Home /News /sports /

IND VS SA 2ND T20 LIVE SCORES UMRAN MALIK BREAKS RISHABH PANT BAT IN NETS VIDEO GOES VIRAL SJN

IND vs SA : ఉమ్రాన్ మాలిక్ తో కథ ఇలానే ఉంటది.. పాపం ఎవ్వరికీ చెప్పుకోలేక బిక్క చూపులు చూసిన పంత్

(PC : INSTAGRAM)

(PC : INSTAGRAM)

IND vs SA : ఈ ఐపీఎల్ సీజన్ లో ఆడిన 14 మ్యాచ్ ల్లో 22 వికెట్లు తీసిన ఇతడు ఒక దశలో పర్పుల్ క్యాప్ కోసం పోటీ కూడా పడ్డాడా. ఇతడి వేగానికి ఫిదా అయిన బీసీసీఐ సెలక్టర్లు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా టీమిండియా (Team India)లోకి స్వాగతం పలికారు.

ఇంకా చదవండి ...
IND vs SA : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ ద్వారా తెర మీదకు వచ్చాడు ఉమ్రాన్ మాలిక్. సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) తరఫున బరిలోకి దిగిన ఈ జమ్మూ కుర్రాడు 150 కిలోమీటర్ల వేగంతో బంతులను విసురుతూ ప్రత్యర్థి బ్యాటర్లకు వెన్నులో వణుకు పుట్టేలా చేశాడు. ఈ ఐపీఎల్ సీజన్ లో ఆడిన 14 మ్యాచ్ ల్లో 22 వికెట్లు తీసిన ఇతడు ఒక దశలో పర్పుల్ క్యాప్ కోసం పోటీ కూడా పడ్డాడా. ఇతడి వేగానికి ఫిదా అయిన బీసీసీఐ సెలక్టర్లు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా టీమిండియా (Team India)లోకి స్వాగతం పలికారు. దక్షిణాఫ్రికా (South Africa)తో జరుగుతోన్న ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ కోసం ఉమ్రాన్ మాలిక్ ను సెలెక్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ఇది కూడా చదవండి : నాడు అన్నకు అవమానం.. నేడు తమ్ముడి ప్రతీకారం.. లెక్క సరిచేసిన హార్దిక్ పాండ్యా

అయితే ఉమ్రాన్ మాలిక్ కు తొలి టి20లో అవకాశం రాలేదు. ఇక ఢిల్లీ వేదికగా జరిగిన తొలి టి20లో భారత్ 7 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా చేతిలో ఓడిన సంగతి తెలిసిందే. దాంతో రేపు కటక్ వేదికగా జరిగే రెండో టి20 కోసం రిషభ్ పంత్ నాయకత్వంలోని టీమిండియా నెట్స్ లో తీవ్రంగా శ్రమించింది. ఈ క్రమంలో తాత్కాలిక కెప్టెన్ రిషభ్ పంత్ నెట్స్ లో చాలా సేపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు.

ఈ క్రమంలో అతడికి ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ కూడా చేశాడు. వేగంగా వేసిన బంతి ఒకటి పంత్ బ్యాట్ ను విరగొట్టింది. షాట్ ఆడిన పంత్ తన బ్యాట్ టో ను చూసుకుంటూ నిల్చున్నాడు. అక్కడే ఉన్న ఉమ్రాన్ ఏమైందన్నట్లు లుక్ ఇవ్వగా.. ఏం చెప్పాలో తెలియక రిషభ్ పంత్ అలానే నిల్చున్నాడు.




ఇక దక్షిణాఫ్రికాతో జరిగే రెండో టి20 పంత్ కు అగ్ని పరీక్ష లాంటిది. కేఎల్ ఆఖరి నిమిషంలో తప్పుకోవడంతో కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన పంత్.. తొలి టి20లో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. దాంతో కెప్టెన్ గా అతడికి ఈ మ్యాచ్ ఎంతో కీలకం కానుంది. ఈ మ్యాచ్ లోనూ ఓడిపోతే పంత్ కెప్టెన్సీపై అనుమానాలు తలెత్తే అవకాశం లేకపోలేదు. ఐపీఎల్ లో గత రెండు సీజన్లకు కూడా పంత్ కెప్టెన్ గా ఉన్నాడు. అయితే పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. టీమిండియా భవిష్యత్ కెప్టెన్ గా తనను తాను నిరూపించుకునేందుకు పంత్ కు సౌతాఫ్రికా సిరీస్ రూపంలో చక్కటి అవకాశం లభించింది.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: India vs South Africa, KL Rahul, Ravi Shastri, Rishabh Pant, South Africa, Sunrisers Hyderabad, Team India

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు