IND vs SA 2nd T20 : కరోనా సుదీర్ఘ విరామం తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ ద్వారా భారత్ లో మళ్లీ క్రికెట్ సందడి మొదలైన సంగతి తెలిసిందే. అయితే కరోనా నేపథ్యంలో ఐపీఎల్ ను మహారాష్ట్ర, కోల్ కతా, అహ్మదాబాద్ లలో మాత్రమే జరిగిలే బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఇక ఐపీఎల్ ను దిగ్విజయంగా పూర్తి చేయడంతో.. దక్షిణాఫ్రికా (South Africa)తో సిరీస్ ను రెట్టించిన ఉత్సాహంతో జరిపేందుకు బీసీసీఐ (BCCI) సిద్ధమైంది. ఈ క్రమంలో ఐదు మ్యాచ్ లను ఐదు వేర్వేరు వేదికల్లో నిర్వహించేలా ప్రణాళికలను కూడా బీసీసీఐ సిద్ధం చేసింది. తొలి టి20 ఢిల్లీ వేదికగా జరగ్గా.. రెండో టి20 ఈ నెల 12 (ఆదివారం)న ఒడిశాలోని కటక్ లో జరగనుంది. ఈ క్రమంలో మ్యాచ్ కు సంబంధించిన టికెట్ల అమ్మకాలు కూడా ఆరంభం అయ్యాయి.
ఇక భారత్ లో క్రికెట్ కు ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కటక్ టి20 కోసం ఆన్ లైన్ లో టికెట్లను విడుదల చేసిన కొన్ని గంటల్లోనే పూర్తిగా అమ్ముడయ్యాయి. టికెట్లు లభించని వారు ఆఫ్ లైన్ ద్వారా సొంతం చేసుకునేందుకు రెడీ అయ్యారు. ఇక టికెట్లను విక్రయించే కేంద్రాల వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న క్రికెట్ అభిమానులు.. టికెట్ల కోసం పెద్ద యుద్ధమే చేస్తున్నారు.
ఈ క్రమంలో మహిళల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ట్విట్టర్ లో తెగ వైరల్ అవుతోంది.
It looks funny but that's what it is. Craze of cricket in india is much more high than any thing. Visuals from the "Barabati stadium " Cuttack, where 2nd T20 is to be played between India vs SouthAfrica. pic.twitter.com/Yn7R2MWQNj
— sagar kumar swain (@sagarkumar1041) June 9, 2022
టికెట్ల కోసం మహిళలందరూ ఒక క్యూ లైన్ లో ఉండగా.. లైన్ పాటించకుండా క్యూలో చేరిన ఒక మహిళలను వెనక్కి వెళ్లాల్సిందిగా.. ఇతర మహిళలు కోరుతారు. అయితే ఆమె వారి మాటలను వినిపించుకోకపోవడంతో.. ఆమెను లాగేస్తారు. అయితే ఆ మహిళ మళ్లీ తన స్థానం వద్దకు వచ్చి అప్పటి వరకు క్యూలో ఉన్న ఇంకో మహిళను లాగిపారేస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దేశంలో క్రికెట్ క్రేజ్ అలా ఉందని కొందరు కామెంట్స్ పెడుతుంటే మరికొందరేమో.. ’టికెట్ల కోసం మరీ ఇంతలానా‘ అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dinesh Karthik, Hardik Pandya, India vs South Africa, IPL, IPL 2022, Odisha, Rishabh Pant, South Africa