హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs SA 1st T20 : దక్షిణాఫ్రికాతో తొలి టి20.. టీమిండియా ఆ ఇద్దరికి అవకాశం ఇస్తుందా? తుది జట్టు ఇదే

IND vs SA 1st T20 : దక్షిణాఫ్రికాతో తొలి టి20.. టీమిండియా ఆ ఇద్దరికి అవకాశం ఇస్తుందా? తుది జట్టు ఇదే

PC : TWITTER/BCCI

PC : TWITTER/BCCI

IND vs SA 1st T20 : టి20 ప్రపంచకప్ (T20 World Cup)కు సన్నాహకంగా టీమిండియా (Team India) తన చివరాఖరి టి20 సిరీస్ ను ఆడనుంది. సౌతాఫ్రికా (South Africa)తో రేపటి నుంచి మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ ఆరంభం కానుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

IND vs SA 1st T20 : టి20 ప్రపంచకప్ (T20 World Cup)కు సన్నాహకంగా టీమిండియా (Team India) తన చివరాఖరి టి20 సిరీస్ ను ఆడనుంది. సౌతాఫ్రికా (South Africa)తో రేపటి నుంచి మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ ఆరంభం కానుంది. తొలి టి20 తిరువనంతపురం వేదికగా జరగనుంది. ఆస్ట్రేలియా (Australia)తో జరిగిన మూడు మ్యాచ్ ల సిరీస్ ను సొంతం చేసుకోవడంతో భారత్ ఆత్మవిశ్వాసంతో కనిపిస్తుంది. అదే సమయంలో దక్షిణాఫ్రికా కూడా తన పూర్తి టి20 ప్రపంచకప్ బలంతోనే ఈసిరీస్ ను ఆడనుంది. అంతేకాకుండా గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్ అనంతరం ప్రొటీస్ జట్టు ఒక్క టి20 సిరీస్ ను కూడా ఓడిపోలేదు. ముఖ్యంగా ఆ జట్టులో నమ్మదగిన ప్లేయర్లు ఉన్నారు. ఆస్ట్రేలియాతో పోలిస్తే సౌతాఫ్రికా బౌలింగ్ బలంగా ఉంది.

రెండు మార్పులు ఖాయం

ఈ సిరీస్ నుంచి భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్యాలకు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. ఇక ఆసీస్ తో సిరీస్ కు దూరంగా ఉన్న అర్ష్ దీప్ సింగ్ తిరిగి జట్టులోకి రానున్నాడు. కరోనా నుంచి కోలుకోకపోవడంతో మొహమ్మద్ షమీ.. గాయంతో దీపక్ హుడా ఈ సిరీస్ కు దూరంగా ఉండనున్నారు. ఇక రేపు జరిగే తొలి టి20 మ్యాచ్ కోసం భారత్ రెండు మార్పులను ఖచ్చితంగా చేయనుంది. భువీ, హార్దిక్ స్థానాల్లో వేరే ప్లేయర్లకు అవకాశం ఇవ్వాల్సిందే. అయితే వారు ఎవరనేది ఆసక్తికరంగా మారనుంది. భువీ స్థానంలో అర్ష్ దీప్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక హార్దిక్ పాండ్యా స్థానంలో రిషభ్ పంత్ కు అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. అయితే అప్పుడు భారత్ కేవలం 5గురు బౌలర్ల (ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లు)తో ఆడే అవకాశం ఉంది. ఇక యుజువేంద్ర చహల్ కు రెస్ట్ ఇచ్చి అశ్విన్ కు అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. అయితే కూర్పుపై ద్రవిడ్ ఎటువంటి ఆలోచనతో ఉన్నాడో తెలియాలంటే టాస్ వరకు వేచి ఉండక తప్పదు.

డెత్ ను సరి చేసుకోవడానికి ఆఖరి అవకాశం

డెత్ బౌలింగ్ లో భారత్ అంత ప్రభావంగా కనిపించడం లేదు. భారత్ ను ఏదైనా కలవరపెడుతుందా అంటే డెత్ బౌలింగే. ఈ సమస్యను సరి చేసుకోవడానికి భారత్ కు ఇదే ఆఖరి అవకాశం. ఈ సిరీస్ తర్వాత సౌతాఫ్రికాతో భారత్ మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను ఆడనుంది. అయితే అందులో టి20 ప్రపంచకప్ జట్టుకు ఎంపికైన ప్లేయర్లు ఆడేది అనుమానమే. దాంతో టి20 ప్రపంచకప్ ముందు ప్రాక్టీస్ చేసేందుకు భారత్ కు ఉన్న చిట్ట చివరి అవకాశం ఈ సిరీస్ మాత్రమే.

టీమిండియా తుది జట్టు (అంచనా)

రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, పంత్, కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, బుమ్రా, చహల్, అర్ష్ దీప్ సింగ్

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Dinesh Karthik, India vs South Africa, Jasprit Bumrah, KL Rahul, Rishabh Pant, Rohit sharma, Team India, Virat kohli

ఉత్తమ కథలు