IND vs SA: ఓపెనర్ల వీర విహారం.. కొత్త రికార్డు దిశగా..

దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో భాగంగా తొలి రోజు సెంచరీతో కదం తొక్కిన రోహిత్ శర్మ.. రెండో రోజు తన జోరును కొనసాగిస్తున్నాడు. తొలి రోజు వర్షం తన బాదుడుకు అడ్డుపడినా రెండో రోజు తన బ్యాటుకు మరింత పనిచెప్పాడు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: October 3, 2019, 11:06 AM IST
IND vs SA: ఓపెనర్ల వీర విహారం.. కొత్త రికార్డు దిశగా..
రోహిత్, మయాంక్
  • Share this:
దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో భాగంగా తొలి రోజు సెంచరీతో కదం తొక్కిన రోహిత్ శర్మ.. రెండో రోజు తన జోరును కొనసాగిస్తున్నాడు. తొలి రోజు వర్షం తన బాదుడుకు అడ్డుపడినా రెండో రోజు తన బ్యాటుకు మరింత పనిచెప్పాడు. దాదాపు 70 సగటుతో స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. అటు.. మయాంక్ అగర్వాల్ కూడా సెంచరీతో సఫారీ బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారాడు. ఇద్దరు కలిసి 300 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దక్షిణాఫ్రికాపై.. ఏ వికెట్ భాగస్వామ్యానికైనా అత్యధిక స్కోరు ఇదే కావడం గమనార్హం. ప్రస్తుతం టీమిండియా 80 ఓవర్లకు గానూ ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 300 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 166, మయాంక్ అగర్వాల్ 131 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఓవర్‌కు ఒక ఫోర్ తగ్గకుండా పోటాపోటీగా పరుగులు చేస్తున్నారు.

అటు, దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడా మినహా ఏ ఒక్కరు కూడా ప్రభావం చూపడం లేదు. ముత్తుస్వామి 5 సగటుతో, డేన్ 7 సగటుతో పరుగులు సమర్పించుకున్నారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: October 3, 2019, 11:06 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading