హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs SA 2nd T20 : గెలిచినా ఆనందం లేకుండా చేసిన బౌలర్లు.. కిల్లర్ మిల్లర్ సూపర్ సెంచరీ వృధా

IND vs SA 2nd T20 : గెలిచినా ఆనందం లేకుండా చేసిన బౌలర్లు.. కిల్లర్ మిల్లర్ సూపర్ సెంచరీ వృధా

PC : TWITTER

PC : TWITTER

IND vs SA 2nd T20 : 238 పరుగుల భారీ టార్గెట్ ను టీమిండియా (Team India) కిందా మీదా పడుతూ కాపాడుకుంది. భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా (South Africa) టార్గెట్ కు దగ్గరగా వచ్చి ఆగిపోయింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

IND vs SA 2nd T20 : 238 పరుగుల భారీ టార్గెట్ ను టీమిండియా (Team India) కిందా మీదా పడుతూ కాపాడుకుంది. భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా (South Africa) టార్గెట్ కు దగ్గరగా వచ్చి ఆగిపోయింది. 20 ఓవర్లలో దక్షిణాఫ్రికా 3 వికెట్లకు 221 పరుగులు చేసింది. దాంతో భారత్ 16 పరుగుల స్వల్ప తేడాతో గెలిచింది. తొలి రెండు టి20ల్లో భారత్ గెలవడంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను కైవసం చేసుకుంది. స్వదేశంలో సౌతాఫ్రికాపై సిరీస్ గెలవడం టీమిండియాకు ఇదే తొలిసారి కావడం విశేషం. డేవిడ్ మిల్లర్ (47 బంతుల్లో 106 నాటౌట్; 8 ఫోర్లు, 7 సిక్సర్లు) శతకంతో చెలరేగాడు. అతడికి ఇది రెండో సెంచరీ కావడం విశేషం. క్వింటన్ డికాక్ (48 బంతుల్లో 69 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) ఫర్వాలేదనిపించాడు. వీరిద్దరూ అజేయమైన 4వ వికెట్ కు 174 పరుగులు జోడించడం విశేషం.

ఆరంభంలో వికెట్లు పడ్డా

భారీ ఛేదనతో బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికాకు రెండో ఓవర్లోనే భారీ దెబ్బ తగిలింది. ఫామ్ లో లేని బవుమా (0), రైలీ రౌసౌ (0)లను ఒకే ఓవర్లో అర్ష్ దీప్ పెవిలియన్ కు చేర్చాడు. దాంతో ప్రొటీస్ టీం 1 పరుగుకే 2 వికెట్లను కోల్పోయింది.  ఈ దశలో క్రీజులోకి వచ్చిన మార్కరమ్ భారత బౌలర్లపైకి ఎదురుదాడికి దిగాడు. అతడు క్రీజులో ఉన్నంతసేపు ధాటిగా ఆడాడు.  19 బంతుల్లో 33 పరుగులు చేసిన అతడు అక్షర్ పటేల్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో సౌతాఫ్రికా 47 పరుగులకే 3 వికెట్లను కోల్పోయింది.

మిల్లర్ కిల్లర్

ఈ దశలో క్రీజులోకి వచ్చిన డేవిడ్ మిల్లర్ భారీ ఇన్నింగ్స్ తో మెరిశాడు. దీపక్ చహర్ ను మినహా మిగిలిన బౌలర్లను భారీ షాట్లతో బెదరగొట్టాడు. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. అప్పటి వరకు సూపర్ గా బౌలింగ్ చేసిన అర్ష్ దీప్ సింగ్ మిల్లర్ దెబ్బకు తేలిపోయాడు. అక్షర్ పటేల్, అశ్విన్, హర్షల్ పటేల్ ఎవర్నీ వదల్లేదు. మంచి బంతులను గౌరవిస్తూనే గతి తప్పిన బంతులను బౌండరీకి తరలించాడు. మరో ఎండ్ లో ఉన్న క్వింటన్ డికాక్ పరుగుల కోసం ఇబ్బంది పడ్డా మిల్లర్ మాత్రం స్వేచ్ఛగా పరుగులు సాధించాడు. క్వింటన్ డికాక్ గనుక మంచి స్ట్రయిక్ రేట్ తో బ్యాటింగ్ చేసి ఉంటే భారత్  ఈ  మ్యాచ్ లో ఓడిపోయి ఉండేది. చివరి 10 ఓవర్లలో సౌతాఫ్రికా 151 పరుగులు జోడించడం విశేషం. అర్ష్ దీప్ సింగ్ తొలి ఓవర్లో రెండు వికెట్లు తీసినా ఆఖరికి 4 ఓవర్లలో 63 పరుగులు సమర్పించుకున్నాడు. అక్షర్ పటేల్ ఒక వికెట్ తీసి 4 ఓవర్లలో 53 పరుగులు ఇచ్చాడు. దీపక్ చహర్ మాత్రమే కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు.

అంతకుముందు సూర్యకుమార్ యాదవ్ (22 బంతుల్లో 61; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) ప్రొటీస్ టీం బౌలింగ్ ను కకావికలం చేశాడు. దాంతో భారత్ 20 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే నష్టపోయి 237 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (28 బంతుల్లో 57; 5 ఫోర్లు, 4 ఫోర్లు), రోహిత్ శర్మ (37 బంతుల్లో 43; 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్ 2 వికెట్లు తీశాడు.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Axar Patel, India vs South Africa, KL Rahul, Rishabh Pant, Rohit sharma, Team India, Virat kohli

ఉత్తమ కథలు