హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs SA 2nd T20 : చెలరేగిన టీమిండియా టాపార్డర్.. దక్షిణాఫ్రికా ముందు కొండంత లక్ష్యం.. ఎంతంటే?

IND vs SA 2nd T20 : చెలరేగిన టీమిండియా టాపార్డర్.. దక్షిణాఫ్రికా ముందు కొండంత లక్ష్యం.. ఎంతంటే?

PC : TWITTER

PC : TWITTER

IND vs SA 2nd T20 : గువహటి వేదికగా దక్షిణాఫ్రికా (South Africa)తో జరుగుతున్న రెండో టి20లో భారత (India) బ్యాటర్లు రెచ్చిపోయారు. టాపార్డర్ బ్యాటర్లు కేఎల్ రాహుల్ (KL Rahul), రోహిత్ శర్మ (Rohit Sharma), సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav), విరాట్ కోహ్లీ (Virat Kohli)లు ఆకాశమే హద్దుగా చెలరేగారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

IND vs SA 2nd T20 : గువహటి వేదికగా దక్షిణాఫ్రికా (South Africa)తో జరుగుతున్న రెండో టి20లో భారత (India) బ్యాటర్లు రెచ్చిపోయారు. టాపార్డర్ బ్యాటర్లు కేఎల్ రాహుల్ (KL Rahul), రోహిత్ శర్మ (Rohit Sharma), సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav), విరాట్ కోహ్లీ (Virat Kohli)లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ (22 బంతుల్లో 61; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) ప్రొటీస్ టీం బౌలింగ్ ను కకావికలం చేశాడు. దాంతో భారత్ 20 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే నష్టపోయి 237 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (28 బంతుల్లో 57; 5 ఫోర్లు, 4 ఫోర్లు), రోహిత్ శర్మ (37 బంతుల్లో 43; 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్ 2 వికెట్లు తీశాడు.

అదిరిపోయే శుభారంభం

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత జట్టుకు ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. తొలి మూడు ఓవర్ల పాటు ఆచి తూచి ఆడిన వీరు ఆ తర్వాత చెలరేగిపోయారు. దొరికిన బంతిని దొరికినట్లు బౌండరీ బాదారు. అయితే 10వ ఓవర్ లో రోహిత్ శర్మ అవుటయ్యాడు. కాసేపటికే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న రాహుల్ కూడా పెవలియన్ కు చేరుకున్నాడు. ఈ రెండు వికెట్లు కూడా కేశవ్ మహరాజ్ కే దక్కాయి.

సూర్య సునామీ

రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ల ఇన్నింగ్సే అద్భుతం అనుకుంటే.. దీనిని మరిపించేలా సూర్యకుమార్ యాదవ్ చెలరేగిపోయాడు. ‘నువ్వు బంతిని వేయి నేను బౌండరీ బాదకుంటే చూడు’ అన్నట్లు సూర్యకుమార్ ఇన్నింగ్స్ సాగింది. కేవలం 22 బంతులే ఆడిన సూర్యకుమార్ 277 స్ట్రయిక్ రేట్ తో 61 పరుగులు చేసి సమన్వయ లోపంతో పెవిలియన్ కు చేరుకున్నాడు. ఇక ఆఖర్లో క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్ ఆఖరి ఓవర్లో రెండు సిక్సర్లతో పాటు ఒక ఫోర్ బాది జట్టుకు ఘనమైన ముగింపు ఇచ్చాడు. కోహ్లీ మాత్రం 49 పరుగులతో అజేయంగా నిలిచాడు.

తుది జట్లు

టీమిండియా

రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, పంత్, కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, దీపక్ చహర్, అశ్విన్, అర్ష్ దీప్ సింగ్

సౌతాఫ్రికా

బవుమా (కెప్టెన్), క్వింటన్ డికాక్, మార్కరమ్, రైలీ రౌసౌ, డేవిడ్ మిల్లర్, ట్రిస్టాన్ స్టబ్స్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, నోకియా ,  ఎంగిడి

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Axar Patel, Dinesh Karthik, India vs South Africa, KL Rahul, Rishabh Pant, Rohit sharma, Team India, Virat kohli

ఉత్తమ కథలు