి20లో ఊహించని విధంగా పరాజయం పాలైన సౌతాఫ్రికా రెండో టి20లో గెలిచి సిరీస్ ను సజీవంగా ఉంచాలనే ఉద్దేశంలో ఉంది. ఇక గువహటి పిచ్ బౌలింగ్ కు అనుకూలించేదిగా ఉంటుంది. దాంతో పేసర్లు మరోసారి చెలరేగిపోవడం ఖాయం. అయితే తొలి టి20 తర్వాత బుమ్రా గాయంతో సిరీస్ కు దూరం కావడం.. అతడి స్థానంలో సిరాజ్ రావడం వంటి అంశాలు జరగడంతో టీమిండియాలో ప్రస్తుతం గందరగోళ వాతావరణం నెలకొని ఉంది. అయితే వీటిని అన్నింటినీ పక్కన పెట్టి రెండో టి20లో అదరగొట్టాలనే లక్ష్యంతో టీమిండియా బరిలోకి దిగనుంది.

సిరాజ్ కు అవకాశం.. ఎవరిపై వేటు

ఆఖరి నిమిషంలో జట్టులోకి వచ్చిన మొహమ్మద్ సిరాజ్ కు తుది జట్టులో అవకాశం దక్కే అవకాశం ఉంది. బుమ్రా గాయంతో ఉండటంతో అతడి స్థానంలో జట్టులోకి ఎవర్ని తీసుకోవాలనే దానిపై బీసీసీఐ తలలు పట్టుకుంటుంది. ఈ క్రమంలో సిరాజ్ ను ఈ సిరీస్ లో పరీక్షించే అవకాశం ఉంటుంది. అతడు ఏ మేర రాణిస్తాడో తెలుసుకోవాలనే ఉద్దేశంలో అయితే బీసీసీఐ ఉంది. దాంతో అతడు తుది జట్టులో ఆడే అవకాశం ఉంది. సిరాజ్ జట్టులోకి వస్తే మరో ప్లేయర్ పై వేటు వేయాల్సి ఉంది. గువహటి పిచ్ పేసర్లకు సహకరిస్తుండటంతో పంత్ ను తప్పించి సిరాజ్ ను తీసుకునే అవకాశం ఉంది. దాంతో భారత్ 4 పేసర్లతో పాటు 2 స్పిన్నర్లతో ఆడే అవకాశం ఉటుంది. పంత్ కు అవకాశం ఇవ్వాలనుకుంటే మాత్రం దీపక్ చహర్ లేదా అశ్విన్ లలో ఒకర్ని తప్పించే అవకాశం ఉంది.

వాన అడ్డంకి

రెండో టి20కి వర్షం అడ్డంకిగా మారే అవకాశం ఉంది. గువహటిలో ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి. శని, ఆదివారాల్లో వర్ష సూచన ఉంది. మ్యాచ్ జరిగే సమయంలో వర్షం పడే అవకాశం ఉన్నట్లు అక్కడి వాతావరణ శాఖ  తెలియజేసింది. దాంతో పూర్తి మ్యాచ్ జరగడంపై అనుమానాలు తలెత్తాయి.

టీమిండియా తుది జట్టు (అంచనా)

రోహిత్ (కెప్టెన్), రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, పంత్, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, అశ్విన్/సిరాజ్, హర్షల్ పటేల్, దీపక్ చహర్, అర్ష్ దీప్ సింగ్

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Axar Patel, Dinesh Karthik, India vs South Africa, Jasprit Bumrah, KL Rahul, Mohammed Siraj, Rishabh Pant, Rohit sharma, Team India, Virat kohli

ఉత్తమ కథలు