హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs SA : ఇదేం టీంరా బాబు.. మీకన్నా గల్లీ క్రికెటర్స్ మేలు.. 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన సఫారీ

IND vs SA : ఇదేం టీంరా బాబు.. మీకన్నా గల్లీ క్రికెటర్స్ మేలు.. 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన సఫారీ

PC : BCCI

PC : BCCI

IND vs SA 1st T20: భారత్ (India)తో మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ ను సౌతాఫ్రికా (South Africa) పరమ చెత్తగా ఆరంభించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగన సఫారీ జట్టును భారత బౌలింగ్ ద్వయం దీపక్ చహర్ (Deepak Chahar), అర్ష్ దీప్ సింగ్ (Arshdeep Singh)లు హడలెత్తించారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

IND vs SA 1st T20: భారత్ (India)తో మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ ను సౌతాఫ్రికా (South Africa) పరమ చెత్తగా ఆరంభించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగన సఫారీ జట్టును భారత బౌలింగ్ ద్వయం దీపక్ చహర్ (Deepak Chahar), అర్ష్ దీప్ సింగ్ (Arshdeep Singh)లు హడలెత్తించారు. వీరి దెబ్బకు సౌతాఫ్రికా తొలి 3 ఓవర్లలోనే ఏకంగా 5 వికెట్లను కోల్పోయింది. మొదటి  15 బంతులు ముగిశాక సౌతాఫ్రికా 9 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది. దీపక్ చహర్ తన తొలి ఓవర్ లో తెంబా బవుమా (0) ను అవుట్ చేయగా.. రెండో ఓవర్ వేసిన అర్ష్ దీప్ సింగ్ క్వింటన్ డికాక్ (1), రౌసౌ (0), మిల్లర్ (0)లను అవుట్ చేశాడు. ఆ తర్వాతి ఓవర్లో దీపక్ చహర్ స్టబ్స్ (0)ను పెవిలియన్ కు చేర్చాడు. రౌసౌ, మిల్లర్, స్టబ్స్ గోల్డెన్ డక్ (ఎదుర్కొన్న తొలి బంతికే)గా వెనుదిరగడం విశేషం.

అంతకుముందు టాస్ నెగ్గిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ కోసం భారత్ ఏకంగా నాలుగు మార్పులు చేసింది. హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్ లకు విశ్రాంతి ఇవ్వగా.. వారి స్థానాల్లో రిషభ్ పంత్, అర్ష్ దీప్ సింగ్ లు తుది జట్టులోకి వచ్చారు. నిగిల్ కారణంగా బుమ్రా ఈ మ్యాచ్ కు దూరమయ్యాడు. దాంతో అతడి స్థానంలో దీపక్ చహర్ తుది జట్టులోకి వచ్చాడు. ఇక చహల్ ను పక్కన బెట్టిన భారత్ అశ్విన్ ను తుది జట్టులోకి తీసుకుంది.

నాలుగు మార్పులు

ఈ మ్యాచ్ కోసం భారత్ ఏకంగా నాలుగు మార్పులు చేసింది. భువనేశ్వర్, హార్దిక్ పాండ్యాలు ఈ సిరీస్ కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. నిగిల్ కారణంగా బుమ్రా ఈ మ్యాచ్ కు దూరం కాగా.. చహల్ ను పక్కన పెట్టింది. వీరి స్థానాల్లో అర్ష్ దీప్ సింగ్, రిషభ్ పంత్, అశ్విన్, దీపక్ చహర్ లను తుది జట్టులోకి తీసుకుంది. గత కొంత కాలంగా యుజువేంద్ర చహల్ పెద్దగా రాణించడం లేదు. దాంతో అతడి స్థానంలో అశ్విన్ ను తీసుకున్నారు. సౌతాఫ్రికా జట్టులో లెఫ్టాండ్ బ్యాటర్స్ ఉండటంతో అశ్విన్ ను తుది జట్టులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

తుది జట్లు

టీమిండియా

రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, పంత్, కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, దీపక్ చహర్, అశ్విన్, అర్ష్ దీప్ సింగ్

సౌతాఫ్రికా

బవుమా (కెప్టెన్), క్వింటన్ డికాక్, మార్కరమ్, రైలీ రౌసౌ, డేవిడ్ మిల్లర్, ట్రిస్టాన్ స్టబ్స్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, నోకియా , షమ్సీ

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Axar Patel, Dinesh Karthik, India vs South Africa, Jasprit Bumrah, KL Rahul, Rishabh Pant, Rohit sharma, Virat kohli

ఉత్తమ కథలు