హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs SA 1st T20 : సూర్య దెబ్బ.. సఫారీ అబ్బ.. చెమట పట్టకుండా ఛేజ్ చేసిన టీమిండియా

IND vs SA 1st T20 : సూర్య దెబ్బ.. సఫారీ అబ్బ.. చెమట పట్టకుండా ఛేజ్ చేసిన టీమిండియా

PC : TWITTER

PC : TWITTER

IND vs SA 1st T20 : దక్షిణాఫ్రికా (South Africa)తో ఆరంభమైన మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ లో భారత్ (India) శుభారంభం చేసింది. తిరువనంతపురం వేదికగా జరిగిన తొలి టి20లో భారత్ 8 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాపై ఘనవిజయం సాధించింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

IND vs SA 1st T20 : దక్షిణాఫ్రికా (South Africa)తో ఆరంభమైన మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ లో భారత్ (India) శుభారంభం చేసింది. తిరువనంతపురం వేదికగా జరిగిన తొలి టి20లో భారత్ 8 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాపై ఘనవిజయం సాధించింది. 107 పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ 16.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే నష్టపోయి 110 పరుగులు చేసి గెలుపొందింది. కేఎల్ రాహుల్ (56 బంతుల్లో 51 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (33 బంతుల్లో 50 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ శతకాలతో జట్టుకు విజయాన్ని అందించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కగిసో రబడ, అన్రిచ్ నోకియాలకు చెరో వికెట్ దక్కింది. ఈ మ్యాచ్ లో విజయం సాధించడంతో మూడు మ్యాచ్ ల సిరీస్ లో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది.

స్వల్ప లక్ష్యమే అయినా పిచ్ బౌలింగ్ కు సహకరిస్తుండటంతో ఇన్నింగ్స్ ఆరంభంలో భారత్ కూడా తడబడింది. కగిసో రబడ, వేన్ పార్నెల్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగుల కోసం భారత్ ఇబ్బందులు పడింది. రోహిత్ శర్మ (0) డకౌట్ అయ్యాడు. కాసేపటికే విరాట్ కోహ్లీ (3)ను అన్రిచ్ నోకియా బోల్తా కొట్టించాడు. దాంతో భారత్ కూడా సౌతాఫ్రికాలాగే కుప్పుకూలుతుందా అని అంతా అనుకున్నారు. ఓపెనర్ కేఎల్ రాహుల్ ఆరంభంలో చాలా ఇబ్బంది పడ్డాడు. ముఖ్యంగా బంతిని టచ్ కూడా చేయలేక ఆపసోపాలు పడ్డాడు. అంపైర్ వల్ల రెండు సార్లు ఎల్బీ బారి నుంచి తప్పించుకున్నాడు. అలాగే నోకియా ఒక కష్టతరమైన క్యాచ్ ను జారవిడిచాడు. రాహుల్ బ్యాటింగ్ టెస్టు బ్యాటింగ్ ను తలపించింది.

సూర్య సూపర్

కోహ్లీ అవుటైయ్యాక క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్.. తనదైన స్టయిల్ లో బ్యాటింగ్ చేశాడు. ఒక ఎండ్ లో రాహుల్ బంతిని ఆడేందుకు తీవ్రంగా ఇబ్బంది పడితే.. సూర్యకుమార్ మాత్రం తొలి బంతి నుంచే అటాకింగ్ బ్యాటింగ్ చేశాడు. సూర్యకుమార్ బ్యాటింగ్ ను చూస్తే.. అతడు ఆడుతున్నది మిగతా వాళ్లు ఆడిన పిచ్ పైనేనా అన్న అనుమానం రాక మానదు. కళాత్మకమైన షాట్లతో ఫోర్లు రాబడుతూ ఒత్తిడి తగ్గించాడు. చివర్లో బంతి పాతబడటంతో రాహుల్ కూడా చక్కగా టైమింగ్ చేస్తూ పరుగులు రాబట్టాడు. వీరిద్దరూ అజేయమైన మూడో వికెట్ కు 97 పరుగులు జోడించి జట్టును గెలిపించారు.

అంతకుముదు తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 20 ఓవర్లల ో 8 వికెట్లకు 106 పరుగులు మాత్రమే చేసింది. కేశవ్ మహరాజ్ (35 బంతుల్లో 41; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేయడంతో సౌతాఫ్రికా ఆ మాత్రమైనా స్కోరును సాధించగలిగింది. కేశవ్ మహరాజ్ తో పాటు మార్కరమ్ (24 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్), వేన్ పార్నెల్ (37 బంతుల్లో 24; 1 ఫోర్, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. ఇక భారత బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్ 3 వికెట్లతో ప్రత్యర్థి పతనానికి మూల కారణంగా నిలిచాడు. దీపక్ చహర్, హర్షల్ పటేల్ లు చెరో రెండు వికెట్లు తీశారు. అక్షర్ పటేల్ కు ఒక వికెట్ దక్కింది.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Axar Patel, Dinesh Karthik, India vs South Africa, KL Rahul, Ravichandran Ashwin, Rishabh Pant, Rohit sharma, Virat kohli

ఉత్తమ కథలు