హోమ్ /వార్తలు /క్రీడలు /

IND v SA 2nd T20 : రెండో టి20 కోసం గువహటి చేరుకున్న భారత్, సౌతాఫ్రికా జట్లు

IND v SA 2nd T20 : రెండో టి20 కోసం గువహటి చేరుకున్న భారత్, సౌతాఫ్రికా జట్లు

IND v SA 2nd T20 : రెండో టి20 కోసం గువహటి చేరుకున్న భారత్, సౌతాఫ్రికా జట్లు

IND v SA 2nd T20 : టి20 ప్రపంచకప్ (T20 World Cup) ముందు భారత (India) క్రికెట్ జట్టు సౌతాఫ్రికా (South Africa)తో మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ ఆడుతోంది. ఇప్పటికే తిరువనంతపురం వేదికగా తొలి టి20 జరగ్గా అందులో భారత్ 8 వికెట్ల తేడాతో నెగ్గింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

IND v SA 2nd T20 : టి20 ప్రపంచకప్ (T20 World Cup) ముందు భారత (India) క్రికెట్ జట్టు సౌతాఫ్రికా (South Africa)తో మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ ఆడుతోంది. ఇప్పటికే తిరువనంతపురం వేదికగా తొలి టి20 జరగ్గా అందులో భారత్ 8 వికెట్ల తేడాతో నెగ్గింది. ఇక రెండో టి20 అస్సాం (Assam)లోని గువహటి (Guwahati) వేదికగా అక్టోబర్ 2న జరగనుంది. ఈ మ్యాచ్ కోసం భారత ప్లేయర్లు గువహటికి చేరుకున్నారు. అక్కడ ఇరుజట్లకు కూడా ఘన స్వాగతం లభించింది. అస్సాం సంప్రదాయంలో భారత ప్లేయర్లకు స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో ఇరు జట్ల ప్లేయర్లు కూడా హోటల్ కు చేరుకున్నారు. ఈ రోజు విశ్రాంతి తీసుకోనున్న ప్లేయర్లు రేపటి నుంచి ప్రాక్టీస్ ఆరంభిస్తారు.

భారత్ కు భారీ ఎదురుదెబ్బ

టి20 ప్రపంచకప్ ముందు భారత్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గాయంతో తొలి టి20కి దూరమైన స్టార్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా సిరీస్ నుంచి తప్పుకున్నాడు. దాంతో అతడు టీంతో కలిసి గువహటికి ప్రయాణం చేయలేదు. తొలి టి20లో కనబర్చిన దూకుడునే రెండో టి20లో కూడా కనబర్చి సిరీస్ ను ఇక్కడే పట్టేయాలనే ఉద్దేశంలో టీమిండియా ఉంది.

బుమ్రా స్థానంలో హైదరాబాద్ స్టార్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ ను జట్టులోకి తీసుకుంటున్నట్లు బీసీసీ అధికారికంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా పేర్కొంది. మిగిలిన రెండు మ్యాచ్ ల కోసం అతడు జట్టుతో కలుస్తాడని కూడా బీసీసీఐ తెలిపింది. వెన్ను గాయంతో బుమ్రా 4 నుంచి 6 నెలల పాటు క్రికెట్ కు దూరం అయ్యే అవకాశం ఉన్నట్లు గురువారం వార్తలు వచ్చాయి. స్ట్రెస్ ఫ్రాక్చర్ తో ఇబ్బంది పడుతున్నట్లు.. గాయం తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.

First published:

Tags: Assam, Axar Patel, India vs South Africa, Jasprit Bumrah, Mohammed Shami, Mohammed Siraj, Team India, Virat kohli

ఉత్తమ కథలు