హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs SA 1st T20 : టాస్ నెగ్గిన రోహిత్ శర్మ.. భారీగా మార్పులు చేసిన టీమిండియా.. తుది జట్లు ఇవే

IND vs SA 1st T20 : టాస్ నెగ్గిన రోహిత్ శర్మ.. భారీగా మార్పులు చేసిన టీమిండియా.. తుది జట్లు ఇవే

PC : TWITTER

PC : TWITTER

IND vs SA 1st T20 : టి20 ప్రపంచకప్ (T20 World Cup) ముందు సౌతాఫ్రికా (South Africa)తో భారత్ (India) చివరి టి20 సిరీస్ ఆడనుంది. అంటే డెత్ బౌలంగ్, ఫీల్డింగ్ సమస్యలను సరి చేసుకోవడానికి భారత్ కు మరో మూడు అవకాశాలు మాత్రమే మిగిలి ఉన్నాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

IND vs SA 1st T20 : టి20 ప్రపంచకప్ (T20 World Cup) ముందు సౌతాఫ్రికా (South Africa)తో భారత్ (India) చివరి టి20 సిరీస్ ఆడనుంది. అంటే డెత్ బౌలంగ్, ఫీల్డింగ్ సమస్యలను సరి చేసుకోవడానికి భారత్ కు మరో మూడు అవకాశాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. మరికాసేపట్లో తిరువనంతపురం వేదికగా సఫారీ టీంతో ఆరంభం కానున్న తొలి టి20 మ్యాచ్ లో టాస్ నెగ్గిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ కోసం భారత్ ఏకంగా నాలుగు మార్పులు చేసింది. హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్ లకు విశ్రాంతి ఇవ్వగా.. వారి స్థానాల్లో రిషభ్ పంత్, అర్ష్ దీప్ సింగ్ లు తుది జట్టులోకి వచ్చారు. నిగిల్ కారణంగా బుమ్రా ఈ మ్యాచ్ కు దూరమయ్యాడు. దాంతో అతడి స్థానంలో దీపక్ చహర్ తుది జట్టులోకి వచ్చాడు. ఇక చహల్ ను పక్కన బెట్టిన భారత్ అశ్విన్ ను తుది జట్టులోకి తీసుకుంది.

నాలుగు మార్పులు

ఈ మ్యాచ్ కోసం భారత్ ఏకంగా నాలుగు మార్పులు చేసింది. భువనేశ్వర్, హార్దిక్ పాండ్యాలు ఈ సిరీస్ కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. నిగిల్ కారణంగా బుమ్రా ఈ మ్యాచ్ కు దూరం కాగా.. చహల్ ను పక్కన పెట్టింది. వీరి స్థానాల్లో అర్ష్ దీప్ సింగ్, రిషభ్ పంత్, అశ్విన్, దీపక్ చహర్ లను తుది జట్టులోకి తీసుకుంది. గత కొంత కాలంగా యుజువేంద్ర చహల్ పెద్దగా రాణించడం లేదు. దాంతో అతడి స్థానంలో అశ్విన్ ను తీసుకున్నారు. సౌతాఫ్రికా జట్టులో లెఫ్టాండ్ బ్యాటర్స్ ఉండటంతో అశ్విన్ ను తుది జట్టులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

డెత్ ను సరి చేసుకోవడానికి ఆఖరి అవకాశం

డెత్ బౌలింగ్ లో భారత్ అంత ప్రభావంగా కనిపించడం లేదు. భారత్ ను ఏదైనా కలవరపెడుతుందా అంటే డెత్ బౌలింగే. ఈ సమస్యను సరి చేసుకోవడానికి భారత్ కు ఇదే ఆఖరి అవకాశం. ఈ సిరీస్ తర్వాత సౌతాఫ్రికాతో భారత్ మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను ఆడనుంది. అయితే అందులో టి20 ప్రపంచకప్ జట్టుకు ఎంపికైన ప్లేయర్లు ఆడేది అనుమానమే. దాంతో టి20 ప్రపంచకప్ ముందు ప్రాక్టీస్ చేసేందుకు భారత్ కు ఉన్న చిట్ట చివరి అవకాశం ఈ సిరీస్ మాత్రమే.

తుది జట్లు

టీమిండియా

రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, పంత్, కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, దీపక్ చహర్, అశ్విన్, అర్ష్ దీప్ సింగ్

సౌతాఫ్రికా

బవుమా (కెప్టెన్), క్వింటన్ డికాక్, మార్కరమ్, రైలీ రౌసౌ, డేవిడ్ మిల్లర్, ట్రిస్టాన్ స్టబ్స్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, నోకియా , షమ్సీ

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Axar Patel, Dinesh Karthik, India vs South Africa, Jasprit Bumrah, KL Rahul, Rishabh Pant, Rohit sharma, Virat kohli

ఉత్తమ కథలు