హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs SA 1st T20 : భారత బౌలర్ల దెబ్బకు వణికిపోయిన సౌతాఫ్రికా.. టీమిండియా ముందు ఈజీ టార్గెట్.. ఎంతంటే?

IND vs SA 1st T20 : భారత బౌలర్ల దెబ్బకు వణికిపోయిన సౌతాఫ్రికా.. టీమిండియా ముందు ఈజీ టార్గెట్.. ఎంతంటే?

PC : BCCI

PC : BCCI

IND vs SA 1st T20 : టీమిండియా (Team India) పేసర్ల దెబ్బకు దక్షిణాఫ్రికా (South Africa) బ్యాటర్లు వణికిపోయారు. అర్ష్ దీప్ (Arshdeep Singh), దీపక్ చహర్ (Deepak Chahar)లు తమ బౌలింగ్ తో హడలెత్తిండంతో తిరువనంతపురంలో జరుగుతున్న తొలి టి20లో సౌతాఫ్రికా 20 ఓవర్లల ో 8 వికెట్లకు 106 పరుగులు మాత్రమే చేసింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

IND vs SA 1st T20 : టీమిండియా (Team India) పేసర్ల దెబ్బకు దక్షిణాఫ్రికా (South Africa) బ్యాటర్లు వణికిపోయారు. అర్ష్ దీప్ (Arshdeep Singh), దీపక్ చహర్ (Deepak Chahar)లు తమ బౌలింగ్ తో హడలెత్తిండంతో తిరువనంతపురంలో జరుగుతున్న తొలి టి20లో సౌతాఫ్రికా 20 ఓవర్లల ో 8 వికెట్లకు 106 పరుగులు మాత్రమే చేసింది. కేశవ్ మహరాజ్ (35 బంతుల్లో 41; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేయడంతో సౌతాఫ్రికా ఆ మాత్రమైనా స్కోరును సాధించగలిగింది. కేశవ్ మహరాజ్ తో పాటు మార్కరమ్ (24 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్), వేన్ పార్నెల్ (37 బంతుల్లో 24; 1 ఫోర్, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. ఇక భారత బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్ 3 వికెట్లతో ప్రత్యర్థి పతనానికి మూల కారణంగా నిలిచాడు. దీపక్ చహర్, హర్షల్ పటేల్ లు చెరో రెండు వికెట్లు తీశారు. అక్షర్ పటేల్ కు ఒక వికెట్ దక్కింది.

15 బంతులు 9 పరుగులు 5 వికెట్లు

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికాను దీపక్ చహర్ తొలి దెబ్బ తీశాడు. ఫామ్ లో లేని తెంబా బవుమా (0) ను డకౌట్ చేశాడు. ఇక రెండో ఓవర్ వేసిన అర్ష్ దీప్ సింగ్ క్వింటన్ డికాక్ (1), రౌసౌ (0), మిల్లర్ (0)లను అవుట్ చేశాడు. ఆ తర్వాతి ఓవర్లో దీపక్ చహర్ స్టబ్స్ (0)ను పెవిలియన్ కు చేర్చాడు. రౌసౌ, మిల్లర్, స్టబ్స్ గోల్డెన్ డక్ (ఎదుర్కొన్న తొలి బంతికే)గా వెనుదిరగడం విశేషం. దాంతో సౌతాఫ్రికా 15 బంతుల్లో 9 పరుగులు మాత్రమే చేసి 5 వికెట్లను కోల్పోయింది.

మహరాజ్ ఒక్కడే

ఈ దశలో మార్కరమ్, పార్నెల్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరు ఆచితూచి ఆడుతు పరుగులు రాబట్టారు. అయితే బౌలింగ్ కు వచ్చిన హర్షల్ పటేల్ మార్కరమ్ ను ఎల్బీగా పెవిలియన్ కు పంపాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన కేశవ్ మహరాజ్ వీరోచిత పోరాటం చేశాడు. అతడు ఆడటంతో సౌతాఫ్రికా స్కోరు బోర్డు 100 మార్కును దాటగలిగింది.

అంతకుముందు టాస్ నెగ్గిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ కోసం భారత్ ఏకంగా నాలుగు మార్పులు చేసింది. హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్ లకు విశ్రాంతి ఇవ్వగా.. వారి స్థానాల్లో రిషభ్ పంత్, అర్ష్ దీప్ సింగ్ లు తుది జట్టులోకి వచ్చారు. నిగిల్ కారణంగా బుమ్రా ఈ మ్యాచ్ కు దూరమయ్యాడు. దాంతో అతడి స్థానంలో దీపక్ చహర్ తుది జట్టులోకి వచ్చాడు. ఇక చహల్ ను పక్కన బెట్టిన భారత్ అశ్విన్ ను తుది జట్టులోకి తీసుకుంది.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Axar Patel, Dinesh Karthik, India vs South Africa, KL Rahul, Rishabh Pant, Rohit sharma, Virat kohli

ఉత్తమ కథలు