హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs SA 2nd T20 : కీలక పోరులో టాస్ నెగ్గిన సౌతాఫ్రికా.. ఎటువంటి మార్పులు లేకుండా భారత్.. తుది జట్లు ఇవే

IND vs SA 2nd T20 : కీలక పోరులో టాస్ నెగ్గిన సౌతాఫ్రికా.. ఎటువంటి మార్పులు లేకుండా భారత్.. తుది జట్లు ఇవే

PC : TWITTER

PC : TWITTER

IND vs SA 2nd T20 : టి20 ప్రపంచకప్ (T20 World Cup) ముందు సౌతాఫ్రికా (South Africa)తో తన చిట్ట చివరి సన్నాహక సిరీస్ ను భారత్ (India) ఆడుతుంది. తిరువనంతపురం వేదికగా జరిగిన తొలి టి20లో భారత్ సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. 8 వికెట్ల తేడాతో నెగ్గింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

IND vs SA 2nd T20 : టి20 ప్రపంచకప్ (T20 World Cup) ముందు సౌతాఫ్రికా (South Africa)తో తన చిట్ట చివరి సన్నాహక సిరీస్ ను భారత్ (India) ఆడుతుంది. తిరువనంతపురం వేదికగా జరిగిన తొలి టి20లో భారత్ సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. 8 వికెట్ల తేడాతో నెగ్గింది. ఇక గువహటి వేదికగా మరికాసేపట్లో ఆరంభమయ్యే రెండో టి20లో టాస్ నెగ్గిన సౌతాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా (Temba Bavuma) ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. సౌతాఫ్రికా ఈ మ్యాచ్ కోసం ఒక మార్పు చేసింది. స్పిన్నర్ షమ్సీని పక్కన బెట్టి.. అతడి స్థానంలో పేసర్ ఎంగిడిని తీసుకుంది. మరోవైపు భారత్ మాత్రం ఎటువంటి మార్పు లేకుండానే బరిలోకి దిగనుంది. తొలి టి20లో ఆడిన జట్టునే ఇక్కడ కూడా కొనసాగించనుంది.

ఎటువంటి మార్పులు లేకుండానే

బుమ్రా గాయంతో ఈ సిరీస్ నుంచి తప్పుకోవడంతో అతడి స్థానంలో మొహమ్మద్ సిరాజ్ జట్టులోకి వచ్చాడు. దాంతో అతడిని రెండో టి20లో ఆడిస్తారని అంతా అనుకున్నారు. అయితే భారత్ మాత్రం తొలి టి20లో ఆడిన జట్టునే కొనసాగించేందుకు మొగ్గు చూపింది. ఎటువంటి మార్పులు చేయలేదు. ఇక తొలి టి20లో ఘోర పరాభవం చూసిన దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్ కోసం ఒక మార్పుల చేసింది. షమ్సీని తప్పించి పేసర్ అయిన లుంగీ ఎంగిడిని తుది జట్టులోకి తీసుకుంది.

సూర్యకుమార్ ను ఊరిస్తోన్న రికార్డు

అంతర్జాతీయ టి20ల్లో 1000 పరుగుల మార్కుకు సూర్యకుమార్ యాదవ్ కేవల 24 పరుగుల దూరంలో మాత్రమే ఉన్నాడు. ఈ మ్యాచ్ లో అతడు మరో 24 పరుగులు సాధిస్తే 1000 పరుగుల జాబితాలో చేరతాడు. ఇప్పటికే ఒక ఏడాదిలో భారత్ తరఫున ఒక ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు.

తుది జట్లు

టీమిండియా

రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, పంత్, కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, దీపక్ చహర్, అశ్విన్, అర్ష్ దీప్ సింగ్

సౌతాఫ్రికా

బవుమా (కెప్టెన్), క్వింటన్ డికాక్, మార్కరమ్, రైలీ రౌసౌ, డేవిడ్ మిల్లర్, ట్రిస్టాన్ స్టబ్స్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, నోకియా ,  ఎంగిడి

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Axar Patel, Dinesh Karthik, India vs South Africa, Jasprit Bumrah, KL Rahul, Mohammed Siraj, Rishabh Pant, Rohit sharma, Team India, Virat kohli

ఉత్తమ కథలు