హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs SA 2nd ODI : రెండో టి20లో పాము కలకలం.. మ్యాచ్ మధ్యలో గ్రౌండ్ లోకి వచ్చిన స్నేక్.. ఆ తర్వాత

IND vs SA 2nd ODI : రెండో టి20లో పాము కలకలం.. మ్యాచ్ మధ్యలో గ్రౌండ్ లోకి వచ్చిన స్నేక్.. ఆ తర్వాత

PC : TWITTER

PC : TWITTER

IND vs SA 2nd ODI : గువహటి వేదికగా జరుగుతున్న రెండో టి20లో అనుకోని అతిథఇ ప్రత్యక్షమైంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో గ్రౌండ్ లోకి పాము రావడంతో ఆటకు కాసేపు అంతరాయం కలిగింది. 7వ ఓవర్ ముగిసిన తర్వాత స్క్వేర్ లెగ్ దిశలో పాము ప్రత్యక్షమైంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

IND vs SA 2nd ODI : గువహటి వేదికగా జరుగుతున్న రెండో టి20లో అనుకోని అతిథఇ ప్రత్యక్షమైంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో గ్రౌండ్ లోకి పాము రావడంతో ఆటకు కాసేపు అంతరాయం కలిగింది. 7వ ఓవర్ ముగిసిన తర్వాత స్క్వేర్ లెగ్ దిశలో పాము ప్రత్యక్షమైంది. సాతాఫ్రికా(South Africa) వికెట్ కీపర్ క్వింటన్ డికాక్  పాముు గుర్తించి బ్యాటింగ్ చేస్తున్న కేఎల్ రాహుల్ (Kl Rahul) కు తెలియజేశాడు. దాంతో మ్యాచ్ కాసేపు ఆగిపోయింది. వెంటనే గ్రౌండ్ లోకి వచ్చిన సిబ్బంది పామును పట్టేసి గ్రౌండ్ నుంచి బయటకు తీసుకువెళ్లారు. ఇక భారత్ కు ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ లు శుభారంభం అందించారు. 10 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోయి 96 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (37 బంతుల్లో 43; 7 ఫోర్లు, 1 సిక్స్) అవుటయ్యాడు. కేఎల్ రాహుల్ (22 బంతుల్లో 48 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) క్రీజులో ఉన్నాడు.

రెండో టి20లో టాస్ నెగ్గిన సౌతాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా (Temba Bavuma) ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. సౌతాఫ్రికా ఈ మ్యాచ్ కోసం ఒక మార్పు చేసింది. స్పిన్నర్ షమ్సీని పక్కన బెట్టి.. అతడి స్థానంలో పేసర్ ఎంగిడిని తీసుకుంది. మరోవైపు భారత్ మాత్రం ఎటువంటి మార్పు లేకుండానే బరిలోకి దిగనుంది. తొలి టి20లో ఆడిన జట్టునే ఇక్కడ కూడా కొనసాగించనుంది.

ఎటువంటి మార్పులు లేకుండానే

బుమ్రా గాయంతో ఈ సిరీస్ నుంచి తప్పుకోవడంతో అతడి స్థానంలో మొహమ్మద్ సిరాజ్ జట్టులోకి వచ్చాడు. దాంతో అతడిని రెండో టి20లో ఆడిస్తారని అంతా అనుకున్నారు. అయితే భారత్ మాత్రం తొలి టి20లో ఆడిన జట్టునే కొనసాగించేందుకు మొగ్గు చూపింది. ఎటువంటి మార్పులు చేయలేదు. ఇక తొలి టి20లో ఘోర పరాభవం చూసిన దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్ కోసం ఒక మార్పుల చేసింది. షమ్సీని తప్పించి పేసర్ అయిన లుంగీ ఎంగిడిని తుది జట్టులోకి తీసుకుంది.

తుది జట్లు

టీమిండియా

రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, పంత్, కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, దీపక్ చహర్, అశ్విన్, అర్ష్ దీప్ సింగ్

సౌతాఫ్రికా

బవుమా (కెప్టెన్), క్వింటన్ డికాక్, మార్కరమ్, రైలీ రౌసౌ, డేవిడ్ మిల్లర్, ట్రిస్టాన్ స్టబ్స్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, నోకియా ,  ఎంగిడి

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Axar Patel, Dinesh Karthik, India vs South Africa, KL Rahul, Rishabh Pant, Rohit sharma, Snake, Team India, Virat kohli

ఉత్తమ కథలు